World Press Freedom Day (ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం)

వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే (ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం)

యునెస్కో సర్వసభ్య సమావేశం సిఫారసు చేసిన తరువాత ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని 1993 డిసెంబర్‌లో యుఎన్ జనరల్ అసెంబ్లీ ప్రకటించింది.

అప్పటినుంచి ప్రతి సంవత్సరం మే 3 న వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే (ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినం) జరగుతూవుంది.

పత్రికా స్వేచ్ఛ పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తుచేసే రోజు మే 3 వ తేదీ.

పత్రికా స్వేచ్ఛ యొక్క ప్రాథమిక సూత్రాలను జరుపుకునేందుకు, ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ యొక్క స్థితిని అంచనా వేయడానికి, వారి స్వాతంత్రియం పై దాడుల నుండి మీడియాను రక్షించడానికి.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు నివాళి అర్పించడానికి , ప్రతి సంవత్సరం మే 3 న ప్రపంచ పత్రికా దినోత్సవం లో ఓ అంశం గా ఉంటుంది.

జర్నలిస్ట్స్ పనితీరులో సమాచార స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను కల్పించేలా సమాచారం అందించడం.

సమాచారం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి మరియు ప్రభుత్వాన్ని మేల్కొనేలా చేస్తూ,తగిన గౌరవం పొందుతూ తమ విధిని నిర్వహించేలా భావ ప్రకటనా స్వేచ్ఛ, హక్కు పొందటం.

ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ వారి తెలిపిన ప్రకారం, 2006 సంవత్సరం లో 155 మంది, 2017 లో 86 మంది, 2019 లో 95 మంది జర్నలిస్టులు విధినిర్వాహణలో ప్రాణాలు కోల్పోయారు.

03 -05 -2020 న 27 వ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుగుతుంది. యునెస్కో నాయకత్వం లో జరిగే ఈ వేడుకులు కు “కరోనా” అడ్డంకి వుండే అవకాశం ఉందా !?

మే 3 న, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం కోసం జాతీయ మరియు స్థానిక వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. అలానే ఆన్‌లైన్ చర్చలు మరియు వర్క్‌షాప్‌లు కూడా జరుగుతాయి.

యునెస్కో మీడియా మరియు సోషల్ మీడియా ఛానెళ్లపై ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. ప్రధానమైన దృష్టి ” “భయం లేదా అభిమానం లేని జర్నలిజం” పై, మరియు మీడియా రంగం లో పెరుతున్న సంక్లిష్టత.

2020 థీమ్:   “భయం లేదా అభిమానం లేని జర్నలిజం”.

అలానే ముచ్చటగా మూడు ఉప థీమ్స్ కూడా యునెస్కో ప్రకటించింది. అవి

1 . మహిళలు మరియు పురుషుల భద్రత జర్నలిస్టులు మరియు మీడియా వర్కర్ల భద్రత.

2.రాజకీయ మరియు వాణిజ్య ప్రభావం నుండి స్వతంత్ర మరియు వృత్తిపరమైన జర్నలిజం.

3. మీడియాలో వున్న అన్ని విషయాలలో, లింగ సమానత్వం.

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం 2020 ను జరుపుకోవడానికి, ఇంటరాక్టివ్ ఉచిత లైవ్ స్ట్రీమ్ ఈవెంట్ యునెస్కో ఏర్పాటు చేసిన “డిఫరెన్స్ డే కాన్ఫరెన్స్ 2020.”, లో మే 3 న పాల్గొనవచ్చు.

అలానే మే 4 , 6 తారీకుల్లో కూడా కోవిద్ -19 సందర్భం పై, వెబ్‌నార్లు మరియు ఆన్‌లైన్ లో ప్రెస్ ఫ్రీడమ్ మరియు టాక్లింగ్ డిస్ఇన్ఫర్మేషన్ పై ఉన్నత స్థాయి సంభాషణలు ఉంటాయి.

ఏప్రిల్ 22 నుండి 24 ఆతిథ్యమిస్తున్న నెదర్లాండ్స్ జరుగవలసిన ఈ కార్యక్రమం అక్టోబర్ 18 నుండి 20 కు మార్చబడింది.

కోవిద్ -19 సందర్భం, వెబ్‌నార్లు మరియు ఇతర డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ ఫేస్‌బుక్ లైవ్, యూట్యూబ్ మరియు మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా ఆన్‌లైన్ చర్చలు, వివరాలు యునెస్కో సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

జర్నలిజం పై అభిరుచి కలిగి దాని యొక్క భాద్యత,విలువలు,నైతికత మరియు నిబద్దత లు తెలుసుకోవాలనుకొంటున్న ఫ్రీలాన్సర్స్ మరియు సోషల్ మీడియా లో పాల్గొంటున్న నేటి తరం “యువత”  ఈ కార్యక్రమాలలో పాల్గొని, నేర్చుకొని నైతిక ప్రవర్తన ఎరిగి మంచి పరిశీలనాసక్తి తో సమాజ సేవ చేస్తారని భావిస్తూ.

Leave a Reply

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!