
SUN AND CLOUDS
హలో మిత్రులారా
“ఓజోన్” అనే మాట అడపాతడపా వింటూనే ఉంటాం!
అసలు ఓజోన్ అంటే ఏమిటి! దీనివలన భూమి కి కలుగుతున్న మేలు ఏమిటి!! ఈ ఓజోన్ కనుక లేకపోతె!!! ఏమవుతుంది!? ఇలాంటి విషయాలు తెలుసుకొందాం!!!!
సెప్టెంబర్ 16 వ తారీకు న “వరల్డ్ ఓజోన్ డే” గా ప్రతి సంవత్సరం జరుపుకొంటున్నాం!
సూర్య కుటుంబం లో “భూమి” ఓ గ్రహం! దీనిపై ప్రాణకోటి జీవిస్తూ వుంది. అందులో “ప్రకృతి” రూపాలైన జంతు జీవకోటి మరియు మొక్కలు.

OZONE LAYER
భూమి తన చుట్టూ తానూ తిరుగుతూ! సూర్యుడు చుటూ తిరుగుతుంది!! దీనితో రాత్రి పగలు, ఋతువులూ ఏర్పడు తున్నాయి అని చెప్పాలా!? చిన్నపుడు నుంచి చదువుకొన్నదే కదా! లేక విన్నదే కదా!!
సూర్యుడు లేకుంటే! మనము లేము! సూర్య శక్తి లేకపోతె!! మన మనుగడే లేదు! ఇంతటి అద్భుతమైన శక్తి లో కూడా కొన్ని “ప్రకృతి” కి హాని చేసేవి ఉండటం సహజమే కదా!
అలాంటి హాని చేసే వాటిలో “అతి నీల లోహిత కిరణాలు” ప్రధానమైనవి.
వీటినుండి హాని కలుగకుండా ఓ ఏర్పాటు వుండే వుంటుంది కదా! అదే నేటి మన హీరో “ఓజోన్ పొర”.

OZONE LAYER- EARTH -SUN
స్ట్రాటో ఆవరణలో “ఓజోన్” ఉంటుంది. భూమి చుట్టూ సుమారు 10 నుంచి 48 కిలోమీటర్లు దాకా వ్యాపించి ఉంటుంది. దీనిని ఓజోనోస్పియర్ అని కూడా పిలుస్తారు.
ఈ లేయర్ లోకి సూర్యుని నుంచి వచ్చిన కిరణాలు ప్రసరించినపుడు హానికారకమైన “ఆల్ట్రావైయోలెట్” రేడియేషన్ ఎక్కువ శాతం ” డీకంపోజ్డ్ ” ఐపోతుంది.
ఓజోన్ పొర 290 నానోమీటర్ల కంటే తక్కువ తరంగదైర్ఘ్యాల యొక్క అన్ని సౌర వికిరణాలను( రేడియేషన్లు) భూమి యొక్క ఉపరితలం చేరుకోకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుంది
సూర్యుడి నుండి భూమి యొక్క ఉపరితలం వరకు ప్రయాణించేటప్పుడు హానికరమైన ఈ “అతి నీల లోహిత కిరణాలు” ను “ఓజోన్ పొర” ఫిల్టర్ చేస్తుంది.
భూమి పై వున్న జంతువులు మరియు మొక్కలు ఈ హానికరమైన రెడీయేషన్ నుంచి రక్షించబడుతున్నాయి.
శాస్త్ర విజ్ఞానం పెరిగి మనిషి అవసరాలు కోసం సౌకర్యం,సుఖం కోసం అనేక వస్తువులు కాలక్రమేణా కనిపెట్టబడి వినియోగానికి ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి చేయటం. ఓ అలవాటుగా మారింది.

FACTORIES-POLLUTION -EARTH
దీనితో ఎన్నో కర్మాగారాలు ఏర్పడ్డాయి. వీటినుంచి వచ్చే వ్యర్థాలు భూమి పై వున్న గాలి,నీరు లోకి క్రమక్రంగా చేరి “పొల్యూషన్” అనే కొత్తపదం నిగంటువులోకి చేరింది.
సౌకర్యాలు,సుఖం, సంపద లతో పాటు అనేక “కొత్త కొత్త” రుగ్మతలు కూడా జనియించాయి.
వాటిని ఎదుర్కోవటం కోసం వైద్య విధానాలు,మందులూ,మాకులూ వీటిని తయారు చేయటానికి మరి కొన్ని కర్మాగారాలు, ల్యాబ్ లు, పరిశోధనలు.
ఈ పరిశోధనలో సహజ రక్షణ కవచంగా వున్న “ఓజోన్ పొర” యొక్క “క్షీణత” ను గుర్తించారు.
క్లోరోఫ్లోరోకార్బన్లు మరియు ఇతర మానవనిర్మిత రసాయనాల వలన ఈ హాని జరుగుతుంది అని కనుకొన్నారు.
భూమినుంచి ఈ హానికరమైన రసాయనాలు తగ్గించటానికి లేక పూర్తిగా నిర్మూలించటానికి అనుగుణంగా మనము మారాల్సిన అవసరం ఎంతో వుంది.

OZONE – EARTH
జనవరి 1, 1985 న మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం ఈ హానికారకమైన రసాయనాలను వాతావరణం నుండి నిర్మూలించే ప్రయత్నంగా అమలు చేయబడింది.
ఓజోన్ లేయర్ కి ప్రధాన శత్రువైన “క్లోరోఫ్లోరోకార్బన్లు” యొక్క విడుదల రిఫ్రిజిరేటర్లలో ఉపయోగించే రసాయనాలు నుండి, ఇన్సులేటింగ్ ఫోమ్ మేరకు సోల్వెంట్లు నుండి జరుగుతుంది.
ఐతే రాను రాను అనేక ఇండస్ట్రియల్ అవసరాలకు మేరకు మరియు పంటలు, ధాన్యాలు,కూరగాయలు, పండ్లు మొదలైన ఆహారన్నీ నిలువ ఉంచేటకు శీతల గిడ్డంగుల అవసరాలు పెరిగాయి.
అలానే, శీతల పానీయాలు ఉత్పత్తి చేసే కారాగారాల్లో కూడా దేని అవసరం ఎంతో ఎక్కువ. దీనితో ” రిఫ్రిజిరేటర్లలో ఉపయోగించే రసాయనాలు” ఉత్పత్తి మేరకు వినియోగం పెరిగింది.

OZONE LAYER
“క్లోరోఫ్లోరోకార్బన్లతో” పాటు పురుగుమందులతో వాడే “మిథైల్ బ్రోమైడ్”, పరిశ్రమల ద్రావకాలలో వినియోగించే “మిథైల్ క్లోరోఫామ్” మరియు ” హాలోన్లు”ని వినియోగించి చేసే అగ్నిని ఆర్పే (అగ్నిప్రమాదాలు జరిగినపుడు) కొన్ని రసాయనాలు “ఓజోన్” పొర క్షీణత లో పాత్ర పోషిస్తున్నాయి.
గత 35 సంవత్సరాలగా ఈ ఓజోన్ డే ని జరుపుకొంటున్నాం. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము ఆనాడు “మాంట్రియల్” తీర్మానం ప్రకారము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 16 న “ఇంటర్నేషనల్ ఓజోన్ డే” ను జరుపుకొంటున్నారు.
ఈ 2020 ఇయర్ స్లోగన్ ” —– “ఓజోన్ ఫర్ లైఫ్”
ప్రపంచ “ఓజోన్ దినోత్సవాన్ని” పాటిస్తున్నప్పుడు, వాతావరణంలో “సున్నితమైన సమతుల్యతను” గుర్తుంచుకోని దానికి అనుగుణముగా మనము ఏర్పాట్లు చేసుకోవటం ముఖ్యం.
ఈ ఓజోన్ లేయర్ యొక్క తరుగుదల ప్రమాదాన్ని గుర్తించి,దానికి తగిన విధంగా మార్పులు చేసుకొని ‘ఓజోన్ ఫర్ లైఫ్’ అనే నినాదం కి కట్టుబడి ఉండాలని.

AVOID DANGER CHEMICALS
భూమిపై స్థిరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితం అందరికి వుండేలా “పర్యావరణాన్ని” కాపాడాలని ప్రపంచములో వున్న మేధావులని, రాజ్యాధి నేతలను కోరుకొంటున్నాము.
ఇంటర్నేషనల్ డే ఫర్ ప్రిజర్వేషన్ అఫ్ ది “ఓజోన్ లేయర్” శుభాకాంక్షలతో….