
COMPOSITION OF BLOOD
హలో మిత్రులారా
సెప్టెంబర్ 1 నుంచి పూర్తిగా ఎటువంటి ఆంక్షలు లేకుండా లాక్ డౌన్ తొలిగించే అవకాశం ఉందని అందరి భావన!
కరోనా కేసులు రోజుకి రోజుకి పెరుగుతూనే వున్నాయి. ఇదిగో వ్యాక్సిన్ అదిగో వ్యాక్సిన్ అని వచ్చే వార్తలు. టాబ్లెట్స్ వచ్చాయి. ఖరీదు ఎక్కవటగా, అందరికి అందుబాటులో ఉంటాయా! అనే అనుమానాలు.
కరోనా ఉనికి బయటపడి సుమారు 270 రోజులు గడిచిపోయాయి!

COVID ON THE EARTH
వూహ తెలిసిన వారినుంచి ఊపిరి పోయే వారి వరకూ ప్రపంచమంతా తెలిసిన ఒకే ఒక మాట – – – “కరోనా”
మరణాల శాతం తక్కువగా వున్నా కరోనా సోకిన వారి స్థితి పరిస్థితి అందరికి ఒక లా లేదు.
కొందరికి త్వరగానే నెగటివ్ వస్తుంది. కొందరికి నెగటివ్ వచ్చినా ఇంకా కొన్ని లక్షణాల్తో తిరిగి చికిత్సకు హాస్పిటల్ కు వెళ్లాల్సి వస్తుంది. ఈ మధ్య ఈ కోవిడ్ నివారణకు ఎక్కువగా వినిపిస్తున్న మాట “ప్లాస్మా” చికిత్స!!!

GROUPS OF BLOOD
“ప్లాస్మా” అంటే ఏమిటి!? ఇది ఎక్కడ దొరుకుతుంది. ఈ విధానం తో కరోనా ని ఎదుర్కొన వచ్చా? ఈ విషయాలు అన్ని వివరంగా సచిత్రంగా తెలుసుకుందాం!
కరోనా వ్యాధి సోకి తగ్గి పోయి పూర్తిగా ఆరోగ్యం గా వున్న వ్యక్తుల నుంచి “ప్లాస్మా” సేకరిస్తారు.
ఇది లేత పసుపు పచ్చని రంగులో ఉంటుంది. మరి “ప్లాస్మా” ఎక్కడ ఉంటుంది. ఇది మనలో వున్న ఏ భాగంలో ఉంటుందో తెలుసుకుందాం.

PLASMA
మనలో రక్తం సుమారు 4.5 నుంచి 6 లీటర్లు వారి వారి బరువును పట్టి, వయసును పట్టి ఉంటుంది.
అప్పడే పుట్టిన పిల్లలో రక్తం సుమారు 250 ఎం.ఎల్ ఉంటుంది.
వయసుతో పాటు బరువును పట్టి పిల్లలు లో 2.5 లీటర్లు కు పెరిగి, యుక్త వయసు వచ్చే టప్పటికి 4.5 లీటర్లు నుంచి 6 లీటర్లు వరకు పెరుగుతుంది.
ప్రధానంగా రక్తం లో నాలుగు భాగాలుగా విభజించవచ్చు. ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్ మరియు ప్లాస్మా.
జీవక్రియ ప్రతిచర్యలకు అవసరం ఐన “ఆక్సిజెన్” ను రక్తం లో ని కొన్ని కాణాలు కలిగివుంటాయి.
ఆక్రమణ చేసి, జీవ కణాలను నాశనం చేసే వాటి పై ఎదురు దాడి చేసి రక్షించే కణాలు కూడా రక్తం లో ఉంటాయి.

ANATOMY OF BLOOD VESSEL
చర్మం శరీర భాగాలను కాపాడుతుంటుంది. ప్రమాదవశాత్తు రక్తం కారుతున్నపుడు “రక్తం” గడ్డ కట్టి ఎక్కువ రక్తం పోకుండా వుండటానికి అవసరమైన “రక్త”కణాలు రక్తం లో ఉంటాయి.
శరీరం లోని ప్రతి కణానికి కావలిసిన “ఆక్సిజెన్” (ఇంధనం) సరఫరా చేయటానికి రక్తం లోని ద్రవభాగం దోహద పడుతుంది.
విసర్జన వ్యవస్థని, కార్బన్ డయాక్సైడ్ లను నియంత్రిసూ “శ్వాసకోశములు” యొక్క పని తీరును విశ్లేషిస్తూ తదనుగుణంగా శ్వాస ప్రక్రియను అదుపుచేస్తుంది.
“ఎరిథ్రోసైట్లు” అని పిలవబడే ఎర్రరక్త కణాలు యొక్క ముఖ్యమైన పని “ఆక్సిజెన్” ను శరీరము లో వున్న అన్ని భాగాలుకు నిరంతం పంపిణీ చెయ్యటం.
ఎర్రరక్త కణాలు లో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇది ఆక్సిజెన్ ని పంపిణీ చేయటమే కాకుండా కార్బన్ డయాక్సైడ్ను నియంత్రిసూ స్వీకరించి ఊపిరి తిత్తులకి పంపించే కార్యక్రమం కూడా దీని ముక్యమైన పని.
తెల్ల రక్త కణాలు వీటిని “ల్యూకోసైట్లు” అని కూడా పిలుస్తారు. రోగనిరోధక వ్యవస్థ నియంత్రణ ఈ కణాల ముఖ్య విధి.
తెల్ల రక్త కణాల సంఖ్య మీద రోగ నిరోధక శక్తి ఆధారపడి ఉంటుంది. రోగాలనుంచి అంటు వ్యాధులనుంచి ఇవి కాపాడుతూ ఉంటాయి.

PLASMA IN BLOOD
తరుచూ అనారోగ్యానికి గురి వుంటుంటే వారికి తెల్ల రక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు గుర్తించవచ్చు. అలానే రక్తం లో ఏమైనా ఇన్ఫెక్షన్ కు గురైఉండవచ్చు.
ప్లేట్లెట్స్ ను “రక్తఫలకికలు” అని కూడా పిలుస్తారు. ఇవి ప్రదానం గా రక్తం గడ్డకట్టం లో తోడ్పడతాయి. గాయం నుంచి రక్త స్రావం ఎక్కువ కాకుండా రక్షిస్తాయి.
ఇప్పడు మన నేటి హీరో “ప్లాస్మా” . ఇది ద్రవపదార్థం. ప్లాస్మా రక్తంలో అతిపెద్ద భాగం.
రక్తంలో రెడ్ బ్లడ్ సెల్స్ 41 శాతం, వైట్ బ్లడ్ సెల్స్+ ప్లేట్లెట్లు 4 శాతం, “ప్లాస్మా” 55 శాతం కలిగి ఉంటుంటుంది. “ప్లాస్మా” రక్త ప్రవాహంలో “ప్రవాహం”!
ప్లాస్మా లో నీరు, అతి ముఖ్యమైన ఎంజైమ్లు, పోటీన్లు మరియు లవణాలు కలిగి ఉంటాయి.

plasma in blood (Imaginary)
పోషకాలు, హార్మోన్లు మరియు ప్రోటీన్లను శరీర భాగాలకు తీసుకెళ్లడం “ప్లాస్మా” యొక్క ముఖ్యమైన భూమిక.
శరీర కణాలు విసర్జించిన వ్యర్ధ పదార్ధాలను కూడా “ప్లాస్మా” సేకరించి తొలగించటానికి ఉపయోగపడుతుంది.
“ప్లాస్మా” లో ప్రతిరోధకాలు, గడ్డకట్టే కారకాలు, ఫైబ్రినోజెన్ మరియు అల్బుమిన్ అనే ప్రోటీన్లు ఉన్నాయి.
దీనికి వున్న పై లక్షణాలు ను పట్టి ” అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ” ప్లాస్మా” తో చికిత్స చేస్తారు.
ఇప్పడున్న ఈ కరోనా వ్యాధి చికిత్సలతో భాగం గా “ప్లాస్మా” చికిత్స కూడా చేసున్నారు.
అందుకే “ప్లాస్మా” ను డొనేట్ (దానం) చెయ్యటానికి ముందుకు రావలసినదిగా అర్హులైన వారిని కోరుతున్నారు.
ప్లాస్మా దానాన్ని “ది గిఫ్ట్ అఫ్ లైఫ్ ” అని పిలుస్తారు.
చికిత్స లో వాడటం ద్వారా ఓ జీవితాన్ని రక్షించవచ్చు కనుక నే “జీవిత బహుమతి” అని అనటం నూటికి నూరుపాళ్లు సమంజసం.
ప్రతేకమైన యంతం ద్వారా రక్తం నుంచి ప్లాస్మాను వేరుచే ప్రక్రియను “ప్లాస్మాఫెరెసిస్” అంటారు!
ప్లాస్మాను సేకరించిన తరువాత మిగిలిన ఎర్ర రక్త కణాలు మరియు ఇతర రక్త భాగాలు మీ శరీరానికి కొద్దిగా సెలైన్ (ఉప్పు) ద్రావణంతో ప్లాస్మా “దానం” చేసిన వారికి తిరిగి ఇస్తారు.
ఆర్యోగవంతులు నెలకి ఒక సారి “ప్లాస్మా” దానం చేయవచ్చు. రక్త గ్రూపులు లో “AB ” గ్రూప్ వారు అరుదుగా వుంటారు. వీరు నూటికి 4 శాతం మాత్రమే వుంటారు.
అరుదుగా వున్న ఈ గ్రూప్ ప్లాస్మా ఏ గ్రూప్ వారికైనా వినియోగించవచ్చు. అందుకే ఈ గ్రూప్ ప్లాస్మా ని “యూనివర్సల్” గ్రూప్ క్రింద పరిగణిస్తారు.

DONATE BLOOD
అర్హులైన యువతీ,యువకులందరూ రక్తదానం/ ప్లాస్మా దానం పై అవగాహన పెంచుకొని వీలున్నప్పుడల్లా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమాజ సేవ చేసి ఆత్మ తృప్తి పొందుతారని ఆశిస్తూ …
good information sir
ధన్యవాదములు సార్, మీరు మంచి సలహాలు ఇచ్చి నన్ను ఆదరించి. ఈ జెస్టుగురు బ్లాగ్ ని మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ – సదాశివ / జెస్టుగురు