VIZAG GAS LEAK (వైజాగ్ గ్యాస్ లీక్ )

వైజాగ్ గ్యాస్ లీక్ – సమాచారం

కరోనా తో సతమతమవుతూ అప్రమత్తం గా ఇంట్లో వుంటూ, అవసరం మీదే బయటకు వస్తూ వున్నాం.

ఇంతలో, ఈ వైజాగ్ గ్యాస్ లీక్ – వార్త — ఎంతటి విషాదకరం!

పంచ భూతాల్లో భూమి, గాలి,నీరు,అగ్ని,ఆకాశం —  ప్రకృతి సర్వ హక్కు భుక్తాల తో “జీవ కోటికి” ప్రసాదించిన వరాలు.

జాతి,మతం,కులం,ప్రాంతం,వర్గం,బలం,బలహీనత, పేద,గొప్ప,రంగు,రూపు తేడాలు లేకుండా జీవమున్న అన్నిటికి సమానంగా ఉండాల్సిన పంచ భూతాలు — నేడు

జరిగిన కాలమాన పరిస్థితులతో, ఈ పంచ భూతాల లో కొన్ని కొందరి చెప్పు చేతుల్లో కి వెళ్లగా మిగిలినవి… “గాలి, అగ్ని, ఆకాశం”.

ఆంధ్ర ప్రదేశ్ లో అగ్రగామి “పారిశ్రామిక నగరం” వైజాగ్ (విశాఖపట్టణం) లోని ఓ పారిశ్రామిక వాడ నుంచి ప్రమాదవశాత్తు ‘బంధనాలు’ తెంచుకొని “గాలి” లో స్వేచ్ఛగా కలిసిపోయిన ఓ “విషపూరిత వాయువు” ప్రాణకోటికి తీవ్ర నష్టం కలిగించింది.

ఎంతో విచారకరం! ఒళ్ళు గగుర్పాటు చెందుతుంది !!  కళ్ళు వెంట నీరు జల జలా రాలుతున్నాయి!!!

ఎంత అల్పమైనదీ ఈ ప్రాణం అన్పిస్తుంది కదా! నిజమే, ఇలా అన్పించటమూ తాత్కాలికమే !! ఇలాంటి ప్రమాదాలు గతంలో ఎన్ని జరగలేదు. ఎన్ని చూడలేదు!!!

ఇలాంటప్పుడే కదా! మనమంతా చేయిచేయి కలిపి సమిష్టి కృషిల్తో బాధితులకి దైర్యం తెలియ చెప్పి ప్రభుత్వం మరియు స్వచ్చంద సంస్థలు ఆదుకొని తిరిగి సాధరణ జీవన పరిస్థితులని కల్పించాల్సినది.

ఇంతకీ, అక్కడ ఏమి జరిగిందో పూర్తిగా మనకు తెలియకపోయినా, జరిగిన ప్రమాదంలో, వెలువడి గాలిలో కలిసి ప్రమాదానికి కారణమైన “స్టైరీన్” (Styrene ) గురుంచి తెలుసుకొందాం.

“స్టైరీన్” దీనిని “ఇథినైల్బెంజీన్”, “వినైల్బెంజీన్” మరియు “ఫెనిలేథీన్” అని కూడా పిలుస్తారు.

బెంజీన్ ఉత్పత్తి అయిన ఈ “స్టైరీన్” జిడ్డుగల రంగు లేని ద్రవం. ఉత్పత్తి మొదటి దశలో కొంత “పసుపు” రంగు కలిగి ఉంటుంది.

ఈ సమ్మేళనం తేలికగా ఆవిరైపోతుంది, కొద్దిగా తీపి వాసన కలిగి ఉంటుంది. ఎక్కువ సాంద్రత కలిగివున్నచో, కొద్దిగా ఒకరకమైన ప్లెజంట్ ఓడోర్  (ఆహ్లాదకరమైన వాసన) తో ఉంటుంది.

ఇక “స్టైరీన్” రసాయన సాంకేతికత ” C6H5CH = CH2 ” అనే సేంద్రీయ సమ్మేళనం.

మనకి తెలిసిన సమాచారం ప్రకారం, వైజాగ్‌లో గ్యాస్ లీక్ అయినప్పుడు, వందల మరియు వేల మంది ప్రజలు దీనిని పీల్చుకున్నారు.

అపస్మారక స్థితిలో పడిపోయారు లేదా శ్వాస సమస్యలు వచ్చి ఇబ్బంది కి లోనైనారు అని తెలుస్తుంది.

ఈ సమాచారమంతా టీ.వీ ల ద్వారా ఇప్పటికే ప్రపంచానికి తెలిసింది. కనుక వీటిలోకి పోకుండా ఈ “స్టైరీన్” గాలిలో కలవటం వలన జరిగే కష్ట,నష్టాలు గురుంచి తెలుసుకొందాం!

“స్టైరిన్” బహిర్గతం అయి గాలిలో కలిసినపుడు, ఆ వాతావరణంలో వున్నవారికి, వెనువెంటనే కలిగే ఇబ్బందులు కళ్ళు, చర్మం, ముక్కు ఓ విధమైన చికాకుకు లోనవడం. గాలి తీసుకోవటం లో ఇబ్బంది కలిగి శ్వాస బరువుగా వుండటం జరుగుతుంది.

దీర్గకాలికంగా, పలు విధములైన ఇబ్బందులకు లోనయ్యే ప్రమాదం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. 1 . అలసట తో కూడిన బలహీనత 2 . వినికిడి లోపాలు కలగటం. 3 . ఎక్కువగా తలనొప్పి రావటం, అలానే డిప్రెషన్ కు లోనవడం. 4 . ఏకాగ్రత సమస్యలు
5 . కేంద్ర నాడీ వ్యవస్థ లో లోపాలు 6 . మూత్రపిండాల పై ప్రభావం మరియు 7 . కేన్సర్ లు వచ్చే ప్రమాదం.

ఈ “స్టైరిన్” బహిర్గతం అయి గాలిలో కలిసినపుడు, తీసుకోవలసిన ప్రధమ జాగ్రత్తలు నీటితో కళ్లని, చర్మాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవటం. వాయువును పీల్చకుండా ముక్కును, నోటిని తడి గుడ్డ తో మూసిఉంచటం చేయాలి.

ఇంకా ఈ “స్టైరిన్” గురుంచి మరికొంత సమాచారం —

మండే స్వభావం కలిగిన “స్టైరిన్” పాలీస్టైరిన్ ప్లాస్టిక్స్, ఫైబర్ గ్లాస్, లేటెక్స్, రబ్బర్ ల తయారీ లో వినియోగిస్తారు.

ఇది, సహజంగా చాలా తక్కువ పరిమాణం లో కూరగాయల్లో, పండ్లలో,మాంసములలో,  నట్స్ మరియు  బెవరేజెస్ లో ఉంటుంది.

అలానే, ఆటోమొబైల్స్ పొగలో, సిగరెట్, చుట్ట పొగలో కూడా ఈ “స్టైరిన్” కొద్ది శాతం కలిగివుంటుంది.

ఆటోమొబైల్ పార్ట్శ్, ఫుడ్ కంటైనర్లు, ఫ్లోర్ వాక్సీస్, పోలిషెస్, బొమ్మలు (టాయ్స్),ప్రింటింగ్ కాట్రిడ్జెట్స్ మరియు ప్యాకింగ్ ఇండస్ట్రీస్ లో “స్టైరిన్” ని వినియోగిస్తారు.

ఈ ప్రమాదం లో అసువులు కోల్పోయిన అందరికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబాలకి ప్రగాడ సానుభూతి తెలుపుతూ, ప్రమాదం లో చిక్కుకున్న మిగతా వారందరూ త్వరగా కోలుకొని, మంచి ఆరోగ్యం తో జీవనం గడుపుతారని ఆశిస్తూ.

 

Leave a Reply

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!