UGAADI-ఉగాది

                                                         UGAADI – ఉగాది

ugadi

Carona-Ugadi

కరోనా ఉగాది … ఉగాది కరోనా

కరోనా విలయ తాండవానికి భయకంపితులైన మానవ లోకం కోసం!
ప్రకృతి ని ప్రార్థిస్తూ ….
ఓ కోయిల ఆర్త నాదం
అమ్మా ప్రకృతి మాతా…
నీ కన్నెర్ర కి కకా వికలమైన

ఈ అధమ “ప్రధమ” బుద్ద జీవిని !
మన్నించు …. మన్నించు… మన్నించు

ఆకాశమ్లోకి అందినంత వరకూ ఎగిరాడు
భూమిలో వీలైనంత లోతుగా దూకాడు

మేధసు కే డూప్లికేట్ “ఆర్టిఫిషల్ తెలివి” తేటలు అన్నాడు!

మానవ యంత్రాల కనుసన్నల్లో “స్వర్గం” నా వాకిలి ముందే అని కలలు కన్నాడు!!

కాఫీ జపాన్లో, టిఫిన్ చైనాలో, లంచ్ లండన్ లో, స్నాక్స్ చెక్ లో, డిన్నర్ క్యాసినోవా లాస్ వేగాస్ లో!!!

ఎడం కాలు రష్యాలో, కుడి కాలు యునైటెడ్ స్టేట్స్ లో చంద్రుని పై తల!?

ఆహా! ఎంత ప్రగతి!! ఎంత ప్రగతి!!!

మానవుడే … ఓ మహనీయడు… యక్తి పరుడు!, మహా శక్తి పరుడు!?
తన ముందు ఎవరైనా…దిగడుపే

ఎనెన్ని కనిపెట్టాడు ….
తన “సౌఖ్యం” కోసం!
ఎంత సౌఖ్యం!!…ఎంత సౌఖ్యం!!!

లోకాన్ని అంత చుట్ట చుట్టి అరచేతి లో ఒదిగే టంత
ప్రకృతా నీవెంత నా మేధస్సు ముందు!

ఓ వికృత అట్టహాసం! విర్ర వీగిన వెర్రి పిచ్చి చేష్టలు!!

ప్రకృతి మాత ఆర్డర్ 

పంచ భూతాలకి

పంచ భూతాలన్నీ మీటింగ్
మనము “వీడీని” ఇలా వదిలేస్తే..
వీడు ఆరో భూతం అవుతాడు…

ఏ జంతువునీ, చివరాఖరికి నల్లిని,పిల్లిని,బల్లిని, జర్రీని లాంగించేసున్నాడు “కర్రీలా” 

చివరాకరికి వాడి “నాలుకని” వాడే  “తినేలా”  వున్నాడు

“మనిషి” ని “మనిషి” మార్చిలేనపుడు ఏ కదా మన అవసరం( పంచ భూతాలు స్వగతం)
ముందు ఓ షాక్ ఇద్దాం వాడు తినే తిండి లోనుంచే!

అంతే! జస్ట్!! ఓ నిముషం లో కనిపించని రూపం లో “కరోనా”!!!

ప్రకృతి  ఆచరిస్తుంది “శంఖ ప్రక్షాళన” 

ఫలితం నేడు అనుభవిస్తున్న మూగరోదన  “ప్రపంచమంతా” !

ఈ పాపం “ఎవరిదో” !?  ఈ పుణ్యం “అందరిది” !?

ఎన్ని మతాలు?

ఎంతమంది దేవుళ్లు, దేవదూతలు!
గుళ్ళు,చర్చిలు,మసీదులు !!

ముడుపులు,మొక్కులు,ప్రార్ధనలు !!!

ఎవరికి చెప్పుకోవాలి! 

ఎవరు అడ్డుకోవాలి

మూగ రోదన!  తరగని ఆవేదన !!

ప్రపంచం అంతా “గుప్పెట్లో”  నిన్న
వాకిలి కూడా దాటలేని “స్థితి” నేడు

రాజ్యాలు ఏలినా, సౌధాలు కట్టినా, సముద్రాలు ఈదినా, భూమి ఆకాశాలు ఛేదించినా

నీ కాటి గోటి కి సమానమా!?

అమ్మా!  “ప్రకృతి మాతా” 
శరణు, శరణు, శరణు.

nature

Bliss

 

 

Leave a Reply

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!