THE HISTORY OF DATES FRUIT AND IMPORTANT HEALTH POINTS

DATE PALM TREE

హలొ మిత్రులారా!

ఈ రోజు 29-08-2020 “తెలుగు భాషా దినోత్సవం”. నేడు గిడుగు వారి పుట్టినరోజు.

ప్రకృతి లో తీయనైన వాటిలో తేనె,అతిమధురం(మూలిక),చెఱకు మరియు ఖజ్జూరం …. ఇంకా వున్నాయి అనుకోండి!

భాషా ప్రపంచంలో “తెలుగు” అన్నిటి కన్నా తీయనైనది!

ఆ భాష లోని సాహిత్యం,గ్రంధాలు,పాఠ్య పుస్తకాలు అందరికి అందాలి అని “గ్రాంధిక” శైలిని “వ్యవహారిక భాష గా” రూపొందిన, ఈ రోజున ప్రకృతి ప్రసాదించిన మరో మధురమైన “ఖజ్జూరం” గురుంచి తెలుసుకొందాం!

కనీసం 50 మిలియన్ సంవత్సరాలు క్రితమే “ఖర్జూరం” మానవునికి తెలుసు అని శిలాజాలములో దొరికిన రుజువులని పట్టి తెలుసుంది.

DATES FRESH FRUIT

“ఖర్జూరం” క్రీస్తు పూర్వం చాలా కాలము నుంచే మధ్యప్రాచ్యం మరియు సింధు లోయ లలో ప్రధాన ఆహారంగా వుండేది!

ఇరాక్ “ఖర్జూరం” కు పుట్టిన ప్రాంతం గా ఎక్కువ మంది నమ్ముతారు.

పాత నిబంధనల గ్రంధం ను పట్టి పాత తరం హెబ్రీయులు ఈ పండ్లను వినియోగించి పలురకాల ఆహార పదార్డములతో పాటు, వైన్ కూడా చేసేవారు అని తెలుసుంది!

ఖర్జూరం కలపతో ఆహార పదార్ధములు నిలవ ఉంచే కలప పాత్రలు,పెట్టెలు తయారు చేసేవారు.

RED COLOUR DATES

“ఖర్జూరం” లో చాలా రకాలు వున్నాయి. కాయలు పచ్చిగా వున్నపుడు ముదురు ఆకు పచ్చ , పసుపురంగు లోనూ, మరియు ఎరుపు రంగులోనూ ఉంటాయి.

పండిన తరువాత గోధుమ మరియు నలుపు గోధుమ రంగుల కలగలుపు లో నూ ఉంటాయి.

రంగును పట్టి,పరిమాణంను పట్టి మరియు రుచిని పట్టి వేరు వేరుగా వున్నా అన్నిటి లో దాదాపు పోషకాలు,ఖనిజాలు సమానమే.

ఇవి మనకు తాజా గాను, ఎండు ఫలములు గానూ లభిస్తాయి. ఈ మధ్య వీటితో లిక్విడ్/సిరప్ ను కూడా తయారు చేస్తున్నారు.

కొన్ని ఏళ్ల క్రితం వరకు “ఖర్జూరం” అనగానే రంజాన్ పండుగకు ఒక్క పొద్దు విరమించిన తరువాత తినే ఫలం గా నే ఎక్కువగా తెలుసు. సంవత్సరం లో కొద్ది నెలలు మాత్రమే లభించేవి.

DATES ON TREE

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లు, కోల్డ్ స్టోరేజీ ఇండస్ట్రీ దేశమంతా విస్తరించినవో “ఖర్జూరం” లభ్యత అన్ని కాలంలో దొరకటం, అందరికి అందుబాటులోకి రావటం జరిగింది.

రకాన్ని పట్టి,లభ్యతను పట్టి, పండిన ప్రాంతాన్ని పట్టి కేజీ ఖరీదు 120 రూపాయల నుంచి 1500 రూపాయల వరకూ ఉంటుంది.

మన దేశానికి ఎక్కువగా ఇరాన్,ఇరాక్, అరేబియా దేశాలనుంచి దిగుమతి అవుతుంది.

మన దేశంలో రాజస్థాన్,గుజరాతి,తమిళనాడు,కేరళ లలో ఖజ్జురం పంట సాగులో వుంది. అలానే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లా లో కూడా సాగు చేస్తున్నారు.

మొక్కలు నాటే పద్దతి, టిష్యూ కల్చర్ ద్వారా వీటిని పెంచుతారు. సుమారు 6 ఏళ్ల నుంచి కాయలు కాస్తాయి, అప్పటినుంచి 60 ఏళ్ల వరకూ దిగుబడిని ఇస్తాయి.

DATE PALM TREE PLANITATION

మొక్కల మధ్య దూరం ఎక్కువగా అవసరం అవుతుంది కనుక ఒక హెక్టర్ లో 160 ముంచి 170 మొక్కలు మాత్రమే వుండే అవకాశం వుంది.

వీటిలో 10 శాతం మేల్ (మొగ)లు ఉండేలా చూసుకోవటం ఎంతో అవసరం.

ఇప్పడు చాలా దేశాల్లో పండిస్తూవున్నా “ఇరాన్” ప్రపంచములో నే ప్రధాన ఎగుమతి దేశంగా వున్నది. ఇక్కడ లభించే రకాలు మేలైన నాణ్యత కలిగి ఉంటాయి అని ప్రసిద్ధి.

ఆహార పంటలు నిలువ చేసే సాంకేతికత మరియు పంట సాగు విస్తీర్ణం పెరగటం తో అన్ని కాలాల్లో నేడు “ఖజ్జూరం” దొరుకుతుంది.

“ఖజ్జూరం” తీపి రుచి తో మధురముగా ఉంటుంది. దీనిలో చెక్కర శాతం అధికం.

అలానే ఐరన్,కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం,రిబోఫ్లావిన్ విటమిన్ కే,సెలీనియం కాపర్ మరియు నికోటినిక్ ఆమ్లం లు వున్నాయి.

DRIED DATES

నీటి లో కరిగే గుణము వున్న మంచి ఫైబర్ సమృద్ధిగా వుంది.

నికోటినిక్ ఆమ్లాన్ని నియాసిన్ లేక విటమిన్ బి 3 అని కూడా పిలుస్తారు. ఈ నియాసిన్ నాడీవ్యవస్థని, జీర్ణ వ్యవస్థని మరియు చర్మ ఆరోగ్య సంరక్షణ లో సహాయకారిగా ఉంటుంది.

ఆహారంలో నిత్యం “ఖర్జూరం” చేర్చుకోవటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు, అవి ఏవో తెలుసుకొందాం.

1 . గుండెను బలపరిచి పని తీరును క్రమ పర్చటంలో సహాయ కారిగా ఉంటుంది. రోజూ ఒక ఆరు ఖర్జూరం పండ్లను నీటిలో రాత్రి నానపెట్టి ఉదయాన్ని తీసి వాటిని తినాలి. ఇది చెడు కొలస్ట్రాల్ ను తగ్గించటం లో సహాయ పడుతుంది.

2 . ఆర్థరైటీస్ నుంచి రక్షితుంది. ఎముకలు మరియు కీళ్ల ఆరోగ్యంలో సహాయ పడుతుంది.

3 . రక్త పోటు ని నియంత్రిస్తూ నాడి వ్యవస్తను రక్షిస్తుంది, రక్తహీనత ను తగ్గించటంలో సహాయపడుతుంది.

4 . మంచి శరీర పుష్టిని కలుగ జేస్తూ మంచి సెక్స్ లైఫ్ ని కలుగ జేస్తుంది.

5 . రే చీకటిని ఎదుర్కొంటుంది. అలానే కోలన్ కేన్సరును, స్కిన్ ఎలర్జీస్ ను అదుపులో పెడుతుంది.

6 . జీర్ణ వ్య్వస్థను అదుపులో ఉంచుతూ మలబద్దకం ను తొలిగిస్తుంది.

7 . మహిళకు ఇది మంచి ఆహరం, ముఖ్యముగా ప్రెగెన్సీ సమయములో కావలిసిన పౌష్ఠిక ఆహారాన్ని అందించగలదు.

8 . దంత రక్షణలో ( సహజమైన చెక్కరలు దంతాలకు హాని చేయవు) అలానే కేశ సంరక్షణ లో పనికి వస్తుంది.

9 . సన్నగా వున్నవారు పుష్టిగా అందంగా తయారు అవటానికి “ఖజ్జూరం” రోజూ ఆహారంగా స్వీకరించవచ్చు.

DATES SHOP AT DUBAI

ఈ ఎడారి పండును రోజూ ఆహరం లో చేర్చు కోవటం ద్వారా సహజ సిద్ధంగా, మంచి రోగ నిరోధక శక్తిని పొంది సమర్ధవంతము గా రుగ్మతలు నుండి రక్షణ పొందవచ్చు అనటం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు!!!

“ఆహారం” తో “ఆరోగ్యం” పొంది “ఆనందం” గా జీవిస్తారని ఆశిస్థూ!

ఇంకో భాగంలో “ఖజ్జూరం” తో మంచి రుచికరమైన వంటలు ఎలా చెయ్యాలో తెలుసుకొందాం.

Leave a Reply

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!