Summer O Special (ఎండాకాలం ఓ ప్రతేక్యత)

sun rise

నమస్తే మిత్రులారా, ఎలా వున్నారు!

ఏప్రిల్ చివరి వారంలో వున్నాం! ఎండాకాలము లో అడుగు పెడుతూ వున్నాం!

ఎక్కువ శాతం కరోనా ప్రభావం కట్టడి తో! ఇంటిపట్టునే ఉంటున్నాం కదా!! రోజంతా దాదాపు నీడలోనే !!!

మే 3 న “లాక్ డౌన్” కొన్నిమార్పులతో సడలించవచ్చు!  అని తెలిసింది కదా!

ఇప్పటికే ౩౦ డిగ్రీలు దాటింది. మే మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు 35 నుంచి 40 డిగ్రీలకి మారే అవకాశం, ప్రకృతి లో వచ్చే మార్పులు, సహజమే కదా!!

ఈ వాతావరణ మార్పుతో శరీర స్థితిగతులు ఇటూ అటూ అవటం కూడా పరిపాటే!

ప్రకృతి ప్రతి ఋతువు కి తగిన విధంగా ఎన్నో ఏర్పాటు చేసినట్లే, ఈ ఎండాకాలంలో  మధుర ఫలాలు, సుమధుర సువాసనా భరితమైన పూలు, చల్లని సాయంత్రాలు, నూలు వస్త్రాలు.

మనం కనిపెట్టి, కొనిపెట్టుకున్న ఎయిర్ కూలర్లు,కండిషన్స్ ఎటూ వున్నాయనుకోండి.

రాబోయే “సమ్మర్” కి మనం ఇంట్లో వున్నా, బయటకు వెళ్లినా (టూర్లు , వెకేషన్స్ జాన్తానై కదా) లోకల్ గానే అనుకోండి, తీసుకోవాలిసిన జాగ్రత్తలు, స్వీకరించాల్సిన ఆహారాలు, జస్ట్ మరో మారు గుర్తు చేసుకొందామా!

సమ్మర్ లో గాలిలో “తేమ” పెరుగుతుంది. గాలిలో తేమా!? అని ఆచ్చర్యం కలగవచ్చు. కానీ నిజం, చల్లటి ఉష్ణోగ్రతల కంటే వెచ్చని ఉష్ణోగ్రతలు ఎక్కువ తేమను కలిగి ఉంటాయి. కారణం ఉష్ణోగ్రత! ఇది అన్ని తేడాలను కలిగించే ఉష్ణోగ్రత!!

చల్లని శీతాకాలపు గాలి, గిలిగింతలు పెట్టినప్పడికి, వెచ్చని వేసవి గాలి కంటే చాలా తక్కువ తేమను కలిగి ఉంటుంది.

అందుకే, ఎండ మండుతూ వాళ్లంతా చెమట తో చికాకు! sultry (ఉక్కపోత)!! మరి ఇలాంటి పరిస్థితికి, మొదట “వేషం”! అదేనండి మనం దరించే దుస్తులు.. వాటి కథ!

చక్కని కాటన్ (ప్రత్తితో తయారైన) వస్త్రాలు ధరించటం, ముదురు రంగులు కాకుండా లేత రంగులు, తెల్లని తెలుపు  (నిర్వహించే సౌలభ్యత ఉంటే).

లో దుస్తులు కూడా కాటన్ తో చేసినవైయుండి, సౌకర్యంగా ఉండేలా, మరీ బిగుతుగా లేకుండా చూసుకోవాలి.

వీలును పట్టి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసినప్పుడల్లా ఉతికి బాగా పొడిగా వున్న వాటిని ధరించటం ఎంతో హాయిగా, హైజీన్ గా ఉంటుంది.

ఇక స్నానం చేసే నీటిలో ఓ పది చుక్కలు లెమన్ జ్యూస్ (నిమ్మ కాయ రసం), ఇప్సమ్ సాల్ట్ ( సన్ బర్న్ నుంచి కాపటమే కాకుండా , చెమట తో వచ్చే చికాకును తగ్గిస్తుంది).

కొందరికి ఎండాకాలమైనా వేడినీతో స్నానం చేసే అలవాటు వుంటుంది.

వీలుంటే ఓ పది వేపాకులను ఆ నీటిలో వేసి మరిగించి, ఓ పది చుక్కలు రోజ్ వాటర్ ను కలిపి స్నానం చేసే ఎంతో ఫ్రెష్ గా వుండి, చెమట పొక్కులు రాకుండా ఉంటాయి.

బాడీ “టాల్క్” ని సమ్మర్ కి చాలా కంపెనీలు తయారు చేస్తాయి.

బోరిక్ బేస్ తో, ఆర్గానిక్ కార్న్‌స్టార్చ్ తో మిళితమై వున్న లావెండర్, రోజ్, లెమన్ సెంటెడ్ వి, లేక శాండిల్ వుడ్ డస్ట్ తో చేసినవి అయినా ఎంతో హాయిని యిస్తాయి.

గతం లో వాడే వుంటారు అనుకోండి, ఈ సమ్మర్ కి కొత్తగా ట్రై చెయ్యండి.

అత్తర్లు, బాడీ స్ప్రే లను శరీరం పై వాడే వి కాకుండా దుస్తులపై వాడే వాటిని వాడటం ఉత్తమం.

ఇక ఆహారం కి వద్దాం. అవగాహన పెరగటం, అందుబాటులో ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఆలోచన మనస్సులో పదే పదే వస్తూ వుంటుంది. కదా!

ఇక్క ముందుగా ఓ మంచి ఆహారపు అలవాటును గురుంచి – ఉదయం మహారాజులాగా, మధ్యాన్నం రాజులాగా, రాత్రికి ఓ ఫకీరు/సన్యాసి లో తినాలని పెద్దల మాట.

మారిని జీవన విధానం, రాత్రి పగలుగా, పగలు రాత్రిగా సాగు తున్న కొలువులు, నాగరిక నగర జీవనంలో “రాత్రిజీవితం” తో పెద్దల చెప్పిన మాట తల్లకిందులైంది.

ఆరోగ్యం కూడా అలానే! సరే కానివ్వండి! ఈ కరోనా ఓ గుణపాఠం చెప్పింది కదా! మన మెంత!! మన బ్రతుకెంత!!!  అని.

ఎండాకాలం లో ఉదయం తీసుకోనే ఆహారం లో నూనె, మసాలా శాతం బాగా తక్కువగా వుండి. సులభంగా జీర్ణమై, శక్తినిచ్చే ఇంటి వద్ద (సాధ్యమైనంత వరకు) తయారు చేసిన వాటినే స్వీకరించటం ఉత్తమం! ఆరోగ్యకరం!!

భారతీయ అద్భుత విధానం, మనలో చాలా మందికి తెలిసినా, పాటించని ఓ ఆహారం! గురుంచి, తెలుసుకొందాం. 

రాత్రి ,అన్నం వండి దానిలో గోరువెచ్చని పాలు పోసి, తోడు వేసి ఉంచాలి (వీలైతే ఓ మట్టి పాత్ర లో)

ఉదయాన్నే, తీసి బాగా కలిపి, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు కలిపి, పెరుగు మీద తీసిన మీగడ తో తాలింపు వేసి, దానిలో నువ్వులు,వేరుశెనగ పప్పు లు కలిపి కొత్తిమీర తో గార్నిష్ చేసిన “అన్నం” (చద్ది) ఓ మండల (40 రోజులు) కాలం తినండి.

అద్భుతమైన ఫలితాలు పొందండి. “పెద్దల మాట చద్ది మూట” కదా! ఎంత ఐటీ యుగమైనా!! ఎంత డిజిటల్ జీవితమైనా !!!

ఇది కేవలం ఎండాకాలం లో అనే కాదు ఏ కాలానికైనా పుష్టినిచ్చే “అమృతా” ఆహరం!

అబ్బా! ఏంటమ్మా! రోజూ ఇదేనా! అనే వాళ్లకి అటుకుల తో చేసే పోహ/ఉప్మా, నట్స్ అండ్ సీడ్స్ తో కలిపి చేసిన రాగి జావ కూడా మంచి పోషకాలతో నిండి వుండి మేలు చేస్తుంది.

మన రొటీన్ గా చేసుకునే ఇడ్లి,ఉప్మా, దోశె లు కూడా షరా మామూలే!

కాకపోతే, కొన్ని దినుసులు/పదార్థాలు మార్చి చేస్తే రుచి తో పాటు శక్తిని ఇచ్చి ఎండాకాలం దాహాన్ని తగ్గించి హాయిగా మన దినసరి కార్యకమాలకి వుషారునిస్తాయి.

ఇక లంచ్ కి ఓ గంటా గంటన్నర ముందు టైం లో ఓ టీ/డ్రింక్ / అక్టీవెటర్ (ఆకలి కలిగించేవి)

“టీ” అలవాటు ఉన్నవారికి, రొటీన్ గా తాగే టీ కాకుండా ఓ చిన్న చేంజ్.

ఓ 150 ఎం.ఎల్ నీటిలో దాల్చిన చెక్క పొడి, మిరియాలపొడి, యాలుకల (ఇలాచీ) పొడి, టీ పొడి, ( ఇవన్నీ ఓ పించ్ అంటే చూపుడువేలు బొటనవేళ్ళుతో పట్టుకొనే వచ్చే అంత) నల్ల బెల్లం ఓ చిన్న ముక్క (5 గ్రా) వేసి బాగా మరిగించి వడకట్టి సేవించాలి.

టీ కాకుండా మరొకటి చల్ల,చల్ల గా, 150 ఎం.ల్. చల్లని నీరు (కుండలోనిది) తెలుసుకోండి.

దానిలో కొద్దిగా ఇలాచీ పొడి,దాల్చిన చెక్క పొడి, 10 గ్రా. తవుడు (బియ్యపు), కలిపి అలా ఓ మూడు/నాలుగు గంటలు (త్రాగటానికి ముందు) ఉంచండి.

త్రాగే ముందు వడకట్టి ఓ రెండు స్పూన్స్ తేనే (హనీ) ఆ నీటిలో వేసి బాగా కలిపి నిదానంగా సిప్ బై సిప్ త్రాగండి.

ఎంతో హాయిగా వుంటుంది. ఆకలి పుట్టిస్తుంది మరియు ఆ రోజుకి సరిపోయే అంతటి “బి” కాంప్లెక్స్ విటమిన్( తవుడులో వున్న) ప్రకృతి సిద్ధంగా శరీరానికి అందుతుంది.

ఇక లంచ్ (మధ్యాన్న భోజనం) కి వద్దాం! ఎండా కాలంలో ఫ్రైలు, డీప్ ఫ్రై లకి దూరంగా ఉండటం శ్రేయస్కరం! ఇవి దాహాన్నిపెంచి ఇబ్బంది కలిగిస్తాయి కనుక. అలానే బిర్యానీలు,పలావ్ లు, మరియు నూనె/నెయ్యి తో చేసిన ఏ రైస్ వంటకాన్ని అయినా.

దోసకాయ,బీరకాయ,పొట్లకాయ, సొరకాయ(ఆనపకాయ) తీపి గుమ్మడి కాయ, మునగ కాయ, వంకాయ, టమోటో, దొండ కాయ మరియు బెండకాయ మొదలైన కూరగాయలు తో చేసిన ఇగురు గా లేక పులుసుగా చేసి తినటం అన్ని కాలాలకి మంచిదే! సమ్మర్ లో ఐతే మరీ మంచిది. ఈ టైములో దుంప కూరలు తినక పోవటమే మంచిది.

సహజంగా, నీరు ఎక్కువ తాగుతాం కాబట్టి జీర్ణక్రియ కొంత కుంటుపడుతుంది. అందుకే దుంప కూరలను దూరం పెట్టి అరుగుదల లోపాలని అరికడదాం.

ఇక రైస్ విషయానికి వస్తే ఒంటి పట్టు దంపుడు బియ్యం కానీ, లైట్ పాలీష్ పట్టిన ముడి బియ్యం వాడటం మంచిది.

మేము తినగలం, అనే వారికి జొన్న సంగటి, రాగి సంగటి (అన్నం బదులు) ఆకు కూర /కూరగాయల పులుసులు లతో కానీ కూరలతో కానీ లంచ్ చెయ్యటం “ఆరోగ్యాన్ని” బంగారు కిరీటంగా ధరించటమే! అనటం అతిశయోక్తి కానే కాదు!

ఇక సాయంత్రం (4.30 – 5.30 గంటల మధ్యలో) ఓ డ్రింక్/ టీ గురుంచి.

పలుచని మజ్జిగ (పెరుగునుంచి చిలికినది) 200 ఎం.ల్. తీసుకొని దానిలో మిరియాలపొడి, శొంఠిపొడి, రాక్ సాల్ట్/ బ్లాక్ సాల్ట్ (ఇవి అన్ని 2 నుంచి 3 గ్రా ) కలిపి ఉంచి ఓ పదినిముషాలు తరువాత చిన్ని చిన్ని ముక్కలుగా చేసిన కొత్తిమీర,పొదీనా కలిపి, ఓ అర చెక్క నిమ్మ కాయ రసం పిండి, కలిపి తీసుకోవాలి. సమ్మర్ థ్రస్ట్ క్యూన్చేర్, (దాహాన్ని చల్లార్చే) ఓ మధురమైన పానీయం.

చాలా మందికి టీ / కాఫీ త్రాగే అలవాటు ఉంటుంది. వారు అలవాటు ప్రకారం త్రాగండి. వేడి పానీయాలలో కూడా దప్పికను తగ్గించే లక్షణాలు వున్నాయని ఓ శాస్త్ర పరిశోధనలో నిరూపితమే!

మంచి అరుగుదల వున్నా సమ్మర్ లో సాయంత్రం పూట “సాలిడ్ స్నాక్స్ ” కన్నా పానీయాలకే పరిమితమవటం ఓ మంచి లక్షణం!రాబోయే సంత్సరాలలో మంచి  “ఆరోగ్య జీవితానికి”  పునాది అని పెద్దల మాటే కాకుండా ఆహార నిపుణల సలహా కూడా.

ఇక రాత్రి డిన్నర్ /సప్పర్ కి వచ్చాము. ఆ రోజు చివరికి తినే మీల్ నే డిన్నర్/సప్పర్ అంటారు అని తెలుసుకదా. ( డిన్నర్ కి సప్పర్ కి మీనింగ్ ఒకటే అయినా ఓ ముఖ్య తేడా వుంది తరువాత తెలుసుకొందాం).

ఈ ఆధునిక కాలం లో సమాచార విప్లవంతో, డిజిటల్ సాంకేతిక తో వచ్చిన టీవీ రంగం, మొబైల్ టెక్నాలజీ. కంప్యూటర్ టెక్నాలజీ ఇంటిటింకి చేరి కాలవినియోగం /కాల హరణం పెరిగి  తిండి మరియు నిద్ర యొక్క నిర్దుష్ట సమయాలను (టైమింగ్స్) అటు ఇటు చేశాయి.

రాత్రి కి తినే ఆహారం సూర్యాస్తమయం తరువాత ఓ రెండు గంటల లోపు చేస్తే మంచిది.

ఇంకా చెప్పాలంటే ” గూట్లో దీపం నోట్లో ముద్ద” అనే నానుడి కొందరైనా వినే వుంటారు కదా! అంటే పూర్వం రోజుల్లో చీకటి పడగానే ఇంటి ముందు వుండే వాకిలి కి ఇరువైపులా గోడలో వుండే “గూడు” లలో “దీపం” పెట్టేవారు, ఆవెంటనే శుభ్రంగా ఇంటిల్లిపాది స్నానాలు చేసి భోజనం చేసే వారు.
వింటూ వుంటేనే ఎంత ఆనందగా వుందో కదా!  ఆ రోజుల్లో మన భారతీయ సాంప్రదాయ, ఆచార, వ్యవహారాల్లో ఎన్నెన్ని విలువలు, ఆరోగ్య రహస్యాలు దాగున్నాయో!!  అవును కదా!!!

50 ఇయర్స్ దాటిన వారందరూ మల్టీ గ్రైన్ పిండి తో చేసినవి రెండు/మూడు పుల్కాలు, ఓ 150 గ్రాముల (దుంప కూరలు కాకుండా) కూరతో తీసుకోవాలి. తరువాత ఓ గ్లాస్ పలుచని మజ్జిగ ఉప్పు లేకుండా.

పిల్లలు, యువకులు మంచి ఆరోగ్య పుష్టి కలిగిన వారు అందరూ (50 ఇయర్స్ లోపువారు) ఓ వంద గ్రాముల అన్నం (వైట్ రైస్/బ్రౌన్ రైస్/రెడ్ రైస్/బ్లాక్ రైస్) { ఈ రైస్ లు వాటి పోషక విలువలు గురుంచి ఇంకో ఆర్టికల్ లో వివరిస్తా} 150 గ్రాముల కూర తో చక్కగా నమిలి తినాలి. తరువాత ఓ గ్లాస్ పలుచని మజ్జిగ ఉప్పు లేకుండా.

ఓకే, డిన్నర్ చేసారుకదా! ఇంట్లో నో, వీధిలో నో అటూ,ఇటూ ఓ పది నిముషాలు నెమ్మదిగా వాకింగ్ చెయ్యండి. తరువాత, దంత దావనం చెయ్యండి, చల్లని నీటితో ముఖం, కాళ్లు చేతులు ఒకటికి రెండు సార్లు శుభ్రముగా కడుక్కోండి.

మంచము మీద కూర్చొని ప్రశాంతం గా కళ్ళు మూసుకొని, మౌనం గా శ్వాసని ఆలకించండి ఓ పది నిముషాలు, తరువాత నిద్రకు ఉపక్రమించండి.

మీరు, మంచి గాఢ నిద్రలో వున్నారు! డిస్ట్రబ్ చేయకూడదు!! వుంటాను, సే”లవ్” !!!

Leave a Reply

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!