
spicy
హలో మిత్రులారా
స్పైసెస్ (సుగంధ ద్రవ్యములు) వ్రాసిన ఆర్టికల్ బాగుంది! మంచి విషయాలు తెలిపారు, అని చాలా మంది మిత్రులు తెలియ జేశారు.
ఈ బ్లాగ్ ని చదువుతూ ఆదరిస్తున్న ప్రపంచం లో వున్న తెలుగు వారి అందరికి ప్రేమతో నమస్కరిస్తూ!
సదా మీ ఆదరణ కోరుకుంటూ …
శ్రావణ మాసం! మహిళల మాసం!! ఈ మాసం లో పూజలు,నోములు, వ్రతాలూ!
ప్రపంచంలో వున్న ప్రజలంతా వారి వారి ఇష్టాను సారం ఎదో ఓ మతం లో ఉంటూ ఆ మత ఆచార వ్యవహారాలకు అనుగుణం గా జీవిస్తూ సుఖ సంతోషాలతో ఉండటం అందరికి తెలిసిందే !
ఏ మత ధర్మమూ ఆచరించ కుండా మత రహితులు గా వున్న వారు కూడా చాలామంది వున్నారు!!
ఇదో పెద్ద టాపిక్! చర్చలు జరిగితే పెద్ద “ట్రాఫిక్” వచ్చే “ఏరియా” — అలానే “గ్రే” ఏరియా కూడా వుంది అనుకోండి!!
కరోనా ! ఎన్నో కఠిన వాస్తవాలని “కళ్ళముందు” నిలిపింది.
ఇంకా, ముందు ముందు దీనికి “మందు” వచ్చే దాకా “కరోనా” ..”కరోనా…”కరోనా అనే చాంటింగ్ ( నామ స్మరణ) తప్పదు కదా!
ఇక, స్పైసెస్ రెండో భాగం లో కి వెళదాం!

Jeera
జీలకర్ర : మిడిల్ ఈస్ట్ ఆసియన్ రీజియన్ దేశాలు ఈ జీలకర్ర పుట్టినిల్లు.
విలక్షణమైన రుచికి విస్తృతంగా ప్రాచుర్యం పొందిన జీలకర్ర, నేడు ప్రపంచ లో చాలా దేశాల్లో సాగు చేస్తున్నారు.
“క్యుమినాల్డిహైడ్” అనే ప్రధాన మూలకం జీలకర్ర కి విలక్షణమైన బలమైన రుచిని,వాసనని కలుగ జేస్తుంది.
జీలకర్ర లో రెండు మూడు రకాలు వున్నాయి. వంటల్లో వాడే సాధారణ రకం.
నల్ల జీలకర్ర ( ఆయుర్వేద మందుల్లో వాడుతారు), షా జీర ( పెర్షియన్ కి చెందినది) బిర్యానీలు మరియు మాంస ఆహారాల్లో రుచికి, ఇంపైన వాసనకు వినియోగిస్తారు.
జీలకర్రలో వున్న “కమినల్డెహైడ్” నూనెల సముదాయం “జీర్ణశయాంతర రసం” (ఎంజైమ్) స్రావాలను పెంచడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడతాయి.
దీనిలో ఇనుము, కాల్షియం, మాంగనీస్, రాగి, సెలీనియం, జింక్,పొటాషియం మరియు జింక్ వంటి ఖనిజాలు సమృద్ధిగా వున్నాయి. మంచి ఫైబర్ శాతం కలిగి వుంది.
జీలకర్ర లో కెరోటిన్లు, జియాక్సంతిన్ మరియు లుటిన్ వంటి అనేక ఫ్లేవనాయిడ్ ఫినోలిక్ యాంటీఆక్సిడెంట్లకు మూలం.
అలానే విటమిన్ ఏ, విటమిన్ ఈ మరియు విటమిన్ బి సముదాయం కలిగి వున్నాయి.
అజీర్ణానికి చికిత్సలో, అపానవాయువు, పులిత్రేపులు, బౌన్సింగ్ మరియు కామన్ కోల్డ్ (జలుబు) లలో జీలకర్రని గృహ చికిత్స లో వినియోగిసారు.
నల్ల జీరకర్రని అధిక బరువు, కొలస్ట్రాల్ తగ్గించే మందులలో ,ఎంజైమ్ (జీర్ణ సంబంధమైన) వృద్ధికి, రెగ్యులేషన్ కి వినియోగిస్తారు.
జీలకర్రను పరిమితంగా వాడాలి. ఎక్కువ గా వినియోగిస్తే జీర్ణశయాంతర చికాకు, అజీర్ణం, పేగు పూత వచ్చే అవకావం ఉన్నాయని పెద్దల మాట! (మెడికల్ గా నిరూపితం కాలేదు)
జీలకర్ర ను కొన్ని రకాల పానీయాల్లో, చాకోలెట్ లలో కూడా వినియోగిస్తున్నారు.

Fenugreek seeds
మెంతులు : మెంతులు భారత ఉపఖండంలోని హిమాలయ మైదాన ప్రాంతాలకి చెందిన మొక్క.
నేడు ఉత్తర ఆఫ్రికా ,ఐరోపా మరియు మధ్య తూర్పు ఆసియ ప్రాంతాల్లో విరివిగా సాగు చేస్తున్నారు.
మెంతులు చేదు రుచి మరియు మపిలే వాసన కలిగి ఉంటాయి. కొద్దిగా వేడిచేసినా, నీటిలో నానపెట్టినా తినటాని అనుకూలంగా మంచి ఇంపైన వాసన తో రుచిగా ఉంటాయి.
భారతీయులు అన్ని రకాల ఊరగాయలు (నిలువ పచ్చళ్ళు) లో మెంతి పిండిని వినియోగిస్తారు.
మెంతులు లో అధిక మొత్తం లో నీటిలో కరిగే మంచి ఫైబర్ వుంది. అలానే ఖనిజాలు, విటమిన్లు మరియు ఫైటోన్యూట్రియెంట్ సమృద్ధిగా కలిగి వున్నాయి.
నాన్-స్టార్చి పోలిసాకరైడ్ లు సమృద్ధిగా మెంతులలో వున్నాయి. ఇవి సున్నితమైన జీర్ణ క్రియకు మరియు మరియు మలబద్దక వ్యాధులలో పనిచేస్తాయి.
మెంతులు లో కాల్షియం, ఐరన్, సెలీనియం, జింక్, మాంగనీస్,
పొటాషియం,మెగ్నీషియం మరియు రాగి వంటి అమూల్యమైన ఖనిజాలకి నిలయం.
వీనిలో విటమిన్ ఎ , విటమిన్ సి మరియు విటమిన్ బి కుటుంబమైన థయామిన్, పిరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లేవిన్, నియాసిన్ లు వున్నాయి.
తల్లి పాలను వృద్ధి చేయటంలో చాలా సహాయకారిగా ఉంటుంది. మధుమేహ (డయాబెటిక్) నివారణలో, క్రమపరచటం లో ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఇంకా అనేక మందుల తయారీలో దీనిని వినియోగిస్తారు.

Safran
కుంకుమ పువ్వు (సాఫ్రోన్): ఆహారనికి “అందం”, రుచి, సువాసన కలుజేసే “కుంకుమ పువ్వు (సాఫ్రోన్)” కు పుట్టినిల్లు “దక్షిణ ఐరోపా” . నేడు ముఖ్యంగా స్పెయిన్, ఇటలీ,టర్కీ, ఇరాన్,ఫ్రాన్సు,గ్రీస్ మరియు భారత్ లోని జమ్మూ, కాశ్మీర్లలో సాగు చేస్తున్నారు.
లేవేండర్ రంగులో వున్న పుష్పము లోని ” స్టిగ్మా” (థ్రెడ్లు) అనే భాగమే కుంకుమ పువ్వుగా పిలుస్తారు.
పురాతన కాలం నుండి తెలిసిన “అత్యంత విలువైన ” సుగంధ ద్రవ్యాలలో ఒకటి.
కుంకుమపువ్వు రంగు,రుచి మరియు దాని “ఔషధ” లక్షణాల ప్రత్యేకత, లభ్యత వలన దాని విలువ “సుగంధ ద్రవ్యాలలో” ప్రధమ స్థానాన్ని కలుగ చేస్తున్నాయి.
సారవంతమైన భూమి,చల్లని, పొడి వాతావరణం,వర్షపాతం కలిగి వుంది తక్కువ సూర్యరశ్మి ప్రభావం వున్న ప్రాంతాల్లో మాత్రమే సాగుకు అనుకూలం.
కుంకుమ పూవులను తెల్లవారు జామున కోసి వాటి నుండి “స్టిగ్మా” ను వేరుచేస్తారు.
ప్రతేకమైన రీతిలో ఎండపెట్టి “మార్కెట్ చేయటానికి’ ఉత్పత్తిని ౦.5 గ్రాములు నుండి 5 గ్రాముల వరకు ప్యాకెట్లు గా తరయారు చేస్తారు.
దాని రంగు, రుచి ని పట్టి మార్కెట్ లో 1 గ్రాము 200 రూపాయలు నుండి 1100 రూపాయలవరకు ధర పలుకుతుంది.
గర్భవతులకు కుంకుమ పువ్వు కలిపి పాలను ఆహారంగా ఇవ్వటం ఓ ఆచారంగా భారత దేశంలో కన్పిస్తుంది!
దీనిలో యాంటీఆక్సిడెంట్, వ్యాధి నివారణ మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే లక్షణాలు చాలా వున్నాయి.
యాంటిసెప్టిక్,యాంటీఆక్సిడెంట్, యాంటిడిప్రెసెంట్, జీర్ణ, యాంటీ-కన్వల్సెంట్ వంటి అనేక సాంప్రదాయ మందుల తయారీలో దీని వాడుతారు.
కుంకుమ పువ్వులో కాల్షియం, మాంగనీస్, ఇనుము, సెలీనియం, జింక్,రాగి,పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధి గా వున్నాయి.
అలానే విటమిన్-ఎ, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి గ్రూప్ (రిబోఫ్లేవిన్, నియాసిన్) మరియు విటమిన్-సి లుకూడా కుంకుమ పువ్వు లో వున్నాయి.
“సాఫ్రానల్” అనే ప్రత్యక నూనె కలిగివున్న కుంకుమ పువ్వు “క్యాన్సర్ “కణాల ఫై ప్రభావం చూపుతుందని అని ఓ శాస్త్ర పరిశోధనా అంశం.
ఆహార పదార్ధాలకు ఓ ప్రతేకమైన “బంగారు పసుపు” రంగుని కుంకుమ పువ్వును వినియోగించటం ద్వారా తెప్పిస్తారు.
కుంకుమ పువ్వు, బంగారు,వెండి మొదలైన వాటి తో చేసిన స్వీట్ లు కేజీ 20000 నుంచి 40000 వేల రూపాయల వరకు విక్రయించే షాప్ లు మెట్రో నగరాల లలో వున్నాయి.

Ajwain
వాము : వామును, “ఓమ”, “దీప్యక ” , “అజ్వైన్” అని కూడా పిలుస్తారు. వంట ఇంటి లో ఇది ఓ విలువైన దినుసు.
వాములో ఆరోగ్యాన్ని ఇచ్చే నూనెలు థైమోల్, మోనోప్టెరాన్ లు వున్నాయి. ఇవి సుగంధ పరిమళాలను ఇస్తాయి. అలానే పినిన్, సిమెన్, లిమోనేన్ మరియు టెర్పినేన్ వాటిని పెట్రోకెమికల్ పదార్ధములు వున్నాయి.
వాముకి యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు “థైమోల్” నూనె వలన వచ్చాయి. ఇది కొంత మత్తును కూడా కలిగిస్తుంది.
వాము ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్ల యొక్క గొప్ప వనరు.
దీనిలో “గ్యాస్ట్రో పేగు స్రావాలు” విడుదల చేసే లక్షణాలు వుండి “జీర్ణకోశ” పని తీరుని మెరుగు పరుస్తుంది.

BAY LEAF
బే లీఫ్ (బిర్యానీ ఆకు): ఇది ఆసియా ఖండం కి చెందిన “బే చెట్టు జాతికి” చెందిన “ఆకు” భాగం.
ఇతిహాసాలలో ఈ చెట్టు ప్రస్తావన వుంది. దీని “సూర్య” దేవుడి చెట్టుగా పూజించారు. ఆహ్లాదకరమైన సుగంధ సువాసనతో వుండే ఈ ఆకుని ఆహారం గా వాడే వారు.
అలానే పానీయాల్లో కూడా దీన్ని నాన పెట్టి ఆ “నీటి” ని తాగే వారు.
ఈ ఆకులో ఎ-, ß- పినిన్లు , మైర్సిన్, లిమోనేన్, లినలూల్, మిథైల్ చావికోల్, నెరల్, ఎ-టెర్పినోల్, జెరానైల్ అసిటేట్, యూజీనాల్ మరియు చావికోల్ వంటి క్రియాశీలక భాగాలు కలిగి వున్నాయి.
ఫై వాటి వలన ఈ ఆకులో యాంటీఆక్సిడెంట్, జీర్ణ, కాన్సర్ నిరోధక మరియు క్రిమినాశక లక్షణాలు వున్నాయి.
తాజా ఆకులలో విటమిన్-సి అధిక శాతం వుంది. ఇది రోగనిరోధక శక్తిని కలిగి గాయాలు, పుండ్లు ని నయం చేసే శక్తి కలిగి ఉంటుంది.
ఈ ఆకులలో “యాంటీవైరల్” లక్షణాలు తో పాటు, ప్రకృతి లో దొరికే శరీరానికి కావలిసిన ఖనిజాలు అన్నీ దీనిలో వున్నాయి.
విటమిన్ ఏ, విటమిన్ బి గ్రూప్ మరియు ఫోలిక్ ఆసిడ్ లు సమృద్ధిగా వున్నాయి.
ఈ ఆకునుండి లభించే నూనెలు ఆర్థరైటిస్,కండరాల నొప్పులు, బ్రోన్కైటిస్, జలుబు మరియు ఫ్లూ నివారణకు వాడే మందుల తయారీలలో వినియోగిస్తున్నారు.
ఈ ఆకు కాషాయం తో పేగు పూత, కడుపులో నెప్పి, అపానవాయువు ల నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు.
ఆకులలో “లారిక్” నూనె ఉండటం వలన, ఆకు ని కాల్చిన పొగ “క్రిమి కీటకాలను” (దోమలు,ఈగలు) పారద్రోలటానికి పనికి వస్తుంది.

Nutmug
జాజికాయ (నట్ మగ్) : పురాతన కాలం నుండి తెలిసిన అత్యంత విలువైన సుగంధ ద్రవ్యాలలో ఇది ఒకటి.
ఇండోనేషియా లోని “మొలుకాస్ ద్వీపం” దీని పుట్టిల్లు. ఈ ద్వీపం ని “స్పైస్ ఐలాండ్” అని పిలుస్తారు. అక్కడ నుండి భారత్ లోని మలబారు ప్రాంతం లో సాగుకి తీసుకు వచ్చారు.
ఈ కాయలో వుండే స్థిర, అస్థిర నూనెలు సమ్మేళనాలు దీని విశిష్టమైన సుగంధ పరిమళం కలుగ జేస్తూ అనేక రోగనిరోధక కారకాలను కలిగి ఉండేలా చేశాయి.
జాజి కాయలో ముఖ్యంగా రాగి, కాల్షియమ్ , మాంగనీస్ , ఐరన్ , జింక్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ఖనిజాలు వున్నాయి.
విటమిన్ సి,బి,ఏ లు తో పాటు బీటా -కెరోటిన్, సీరీప్తోగ్జాంథిన్ వంటి ఆంటీ ఆక్సిడెంట్లు కలిగి వున్నాయి.
చైనా, ఇండియా,శ్రీలంక,ఇండోనేషియా దేశాల్లో జాజి కాయతో సాంప్రదాయ వైద్య మందులు తయారీలో వినియోగిస్తున్నారు.
నరాల జబ్బులు, కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు ,నోటికి సంబంధిన వ్యాధులలో జాజి కాయను వినియోగిస్తారు.
పొట్ట ఉబ్బరాన్ని,అజీర్తిని , అపానవాయువులు తగ్గించటానికి ఈ జాజికాయని పొడిచేసి
తేనతో కలిపి తమలపాకు తో కలిపి తీసుకొంటారు.
భారత్ లో జాజి కాయ ని “తాంబూల” ములో మంచి పరిమళం కోసం వినియోగిస్తారు.

FENNEL SEEDS
సోంపు : సోపు , ఫెన్నెల్ అని కూడా పిలుస్తారు. ఫెన్నెల్ దక్షిణ ఐరోపాకు చెందినది.
యూరప్, మిడిల్-ఈస్ట్, చైనా, ఇండియా మరియు టర్కీ లలో విరివిగా సాగు చేసే ఈ సుగంధ ద్రవ్యం “పవిత్ర మూలిక” గా కొలవబడుతుంది.
తీపి రుచి కలిగి మంచి సువాసన తో వుండే ఈ ఫెన్నెల్ అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి వుంది.
“ఫెన్నెల్” (సోపు) అనేక ఆరోగ్య ప్రయోజనకరమైన పోషకాలు, అవసరమైన సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్, ఖనిజాలు మరియు విటమిన్లు కలిగి ఉంది.
ఇది నాన్వెజ్, వెజ్ వంటల్లో వాడుతారు. స్వీట్, బిస్కెట్,కేక్, చాకోలెట్ లలో కూడా వినియోగిస్తారు. తాంబూలం లో ఇది ప్రధానమైన దినుసు.
అజీర్ణం నివారణగా, నోటికి రుచి కలిగించటానికి సోపుని చాలాకాలంగా వాడుతున్నారు.
పిల్లల తల్లులకు పాలు సమృద్ధిగా స్రవించటానికి ఈ ఫెన్నెల్ ను కాషాయం గా ఇస్తారు.
నవజాత శిశువుల పొట్ట ఉబ్బరాన్ని,నొప్పిని తగ్గించటానికి సోపు నీటి లో నానపెట్టి ఆ నీటిని కొద్దీ కొద్దీ గా పట్టిస్తారు.
ఫెన్నెల్ సీడ్ నుంచి తీసిన ఆయిల్ కండరాల నొప్పులకి, కీళ్లనొప్పులకు మసాజ్ ఆయిల్ గా వాడుతారు.

Spice Rack
ప్రధానమైన “సుగంధ ద్రవ్యాలను” గురుంచి తెలుసుకున్నాం.
ఈ విభాగం క్రిందికి వచ్చే జాపత్రి,ధనియాలు,చింతపండు,పసుపు మరియు ఉప్పు గురుంచి మరో సారి వీలువెంబడి తెలుసుకొందాం.
Your article is very good .. Good things are being brought to the people .. I pray to God to share the good things with the people like you ..
Dear Brother… Thanking you. I will share all information regarding … “Aahram- Aarogyam – Aanandam ” .
Please drop your opinions and suggestions, boosting my energy level to serve thou this blog.
Nice information 👍
Very interesting article.