Rainy season magic and care

Take care of yourself from rain

వేసవి లో ఎండలు! సహజమే కదా!! రోహిణీ కార్తె బగ బగ మండే ఎండ తీవ్రత!!!

ఒకవైపు కరోనా కట్టడి తో ఇంటిపట్టునే  వుండి రోజుకి 10 నుంచి 16 గంటలు ఎయిర్ కండీషన్స్ నడిపించి వున్నారు చాలామంది.

వారి, వారి తాహతును పట్టి ఎయిర్ కూలర్లు, ఫాన్స్ …ఇలా ఇలా గడిచిపోయింది, ఎండాకాలం అంతా.

కరెంటు బిల్ కూడా “లావుగా” ఐపోయింది అనుకోండి!

rain drops

రుతుపవనాలు ఆగమనం! చిరు జల్లులు !! ఆహ్లాదం!!!

అమ్మయ్య, ఎండాకాలం నుంచి ఉపశమనం లభించింది… “వానా కాలం వచ్చింది”

Rainbow

ఈ కాలం అందరి కన్నా “రైతన్నలు” ఎక్కువగా ఎదురుచూసే కాలం!

ప్రకృతి ఈ పుడమి తల్లికి ఇచ్చిన వరమే “ఉత్పత్తి” లక్షణం!

ఈ లక్షణం ని ఒడిసి పట్టుకొని “అన్నదాతలు” జీవులందరి క్షుద్బాధ ను తీర్చి, కనిపించే ప్రత్యక్ష దైవమే ….. “రైతు”

ఏరువాక సాగింది…వ్యవసాయం మొదలైంది.

అంతా మంచిదే! పచ్చదనం మరియు చల్లని వాతావరణాన్ని తెస్తుంది ఈ వానాకాలం. కొత్త నీరు వచ్చి చేరుతుంది. దానితో పాటే వచ్చే అనేక మార్పులు, ఆరోగ్య రుగ్మతలు.

ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకొందాం.

చాలామందికి తెలుసు, అయినా మరో సారి గుర్తు చేసుకొందాం!

rainy season friend

త్రాగే నీరు : నీరు ప్రాణాధారం లోగడ నీటిని గురుంచి ఇక్కడే తెలుసుకున్నాం. ఆహారం లేకుండా కొన్ని రోజులు బ్రతకోవచ్చు.

కానీ నీరు లేకుండా 48 గంటలు నుంచి 240 గంటలు వరకు వారి వారి ఆరోగ్య స్థితి, వయసు మరియు అక్కడ వున్న వాతావరణము ను పట్టి వుండగలరని ఓ పరిశోధన లో తేలింది.

ఆహరం పట్ల పెరిగిన అవగాహాన తో టెక్నాలజీ ఇచ్చిన వెసులు బాటు తో ఇళ్లలో చాలామంది వాటర్ ప్యూరీఫైర్స్ వాడుతున్నారు.

అవి 2000 నుంచి 50000 వేల వరకూ మన అవసరాన్ని పట్టి దొరుకుతున్నాయి.

పంచాయతీ,మున్సిపల్ ఏరియాలో రక్షిత మంచి నీటి పథకాలు ఏర్పాటు వున్నా ఇంకా చాలా గ్రామాలలో, అలానే సిటీ, టౌన్స్ లలో వున్న కొన్ని ప్రాంతాలలో మరియు శివారు స్లమ్స్ లో ఇంకా తాగు నీటి వసతి లేదు.

ఏది ఏమైనా మనము త్రాగునీటిని కాగపెట్టి (బాగా మరిగించి) చల్లార్చి,వడపోసుకొని త్రాగటం అన్ని కాలాలలో మంచిదే.
మరి ముఖ్యంగా గా వర్షాకాలం లో అయితే తప్పకుండా బాగా మరిగించి, చల్లార్చిన నీటినే త్రాగటం ఎంతో అవసరం.

చల్లటి నీళ్లు కంటే వేడి చేసి చల్లార్చిన నీరు తీసుకోవటం చాలా మంచిది అని ఆయుర్వేదం లో చెప్పబడివుంది.

వర్షాకాలంలో వచ్చే ముఖ్యమైన వ్యాధులు:

జలుబు (కోల్డ్),ఫ్లూ, మలేరియా, డెంగ్యూ, ఆహారము నీటి ద్వారా కలరా,అతిసార ఇంకా అతి ప్రమాదమైన “లెప్టోస్పిరోసోస్ ” అనే బ్యాక్టీరియా వల్ల మూత్రపిండాలు, లివర్ మరియు శ్వాస కోశవ్యాధులు వచ్చే అవకాశం వుంది.

ఇది మనిషి లేదా జంతువుల నుండి వ్యాప్తి చెందుతుంది.

అలానే, కొంతమందిలో చర్మ వ్యాధులు వచ్చే అవకాశం, లోగడ వున్న చర్మ వ్యాధులు తిరగబెట్టే అవకాశం వుంది.

ఈ వ్యాధుల్నిరాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసులుకొందాం.

బయటకు వెళ్ళటప్పడు, వానలో తడవకుండా తగిన రక్షణకు కావాల్సిన రైన్ కోట్ లేదా మంచి గొడుగుని వెంట ఉంచుకోవాలి.

అలానే పాదరక్షలు కూడా రైన్ వాటర్ నుంచి పాడాలని సంరక్షించే “రైన్ బూట్” లేక గం బూట్స్ ని వాడాలి. వీలువునంత వరకు చెప్పులు ధరించకుండా ఉండటం మేలు.

Mobile phone in rain

ఈ రోజున శరీరం లో ఓ భాగమై వున్న “మొబైల్ ఫోన్” ను వానకి తడవకుండా వాటర్ ప్రూఫ్ గార్డ్ తో జాగ్రత్త తీసుకోవాలి. ఇది చెప్పాల్చిన అవసరం లేదనుకోండి!!!

అలానే, లెదర్ వాలెట్స్ (పర్సులు), హ్యాండ్ బాగ్స్ (లేడిస్) వానలో తడిస్తే పాడౌతాయి, కనుక ముందే జాగ్రత్త పరుచుకోవాలి.

టూ వీలర్స్ వాడే వాళ్లు తప్పకుండా హెల్మెట్ ధరించి తలని, కళ్లని రక్షించుకోవాలి.

ఒక వేళ అనుకోకుండా వానలో తడిస్తే తల స్నానం చేసి తలని శుభ్రంగా తుడుచుకోవాలి.

ఇక ఆహారం, సాద్యమైనంత వరకూ ఇంటివద్ద చేసిన ఆహారాన్ని వేడి వేడిగా తీసుకోవటం చాలా ఉత్తమం.

ఒక వేళ బయట ఆహారం తీసుకోవాల్సి వస్తే అక్కడ వున్న “హైజీన్” కండిషన్స్ ని పరిగణలోకి తీసుకోవటం చాలా ముఖ్యం.

వీలున్నంత వరకు “నాన్ వెజ్” కు దూరంగా ఉంటూ వేడి వేడిగా వున్న ఆహారాన్ని స్వీకరించటం శ్రేయస్కరం.

ఈ కాలం లో ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తీసుకోపోవటం అంటే జీర్ణ వ్య్వస్థని ఇబ్బంది పెట్టిన వారమే అవుతాం.

అలానే, రోడ్ సైడ్ ఫుడ్స్ పానీ పూరిలు, కట్ లెట్లు, ఫ్రూప్ట్స్ జ్యూస్స్, సలాడ్స్ ని తినకుండా ఉండటం మంచిది.

వానలో తడిచి వస్తే శుభ్రపర్చుకొని పొడి దుస్తులు ధరించి వేడి వేడి సూప్స్ కానీ గ్రీన్ టీ కానీ తాగటం జలుబునుంచి కొంత రక్షణ పొందవచ్చు.

warm and crazy

శరీరానికి కావాల్సిన నీరు తప్పకుండా తీసుకు కోవాలి. మలబద్దకం లేకుండా చూసుకోవాలి.

అలానే, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆహారాలని తీసుకోవాలి. నట్స్, సీడ్స్ ని ఉపాహారం గా తీసుకోవటం మంచిది.

దోమలు, ఈగలు ఇంటిలోకి రాకుండా అలానే ఇంటి చుట్టుప్రక్కల అవి ఉండటానికి వీలు లేని స్థితిని కల్పించాలి.

స్థానిక పరిపాలన వారిని అప్రమత్తం చేస్తూ పబ్లిక్ ప్లేసెస్ లో బ్లీచింగ్ మరియు దోమల నివారణకు వేసే “ఆయిల్ స్మోక్” ని తరుచుగా వినియోగించే లా చేయటం పౌరునిగా  కనీస బాధ్యత.

బాగా గాలి వాన వున్నపుడు బయటకు వీళ్ళకుండా ఉండటం ఉత్తమం. ఒక వేళ తప్పక వెళితే తెగి పడిన కరెంటు వైర్ లను గమనించాలి, అలానే “మ్యాన్ హోల్స్” ని గమనించి నడవాలి.

ఇంటిలో కూడా గోడలు తడిగా వున్నపుడు కొన్ని సార్లు కరెంటు లీక్ కావచ్చు. ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

వానాకాలం లో గాలికి, పెద్ద వర్షాలకు కరెంటు ఇంటెర్ప్షన్స్ ఎక్కువగా ఉంటాయి కనుక ఎమర్జెన్సీ లాంప్స్ని లేక ఆల్టర్ నేటివ్ పవర్ సిస్టంస్ ని చూసుకోవాలి.

వయసు పైబడినవారు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.

వాతావరణం వలన తరుణ వ్యాధులు వ్యాపిస్తాయి కనుక రెగ్యులర్ గా వాడే మందులు తో పాటి రెసిస్టన్స్ ఇంప్రూమెంట్ కోసం సి విటమిన్, మల్టీ విటమిన్స్ వాడుకోవటం.

useful for rainy season

ఆయుర్వేదం పట్ల అభిరుచి వున్నవారు అశ్వగంధ, చెవన్ ప్రాస, త్రిఫల చూర్ణం మరియు త్రికటువు లను వాడుకొంటూ ” వ్యాధి నిరోధక” శక్తిని పొందవచ్చు.

హోమియో మెడిసిన్ పట్ల శ్రద్ద వున్న వారు జిల్సేమియం, అర్సెనిక్యూమ్ ఆల్బం, అల్లీయం సెప్పా, ఓస్కిల్లోకాసినుమ్ లాంటి మెడిసిన్ హోమియో డాక్టర్ని సంప్రదించి వాడుకోవచ్చు.

what a beautiful rain

ఎంతో ఆహ్లాదకరమైన వానాకాలం, ప్రకృతి మనకు ప్రసాదించిన ఋతువు.

తగు జాగ్రత్తలు తీసుకొని మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా వుండి ఆనందం గా గడుపుతారని ఆశిస్తూ…

Leave a Reply

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!