PEARL MILLET-BAJRA (సజ్జలు)

Peral Millet

హలో మిత్రులారా! ఎలా వున్నారు!!

లాక్ డౌన్ ఫేజ్-4 లో కి ప్రవేశిస్తూవున్నాము. ఫేజ్ -3 లో “వలస కార్మీకుల బాధలు, యాతనలు” విన్నాం, ఎన్నో చూసాం.

ఇంత మంది, ఎంతెంత దూరాల్లో వున్న స్వస్థాల నుంచి వచ్చి బ్రతుకు తున్నారో కదా!

కాలే కడుపుకు దూరాభారం ఏమిటి! ఎక్కడ పని దొరికితే అక్కడికి!

కరోనా, ఎన్నో జీవిత సత్యాలని కళ్ళకు కట్టినట్లు చూపించింది !!!

మన చుట్టూ ఇన్నాళ్లు ఏమి జరుగుతుందో! ఎంతమందికి మందికి తెలుసు!!??

ఎవరు, ఎక్కడ నుంచి, ఎక్కడెక్కడి కి వచ్చి, ఏ ఏ పనులు చేస్తూ పొట్ట పోసుకుంటున్నారో! తెలుస్తుంటే ఒకింత ఆచ్చర్యం! ఎంతో బాధ!! ఇన్నేళ్ల మన ప్రజాస్వామ్యం ఈ దేశ ప్రజలకి ఇచ్చింది, ఇదా!?

రాజ్యాధికారం ఇచ్చిన నజరానాలతో కొంత మందికి రాజభోగాలు, ఖరీదయిన జీవితం,కావాల్సినంత సంపద, డాబు, దర్జా.

ఈ దేశం లో వున్న సామాన్య ప్రజానీకానికి ఎప్పటికి అర్ధం కానిది, వారి జీవన ప్రమాణం!  వారి స్థితి, స్థాయి.

రాజ్యాధికారం ఇచ్చిన నజరానా తో కొన్ని వర్గాలు, దేశ స్వాతంత్రియం వచ్చిన తరువాత ఎంతగా, ఎదిగారో తెలియంది కాదు. దాస్తే దాగేదీ కాదు.  

మనకు తెలిసిన లెక్కలు ప్రకారం 70 శాతం సంపదంతా ఒక్క శాతం జనాభా వద్ద, మిగిలిన ఆ 30 శాతం 99 శాతం దగ్గర! 

ఇలా ఎందుకు జరిగింది. ఎంతో మంది మేధావులు, సంఘ సంస్కర్తలు, సేవా తత్పరులు, గురువులు,బాబాలు, వారు వీరు,అవీ, ఇవీ —

ఇది గారడి కాదు, బురిడీ కాదు, వాస్తవం – లెక్కలు తేల్చి చెప్పిన నిజం!

“ఇందరి” శ్రమ అంతా ఎక్కడ కు చేరిందో, తెలిసింది కదా, తెల్సి ఏమి చేయగలం ! మైట్ ఇస్ రైట్ !! బలవంతుని దే రాజ్యం కదా!!!

ప్రపంచ మానవావళికి కి కరోనా చూపిన — “మానవ జీవితం – బతకు చిత్రం” అనే సందేశం తో నైనా కొంత మార్పు వస్తుందా !

కాలమే చెప్పాలి దీనికి సమాధానం!! ప్రాణుల, మనుగడ కోసం మానవత్వమే మేలుకోవాల్సిన సమయం!!!

సరే! ఏ పాటు తప్పిన “సాపాటు” తప్పదు కదా!! ఇక  ఆహార వ్యవహారాల్లోకి వెళదాం.

క్రిందటి భాగాలలో రాగి, జొన్న  ధాన్యాల గురుంచి తెలుసుకున్నాం కదా!

ఇప్పుడు “సజ్జలు” — ఆరోగ్యానికి ఓ సజ్జ (కవచము) రుచికి లో రాజా!!

పురావస్తు పరిశోధన “సజ్జ క్రీ.పూ. 2500 -2000 ” మధ్య ప్రాంతం లో పచ్చిమ “ఆఫ్రికా లో ఉన్నట్లు తెలిపింది. అక్కడినుంచి సాగు విస్తరించి క్రీ.పూ. 1500 నాటికి భారత ఉప ఖండం లో ప్రవేశించింది.

కరువు, వరద వంటి ఎటువంటి వాతావరణంలో నైనా మరియు దాదాపు అన్ని రకాల భూముల్లో సాగుకు అనుకూలమైన పంట “సజ్జ”.

సజ్జని పెరల్ మిల్లెట్, గ్రానో, టైప్ డి గ్రైన్ ( విదేశాల్లో) కంబూ, బజ్రీ, బజ్రా అని మన దేశం లోని వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు.

మొదటి రోజుల్లో దీని “బర్డ్ ఫుడ్” అని పిలిచేవారు.

ప్రధానంగా ఆహార శక్తి మరియు పోషక, రక్షణ ఇచ్చే సజ్జ, (పెరల్ మిల్లెట్ ) ఒకప్పుడు పేద ప్రజలకు ముఖ్య ఆహారంగా ఉండేది.

కారణాలు తెలియవు కానీ “పెరల్ మిల్లెట్” వంటి చౌకైన మంచి ఆహారం ప్రజలకు దూరమైనది.

ఇలాంటి తృణ ధాన్యాలు దూరమవడం, భారత్ లాంటి పేద ప్రజలు వున్న దేశం లో “ఆహార” లోపంతో వచ్చే రోగాలు ఎన్నో రేట్లు పెరిగాయి.

Bajra

ఇది అందరికి తెలిసిందే. కానీ ఈ విషయాలపై “అవగాహన” పెంచే దెవరు? “ఆసక్తి” కనపరిచేదెవ్వరు?

పెరల్ మిల్లెట్ లో భాస్వరం సమృద్ధిగా వుంది. ఇది శరీర కణాల నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

సజ్జలు ని క్రమం తప్పకుండా నెలలో రోజు మార్చి రోజు ఆహారంగా వినియోగిస్తే టైపు -2 డయాబెటిస్ ప్రమాద శాతం ని తగ్గించటం లోనూ, అలానే అదుపులో ఉంచటంలోనూ ఎంతో సహాయకారిగా వుంటుంది.

వీనిలో వున్న మెగ్నీషియం, ఐరన్, కాల్షియమ్, ఫైబర్ మరియు సముద్దిగా వున్న ప్రోటీన్ శరీర నిర్మాణంలోనూ, ఎంజైమ్స్ ని క్రమబద్దీకరించటం లోను సహాయపడుతుంది.

సజ్జలు లో వున్న అధిక శాతం ఫైబర్ జీర్ణ వ్యవస్థకి ఎంతో మేలు చేస్తూ, పెద్ద పేగులలో వచ్చే వ్యాధుల్ని అరికడుతుంది.

100 గ్రాముల సజ్జలు ద్వారా సుమారు 375 గ్రాముల శక్తి, 4.8 గ్రాముల ఫ్యాట్ శరీరానికి అందుతుంది.

ఇప్పడు, సజ్జలు తో మనకు బాగా తెల్సిన వంట అయిన “సజ్జబూరెలు”.

సజ్జబూరెలు చెయ్యటానికి కావాల్సిన పదార్ధములు: 200 గ్రాముల మెత్తటి సజ్జ పిండి, ఎండుకొబ్బరి – 25 గ్రాములు, 3 లేక 4 ఏలకులు, గసగసాలు-20 గ్రాములు, బెల్లం 75 గ్రాములు, నెయ్యి – 20 గ్రాములు మరియు నీరు -125 ఎం.ఎల్., వంట నూనె -250 గ్రాములు.

సజ్జ పిండిని జల్లించి 200 గ్రాములు తీసుకొని ఓ బౌల్ ఉంచుకోవాలి. కొబ్బరిని, ఏలకులు ని మిక్సర్ లో వేసి గ్రైండ్ చేసి ఉంచుకోవాలి.

స్టవ్ వెలిగించి (తక్కువ మంటలో వుంచి) పాన్ పెట్టి అందులో నెయ్యిని వేసి, కొద్దీ సేపటి తరువాత గసగసాలును వేసి వేయించాలి, అవి వేగిన తరువాత, గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి,ఏలకుల మిక్స్ ని కూడా వేసి వేయించి ప్రక్కన పెట్టుకోవాలి.

ఇప్పడు ఓ మందపాటి గిన్నెలో నీటి ని పోసి కొద్దిగా కాగిన తరువాత బెల్లం వేసి తిప్పుతూ బెల్లం పూర్తిగా కరిగే వరకూ (మీడియం మంట పై) వుంచి, దించి దాని లో సజ్జ పిండి ని కొద్దీ కొద్దిగా వేస్తూ మెత్తగా కలుపుకోవాలి.

ఆ కలుపుకున్న పిండి లో కొబ్బరి,ఏలకులు,గసగసాలు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.

ఇప్పడు ఒక బాండీని (ఫ్రైయింగ్ పాన్) పెట్టుకొని (స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి) దానిలో వంట నూనె పోసి వేడి చేయాలి.

ఇప్పడు కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని, ఓ ప్లాస్టిక్ పేపర్ పై నీటి తడిని వ్రాసి ముద్దను వుంచి చేతితో వత్తుతూ, మధ్య మధ్యలో వేళ్ళకు నీటిని అద్దుతూ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఓ మాదిరి దళసరి గా చేసుకొని, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకూ వేపుకోవాలి.

ఇవి ఒక వారం వరకూ నిలువ ఉంటాయి. కొంత మంది ఎండు కొబ్బరి బదులు పచ్చి కొబ్బరి కూడా వేసి చేస్తారు.

( గమనిక : పిండిని గట్టిగా కలుపకూడదు, గట్టిగా ఉంటే బూరెలు పై క్రాక్స్ వస్తాయి)

bajra rote

సజ్జ రొట్టె: 2 కప్పుల సజ్జ పిండి, సాల్ట్ (రుచికి తగినంత), నీరు

ముందుగా 2 కప్పుల పిండి ని తీసుకొని ఓ బౌల్ లో ఉంచుకొని, దాని లో కొంత తీసి ప్రక్కన వుంచుకోవాలి.

నీటిలో ఉప్పుని వేసి బాగా మరిగించి, సజ్జ పిండి ఉంచిన బౌల్ లో కొద్దీ కొద్దీ గా పోస్తూ కర్ర తెడ్డు తో కానీ గరిటె తో కానీ కలపాలి. ఆరిన తరువాత ముద్ద మెత్తగా వుండేటట్లు కలుపుకోవాలి.

గట్టిగా ఉంటే నీటిని పోసిగానీ,మరీ మెత్తగా ఉంటే పిండిని కానీ కలిపాలి.

జొన్న,రాగి రొట్టెలు చేసే అలవాటు వున్నవారు సులభంగానే ఈ సజ్జ రొట్టె లు చేయగలరు.

అలవాటు లేనివారు, కొత్తవారి కోసం – ఓ ప్లాస్టిక్ షీట్ (పోలితిన్ కవర్) ను తీసుకొని కొద్దిగా పొడి పిండిని వేసి, దాని పై ముద్దని ఉంచి మృదువుగా చేతి వేళ్ళతో వత్తుతూ రొట్టె చివర్లు పగల కుండా చేసుకోవాలి.

స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి, దానిపై తావా/పెంకు/పెనం ను ఉంచి వేడి చేసి, తయారు చేసిన రొటీను వేసి, నీటితో తడిపి, పిండిన తడి గుడ్డ తో తిప్పుతో రెండు వైపులా కాల్చాలి.

ఇది అన్ని కూరలతో తినవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్య దాయిని.

రాయలసీమ లోని కొన్ని ప్రాంతాలలో పైన చెప్పిన సజ్జ రొట్టె ని “కారంరొట్టి” పేరుతో చేస్తారు.

పిండి లో ఉల్లి తరుగు,పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, కరివేపాకు అన్నీ కొద్దీ కొద్దీ గా కలుపుకొని, తరువాత వేడినీటిని పోస్తూ మెత్తని ముద్దగా కలుపుకోవాలి.

రొట్టె ని చేసుకొని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.

సజ్జ తో ఓ విజిటబుల్ స్పెషల్ కిచిడి ఆరోగ్యకరమైన ఓ “ఆదివారం” కోసం!

సజ్జలు – 200 గ్రాములు, పెసర పప్పు -50 గ్రాములు, 2 స్పూన్స్ నెయ్యి, పచ్చిమిర్చి-3 ,
లవంగాలు -3 , మిరియాలు-6 , వెల్లులి- 3 రెబ్బలు, పసుపు పొడి -కొద్దిగా, ఉప్పు (రుచికి సరిపోయినంత) బంగాళాదుంప -2 చిన్నవి, టమోటా- రెండు చిన్నవి, క్యారట్- 1 చిన్నది. కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా, కొద్దిగా తరిగిన తోట కూర/బచ్చలి/పాలకూర (ఒక్కటి కానీ మూడు కానీ కలిపి వేసుకోవచ్చు), గరం మసాలా – 1 స్పూన్, నిమ్మకాయ -1 .

సజ్జల్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి 12 గంటలు నీటి లో నాన పెట్టి ఉంచాలి.

ఓ పాన్ లో నేయి వేసి లవంగాల్ని, మిరియాల్ని వేపుకొని తీసివేసి, దానిలో తరిగిన వెల్లుల్లిని, ముక్కలుగా చేసిన బంగాళా దుంపల్ని, ముక్కలు గా కోసిన టమోటాని, తరిగిన క్యారట్ వేసి వేయించి, పసుపు, ఉప్పు వేసి కొద్దిగా నీరు పోసి వేడి చేసి అందులో ఆకుకూరలు వేసి కొద్దీ సేపు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.

పెసర పప్పును కడిగి ఓ అరగంట నీటి లో ఉంచి, డ్రైన్ చేసి, వేరే గిన్నెలో ఉంచుకోవాలి.

ఓ మందపాటి గిన్నెను తీసుకొని, అందులో అరలీటరు నీటిని పోసి బాగా వేడిచేసి, తెర్లుతున్నప్పడు నానపెట్టి వుంచిన సజ్జల్ని వేసి బాగా వుండికించాలి.

సజ్జ గింజ బాగా వుడికితే పొట్ట తెరుచుకొని తెల్లగా కనపడుతుంది. అదే వుడికినట్లు గుర్తు.

ఇప్పడు అందులో నానపెట్టి ఉంచుకొన్న పెసర పప్పు వేసి బాగా తిప్పి, రెండు నిముషాల తరువాత అందులో లవంగాలు,మిరియాల ను, ఉడికించి వున్న కూరగాయల,ఆకుకూరల మిశ్రమాని వేసి ఒక సారి బాగా కలపాలి.

సన్నని మంట పై ఓ పది 5 నిముషాలు పాటు ఉడికించాలి. కొత్తిమీర,కరివేపాకు ను వేసి రెండు నిముషాలు ఉంచాలి.

దించేముందు గరం మసాలా వేసి మూత పెట్టి స్టవ్ ఆపి ఓ నిముషం అలానే ఉంచి, దించి వేడి, వేడి గా వడ్డించాలి. ఇష్టం వున్నవారు నిమ్మకాయ పిండుకొని తినవచ్చు.

సజ్జ సంగటి: ఇది చాలా సులువుగా చేసుకొనే పద్దతి. సజ్జలు – 1 కప్పు, ఉప్పు (రుచికి) నీరు -2 1 /2 కప్పులు.

ముందుగా సజ్జలని బాగా కడుగుకొని ఓ గిన్నెలో నీరు పోసి అందులో వేసి 1 గంట నానపెట్టాలి.

తరువాత, మిక్సీ లో వేసి కానీ కచ్చా పచ్చగా మిక్సీ పట్టాలి. (గింజలు పలుకులు అవ్వాలి)

ఓ మందపాటి గిన్నె లో 1 1 /2 కప్పుల నీటిని పోసి బాగా మరిగించాలి అందులో మిక్సీవేసిన సజ్జలని,ఉప్పుని వేసి, మరో 15 నిముషాలు ఉడికించాలి.

(సజ్జలు ఉడకటానికి సమయం పడుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి)

దీనిని పల్చని పప్పుతో కానీ, ఆకు కూరలతో కానీ తినవచ్చు.

ఇంకా సజ్జ తో వడలు, దోసెలు, ఇడ్లి,మురుకులు, గట్క(మజ్జిగతో) కూడా చేసుకోవచ్చు.

త్వరలో రాబోయే  బుక్  “ధాన్యాలతో ఆరోగ్యం ” (ఈ- బుక్) ఉచితంగా, మన “జస్ట్ గురు” పాటకులందరికి, (రాబోయే 40 వ ఆర్టికల్ తో) అందిస్తాం .

సజ్జలులో అనేక రంగులు,రకాలు వున్నాయి, ముఖ్యంగా తెలుపు ,నీలం, లేత పసుపు, బూడిద, స్లేట్ మరియు ఊదా అలానే సన్నం లావు రకాలు వున్నాయి.

Leave a Reply

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!