Oral health care – Natural way – Using Domestic items

Happy Teeth and Dentist

 

హలో మిత్రులారా !

ఇప్పడు కరోనా గురుంచిన వార్తలు అంతగా “ప్రజలు” చాలా మంది పట్టించుకోవటం తగ్గించేశారు అని జనజీవనములో వచ్చిన మార్పులు చూసి గమనించవచ్చు.

స్కూళ్ళు,కాలేజీలు ఇంకా ఓపెన్ కాలేదు. హోటళ్లు, రెస్టారెంట్లూ, బార్లూ ఓపెన్ ఐయ్యాయి. సినిమాహాళ్ళు త్వరలో తెరుచుకుంటాయి అని వార్తలు.

గత ఆరు నెలలుగా పొల్యూషన్ తగ్గటం, ముక్కు నోరు మాస్కు తో మూసుకొనటం ద్వారా కొన్ని రోగాలు తగ్గుముఖం పట్టాయి అని గణాంకాలు తెలుపుతున్నాయి.

చేతులు శుభ్రత పాటించటం ద్వారా అంటురోగాలు తో పాటు జీర్ణ క్రియకు సంబందించిన రోగాలు కూడా “నియంత్రణ” లో ఉన్నాయని సమాజ ప్రజా ఆరోగ్య విశ్లేషకులు వివిధ మాధ్యమాల ద్వారా తెలుపుతున్నారు .

ఏది ఏమైనా, ఈ కరోనా ఉపద్రవం లో సమాజంలో వచ్చిన జీవన శైలి మార్పులు “ప్రజల ఆరోగ్యం” పై ప్రభావం చూపటం, రాబోయే కాలంలో వైద్య విధానాల పై అవగాహన పెరుగుతుంది అని ఎక్కువమంది భావన.

MASK – MASK

అంతా బాగానే వుంది, మాస్కులు నూటికి తొంబై శాతం జాగ్రత్తగా నే ధరిస్తున్నారు! మిగతావారు ఇంటినుంచి బయటకు రాని వారేలెండి!!

బయట తిరుగుతున్నప్పడు,ప్రయాణం చేస్తున్నప్పుడు, కార్యాలయాల్లో, షాపుల్లో పని చేస్తున్నప్పుడు “మాస్కులు” కంటిన్యూ గా ధరించే ఉంటున్నాము కదా!

CORONA MASK

భయం అలాంటిది కనుక జాగ్రత్త కూడా అవసరమే! దానితో సహజము గా “నోటికి కావాల్సినంత” గాలి అందటం లేదు.

దానితో చిగురులు, దంతములలో కొన్ని అనారోగ్యలక్షణాలు కాన వస్తున్నాయి అని “డెంటల్ హాస్పిటల్” కి పెరిగిన రోగుల శాతం పట్టి తెలుసుంది.

కొంతమంది కోవిడ్ కి బయపడి హాస్పిటల్ కు వెళ్లకుండా “లవంగ” నూనె తో నో, “పెయిన్ అవుట్” అనే డెంటల్ క్రీం తో నో సరిపుచ్చుతున్నారు అని మెడికల్ షాప్ లలో వీటి అమ్మకాలను పట్టి తెలుసుంది.

ఇంకా కొంతమంది దంతాల నొప్పికి “డిప్ చేసిన తరువాత తీసిన టీ బ్యాగ్ ను నొప్పి వస్తున్న పంటి క్రింద పెట్టు కోవటం ద్వారా ఉపశమనం పొందుతున్నారు.

ప్రకృతి వైద్యం, ఆయుర్వేద వైద్యం లలో వున్న పంటి నెప్పులు, నోటి శుభ్రత ల కోసం పరిశీలించగా ఓ చక్కని సులభమైన మార్గం ఇంటిలో దొరికే వాటితోనే దొరికింది.

ఆ ప్రక్రియను తెలుసుకొని ఆచరించి నోటి శుభ్రతతో పాటు, చిగుర్లు, దంతములు యొక్క ఆరోగ్యాన్ని పొందుదాం.

ఆరోగ్య పరిరక్షణ లో గణనీయమైన “మేలు” చేసి “నోటి ప్రాముఖ్యత” ను తెలుసుకుందాం!

PRETTY TEETH -SMILE

టీత్ ప్రెటీస్ ది పేస్! పేస్ ప్రెటీస్ ది బాడీ!! ఎపుడో చిన్నపుడు చదుకున్న పాఠంలో ఓ వాక్యం!

పలువరస రూపమువలన అందమైన ముఖము ! అందమైన ముఖమే మనిషికి అందం!!  పై వాక్యాలను తెలుగు లో కి తర్జుమా చేస్తే వచ్చే అర్ధం!!!

అందరికి ఇది తెలిసిందే అందుకే దాదాపు సినిమా నటులు అందరూ తమ పలువరస పై శ్రద్ద పెట్టిన తరువాతే ఈ రంగములోకి ప్రవేశిస్తారు.

వైద్య శాస్త్రములో “డెంటల్” కోర్సు కి ప్రత్యేకమైన విభాగం ఉంది! ఈ శాస్తం చదివిన వారిని “డెంటిస్ట్” లు అంటారు అని తెలిసినదే కదా!

నేడు జీవన శైలి లో వచ్చిన మార్పులు, ఆహార వ్యవహారములు, రాత్రిపూట వృతి ఉద్యోగాలు కూడా నోటి ఆరోగ్యము పై ప్రభావం చూపుతున్నాయి.

డెంటల్ వైద్య విధానం ప్రకారం “ప్రతి” ఆరు నెలలకు ఒక సారి “డెంటిస్ట్” ని కల్సి దంత ఆరోగ్యాన్ని పరీక్ష చేసుకోవాల్సి వుంది!

ఇది ఆచరించే వారు ఎంతమంది!? బాగా చదువుకున్నవారు, ఆర్థిక స్థితి మంతులు అయినవారు కూడా పాటిసున్నారా!! అనేది, సంశయమే!!!

TURMERIC POWDER

సరే కానివ్వండి, ఇప్పడు ప్రకృతి ప్రసాదించిన మరియు ఇంట్లో దొరికే సహజ సిద్దమైన ఓ “వండర్ఫుల్ టూత్ పేస్ట్” ను ఎలా తయారు చెయ్యాలో తెలుసుకొందాం!

ఇందుకు కావాల్సినవి మూడే మూడు ఒకటి “పసుపు” (టర్మరిక్) రెండు కొబ్బరి నూనె (కోకోనట్ ఆయిల్) మూడు లవంగ నూనె (క్లోవ్ ఆయిల్) ( క్లోవ్ ఆయిల్ ఖరీదు అనుకొనే వారు ఓ 50 గ్రాముల లవంగాలు తీసుకొని దోరగా వేయించి పొడి కొట్టుకొని కూడా కలుపుకొని వచ్చు).

CLOVE BUDS

ఓ స్పూన్ పసుపును ఓ గిన్నెలో తీసుకొని అందులో ఒక ఆరు చుక్కల కొబ్బరి నూనె ను వేసి బాగాకలిపి ముద్దలా చేసుకొని, ఒక రెండు చుక్కల లవంగ నూనె/ కొద్దిగా లవంగ పొడిని వేసి మరలా బాగా కలుపుకోవాలి.

ఈ ముద్దను చూపుడు వేలుతో కొద్ధి,కొద్దిగా తీసుకొని చిగుళ్లు పైన చక్కగా,మృదువుగా ఇరువైపులా రుద్దుకోవాలి.

తరువాత ఒక టూత్ బ్రెష్ ను తీసుకొని శుభ్రముగా కడిగి దానిపై ఈ పసుపు,కొబ్బరి నూనె,లవంగ నూనె మిశ్రమాన్ని ఉంచి దంతములను ఇరువైపులా శుభముగా మృదువుగా బ్రష్ చెయ్యాలి.

BEDTIME BRUSING

ఉదయం ఒక సారి, రాత్రి పడుకొనే పోయి ముందు ఒక సారి శ్రద్దగా ఒక వారం పాటించి చూడండి. మీరు పొందిన మార్పును చూసి ఆశ్చర్యపోతారు!!
మీరు రెగ్యులర్ గా వాడే టూత్ పేస్ట్ ను వినియోగించనక్కర లేకుండా ఈ “సహజ మిశ్రమం” తక్కువ ఖర్చుతో మీ ఇంటిల్లి పాది “ఓరల్ హెల్త్” పొందే మార్గం!

ఓరల్ హెల్త్ కి సంబంధించిన మరో ” టూత్ మిశ్రమం” కూడా వుంది తరువాత దాన్ని గురుంచి కూడా తెలుసుకొందాం.

అది, వారానికి ఒక్క సారి వాడితే చాలు పళ్ళు పైన వున్నటీ, కాఫి, టొబాకో, పాన్ మరకలు కూడా నెమ్మదిగా తొలగి పోతాయి.

HAPPY HEALTHY FAMILY

ప్రకృతి వైద్య విధానాల లతో శరీరం లోని మిగతా ముఖ్య భాగాలకు మనం ఎలాంటి రక్షణ పొందవచ్చో తెలుసుకొందాం.

One Response

  1. ch ramamohan October 10, 2020

Leave a Reply

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!