
National Nutrition week
2020
హలో మిత్రులారా
మన దేశ జనాభా 2020 డిసెంబర్ చివరికి 138 కోట్లు గా ఉండవచ్చు అని గణాంకాలు లెక్కలు వేశాయి. చైనా జనాభా 144 కోట్లు గా ఉండవచ్చు అని అంచనా
2022 జనవరి నాటికి చైనాని దాటవేసి మనమే నెంబర్ వన్ స్థానాన్ని సాధిస్తాం. అమ్మయ్య ప్రపంచం లో అగ్రరాజ్జ్యంగా అవతరించాము! జానాభాలో!! మేరా భారత్ మహాన్!!!

population -India
మన జనాభానే మనకు బలం! ప్రపంచ లోని పలురకాల “వస్తు” తయారీలకు మనం వినియోగదారులం!
ఇంత పెద్ద జనాభాకి కావలిసిన మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయటం! తలకు మించిన భారమే!!
పేదరికం నానాటికి పెరిగి పోతూవుంది!!!
వ్యవసాయం నుంచి వస్తున్న రాబడి చాలీచాలక పోవటంతో రైతు, రైతు పై ఆధారపడి జీవించే వివిధ వృత్త్తుల వారు గ్రామ సీమలను వదిలి పట్టణాలకు మళ్ళారు.
దీనితో, అర్బన్ పాపులేషన్ పెరగటం తో “కొత్త” “కొత్త” సమస్యలు మొదలయ్యాయి.

Mumbai -slums
వీరందరూ నివసించటానికి కావాల్సిన గృహసముదాయాలతో ‘”అర్బన్ స్లమ్ లు” పెరిగి పోయాయి.
ఇలా నిండు గర్భిణీ లా పట్టణాలు కనిపిస్తుంటే! బక్క చిక్కిన పేద ముసలి ముత్తయిదువులా “పల్లె” లు కనిపిస్తున్నాయి.
రోటీ -కపడా -మఖాన్ సమస్యల చుట్టూ నే… ప్రజలు జీవితం! ప్రభుత్వాల పథకాలు!! కొనసాగుతూనే వున్నాయి.
సెప్టెంబరు మాసం లోని మొదటి వారం అంటే సెప్టెంబరు 1 నుండి 7 వరకూ దేశంలో “నేషనల్ న్యూట్రిషన్ వారాన్ని” జరుపుకొంటాం ప్రతి ఏడు.
మెరుగైన ఆరోగ్యం కోసం ప్రజలు న్యూట్రిషన్ పై దృష్టి పెట్టడానికి మరియు అలాంటి ఆహారాలపై అవగాహన పెంచటానికి!
ప్రతి ఒక్కరూ మంచి ఆహారంతో మేలైన ఆరోగ్యాన్ని పొందుతూ శక్తిమంతులుగా దేశ పౌరునిగా రోగరహితులుగా దేశ సంపద లో భాగం కావాలని “ప్రభుత్వం” కార్యక్రమాల్ని వారం పాటు నిర్వహిస్తుంది.
పోషకాహారం అంటే ఏమిటి! దానివలన కలిగే ప్రయాజనాలు! శరీర నిర్మాణం లో పోషకాహార పాత్ర!! తెలియ జేస్తూ చెప్పే అనేక కార్యక్రమాలను స్కూల్స్,కాలేజెస్ మరియు అన్ని కార్యాలయాల్లో ఈ వారం పాటు నిర్వహిస్తారు.
పిల్లకు చిత్రలేఖనం పోటీలు, డిబేట్లు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు రూపంలో పోషకాహారం పట్ల అవగాహన కల్పిస్తూ, మంచి ఆహారం ఎంత అవసరమో తెలియ చెప్పటం!

zestguru school room
ఈ కార్యక్రమాలు పై లఘు చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలు తీసి గ్రామగ్రామాన ఈ ఏడు రోజులూ ప్రదర్శిస్తూ తెలియ చేయటం ఈ నేషనల్ న్యూట్రిషన్ డే కార్యక్రమాల్లో ఒక భాగం.
ఈ బాధ్యత లో స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు కూడాపాల్గొనేలా స్థానిక ప్రజా ప్రతినిధులు పూనుకొని ముందుకు వచ్చి ప్రజలందరికి పౌష్టికాహార ప్రాధాన్యత వివరించాలి.
ఆహార అవసరం — కాల పట్టిక — మనం జీవించాలి అంటే ఆహారం తీసుకోవాలి! కేవలం తినటం కోసమే జీవిస్తే!?
“తిండికి తిమ్మరాజు – పనికి పోత రాజు” అనే నానుడి మన అందరికి తెలుసు కదా!
గురజాడ వారు దేశమును ప్రేమించుమన్నా గీతంలో .. ” తిండి కలిగితే కండ కలదోయి
కండ కలవాడేను మనిషోయ్! ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్!
అంటూ ” మంచి ఆహారాన్ని” దాని విశిష్టత గురుంచి “అక్షర” బోధ ఆనాడే చేశారు.
నేషనల్ న్యూట్రిషన్ కౌన్సిల్, నీతిఆయోగ్ వైస్ చైర్మెన్ యొక్క లీడర్ షిప్ లో దేశంలో ని అన్ని జిల్లాలో దశలవారీగా కార్య్ర క్రమాలను రూపొందించింది.
“పోషన్ అభియాన్” అనే స్కీం క్రింది “పిల్లలకు” వారి జీవిత కాలంలో మొదటి 1000 రోజులకి కావాల్సిన వాటిని సమగ్రంగా నిర్ణయించి తగిన “ప్యాకేజ్” ని నిర్ణయించటం.
2018 సెప్టెంబర్ మాసంలో జరిగిన మహా పోషన్ కార్యక్రంలో తీసుకున్నా నిర్ణయాలను సమీక్షించి, పునరంకితమై పూర్తిచెయ్యటం.
ముఖ్య ఆహారం “బలమైనది” గా వుండి అందరికి అందుబాటులో ఉండేలా చేయటం.

children
మన దేశంలో పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్న పిల్లలు సుమారు 38 శాతం.
ఇక మహిళల (15 -49 ఏజ్) విషయానికి వస్తే అర్బన్ ఏరియాలో 40 శాతం, రూరల్ ఏరియాలో 62 శాతం పైన “రక్త హీనత” (అనీమియా) తో బాధ పడుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
2020 నేషనల్ న్యూట్రిషన్ వీక్ ముఖ్య స్లోగన్ — “ఆహార సహాయంతో మలబద్దకాన్ని ఎలా నయం చేయాలి”
భారత దేశములో సుమారు 35 శాతం పైగా “మలబద్దకం” (కాన్సిపేషన్) తో బాధపడుతున్నారని ఓనివేదిక ఆదరంగా తెలియవచ్చింది.
దీనికి ప్రధాన కారణం అన్ని ఆహార పదార్డములు ఎక్కువుగా ప్రాసెస్ చేసినవి తినటం!
ప్రధాన ఆహారమైన “వరి” “గోధుమ” ధాన్యాలు పూర్తిగా పోలిష్ చేయటం వలన “అందులో వున్న పోషకాలతో పాటు ఫైబర్ ను కూడా దూరం చేసుకోవటం.

fast food sandwich
ఆధునికత తో పెరిగిన ఆహారపు అలవాట్లు “జంక్” ఫుడ్,బేకరీ పుడ్, రుచి పేరుతో రకరకాల అసంబద్ధ మేళవింపుల్తో చేసిన “పాస్ట్ ఫుడ్” రెసిపీలు “పొట్ట సైజు” ను పెంచుతూ మలబద్దకాన్ని బహుమతిగా ఇచ్చాయి.
భారతీయ వైద్య విధానం లో చెప్పిన సూత్రం : “సర్వ రోగ మూలం – మలమూత్ర లోపం!”
మలబద్దకాన్ని అనేక కారణాలు వున్నాయి. ఆహారంలో ఫైబర్ శాతం అతి తక్కువగా ఉండటం.
ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఉండటం, ఫ్రోజెన్ ఫుడ్ ను తిరిగి వేడి చేసుకొని తినటం, మసాలా,ఆయిల్ ఫుడ్ తింటూ శీతల పానీయాలు సేవించటం.
డీప్ ఫ్రై నాన్ వెజ్ లు, నాన్ -వెజ్ పచ్చళ్ళు (వీటి లో ఫైబర్ శాతం జీరో )తరుచుగా ఆహారంగా తీసుకోవటం.
ఆహారపు అలవాట్లే కాకుండా మద్యపానం,ధూమపానం, టొబాకో చూయింగ్ ( గుట్కా,ఖైనీ) కూడా జీర్ణ కోశాన్నీ పాడు చేసి మలబద్దకాన్ని కలుగ జేస్తాయి.

work stress- tension
ఇక మనసు, వత్తిడి కూడా మలబద్దకాన్ని కారణం. నేటి కొలువులు, టార్గెట్ లు, సమాజ పరమైన పరిస్థితి- స్థితి లు అందరికి తెలిసినవే.
ఇది కూడా నేడు పెరిగిపోతున్న మలబద్దక సమస్యకు మరో అదనపు అంశం!
ఇక మలబద్దకం సమస్యనుంచి దూరం కావటానికి – అనేక రోగాలకు మూలమైన ఈ దుర్వ్యవస్థని నిర్మూలించటానికి విధిగా పాటించవలిసిన అలవాట్లను, జాగ్రత్తలు తెలుసుకొందాం!
1 . ఆహారములో ఫైబర్ శాతం ఎక్కువగా వుండే వాటిని చేర్చుకోవటం.
2 . నీరుని క్రమ పద్దతిలో తీసుకొంటూ( కనీసం రోజుకు 4 నుంచి 5 లీటర్లు), డీహైడ్రేషన్ కలగకుండా చూసుకోవటం.
3 . సునాముఖి ఆకు,మిరియాలు,కొత్తిమెర,శొంఠి, పిప్పళ్లు తో ‘చారు’ కాసుకొని తరుచూ ఆహారంలో తీసుకొంటాం.
4 . ఆహారాన్ని బాగా నములుతూ, మనసుని ఆహారముపై “లగ్నం ” చేస్తూ ( మొబైల్ ఫోన్/టీవీ/లాప్ టాప్ లు చూడకుండా) తినటం.
5 .అత్యాశ లకు, అధిక ఆలోచనలకు తావు ఇవ్వకుండా “మనసు” ని మధురమైన సంగీతం వైపు మరల్చటం ( ఆలోచనలు జీర్ణ శక్తిని దెబ్బ తీస్తాయని నిరూపితమైనదే)
6. క్రమం తప్పకుండా రోజు కనీసం 4 నుంచి 5 కిలోమీటర్లు నడవటం లేక 45 నిముషాలు యోగా, ప్రాణాయామం చెయ్యటం. ఓ అరగంట ధ్యానం చెయ్యటం.
7 . వీలు చేసుకొని జనారణ్యం వదలి అప్పడుడప్పుడూ “ప్రకృతి” లో కి ప్రయాణం చేసి తన ఉనికిని తెలుసుకోవాలి.
వీటిని ఆచరిస్తూ మంచి పోషకాలతో కూడిన “ప్రకృతి” ప్రసాదించిన ఆహారాన్ని తీసుకొంటా “ఆరోగ్యం” తో “ఆనందం” గా జీవిద్దాం!
ఈ 2020 “నేషనల్ న్యూట్రిషన్ వారం” సందర్భంగా పౌష్టికాహార లోపాలని సవరించుకొని, మన చుట్టూ వున్న, చౌకగా దొరికే ఆహార పదార్థములను తెలుసుకొంటూ — పది మందికి తెలియచేద్దాం!

aaharam- aaroygam-aanandam
ఈ ఏటి థీమ్ “ఆహారంతో మలబద్దకాన్ని తొలిగించుకొందాము” ని విజయవంతము చెయ్యాలని కోరుకొంటూ- — మరో ముఖ్యమైన “ఆరోగ్య” విషయం పై కలుసుకొందాం.
Useful information. Keep it up 🙏
Detailed ga chala baga vivarincharu.. useful information Bro…