
MUSHROOM
ఆహారపు అలవాట్లు ను ప్రధానంగా “శాకాహార – మాంసాహార” ములు గా ప్రపంచ వ్యాప్తంగా విభజన వుంది.
పుట్టగొడుగులు శాకాహారమా మాంసాహారమా అనేది ఎప్పటినుంచో వున్న ప్రధానమైన ప్రశ్న!
మనకు తెలిసి అందుబాటులో ఉన్న శిలీంధ్రాలు వెయ్యి జాతుల పైగా వున్నాయి. వీటిలో పుట్టగొడులు ప్రధానం గా ఒకటి!
ఐతే, తినదగిన పుట్టగొడుగులు వున్నవి కొన్ని మాత్రమే వున్నాయి. ఇవి ప్రధానంగా సాగు రకాలుగా వున్నాయి.

BUTTON MUSHROOMS
పుట్టగొడుగులు ఏమిటో తెలుసుకుందాం! పుట్టగొడుగులు బహుళ సెల్యులార్ శిలీంధ్రాలు.
పుట్ట గొడుగులు మొక్కలు జంతువులూ కాకుండా “శిలీంధ్రాలు” గా వర్గీకరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పుట్టగొడుగులు వర్షాకాలం లో పుట్టల పైన, నుయిదిబ్బల పైన లభిస్తాయి.

CORINUS MUSHROOM
పుట్టగొడ్డుల పెంపకం కుటీర పరిశ్రమగా ప్రారంభమైన తరువాత ఇవి డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో మరియు ఇతర వాణిజ్య సముదాయాల్లో అన్ని కాలాలలో దొరికే వెసులుబాటు కలిగింది.
పుట్టగొడ్డులలో ఎన్ని రకాలు వున్నాయి? వీటిని ఆహరం గా తీసుకోవటం ద్వారా లభించే విటమిన్లు,లవణాలు, ఖనిజాలు కలిగే ప్రయోజనాలు తెలుసుకొందాం.
పుట్టగొడుగుల ని వివిధ ప్రాంతాలలో ఈ విధంగా పిలుస్తారు. ముష్రూమ్స్ అని ఇంగ్లీష్ లో. కుకురముట్ట అని హిందీలో, కాలాన్ అని తమిళ్ లో, అనబె అని కన్నడ లో పిలుస్తారు.
ప్రధానంగా తినదగిన పుట్టగొడులు రెండురకాలు గా వర్గీకరించారు.
1 . షెల్ఫ్ (బ్రాకెట్) శిలీంధ్రాలు మరియు బోలెట్
2 . అస్కోమైసెట్స్లో ట్రఫుల్స్ మరియు మోరల్స్
ఈ రెండు వర్గీకరణలోకి వచ్చి మనకు తెలిసినవి వైట్ బటన్ , బోల్ట్, షీయుటకే, మైతాకె, తృఫ్ల్స్, వోయిస్టర్, మొరేల్స్ మరియు ఎనోకి.
వీటిలో మనకి ఎక్కువగా లభించేవి వైట్ బటన్, మిల్క్ వైట్ బటన్ రకాలు మరియు గామీణ ప్రాంతంలో సహజం గా దొరికే దేశవాళీ రకం. ఇవి చిన్నటి టోపీ లా ఉంటే తల కలిగి పొడవాటి కాడాలు కలిగి ఉంటాయి.

MORELS MUSHROOM
ఎన్ని రకాలు వున్నా వీటిలో వున్న ప్రధానమైన పోషకాలు దాదాపు ఒకటే.
పుట్టగొడ్డులలో సహజమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి.
అధిక నాణ్యమైన పోషకాలు కలిగి ఉన్నప్పటికీ కేలరీలు మరియు కొవ్వులు తక్కువగా వుండి కొలస్ట్రాల్ శాతం జీరో గా ఉంటుంది.

STINKMORCHEL MUSHROOM
పుట్టగొడుగులు ఎర్గోథినేన్, ఫినోలిక్ పిగ్మెంట్స్ వంటి సహజ యాంటీ-ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. అలానే విటమిన్ బి -12 ను తగినంత పరిమాణంలో వుంది.
ముష్రూమ్స్ లో మాంగనీస్, రాగి, మాలిబ్డినం, జింక్, సెలీనియం మరియు అయోడిన్ వంటి ఖనిజాలు పుష్కల్మగా వున్నాయి.
పుట్టగొడులలో ఇంకా “ఎర్గో-కాల్సిఫెరోల్” అనే విటమిన్ డి మూలకం తో పాటు కాల్షియం మరియు ఫాస్ఫేట్ కలిగి వుంది.
పుట్టగొడుగులను ఎలా ఉపయోగించాలి?
వీటిని శుభ్రంగా రన్నింగ్ వాటర్లో కడిగి శుభ్రమైన వస్త్రంతో తుడిచి మృదువుగా వున్న టోపీ లాంటి భాగాన్ని మరియు కాడ ను కత్తిరించాలి. గట్టిగా ఏమైనా తగిలిగే దాన్ని తీసివేయాలి.
కొంతమంది వీటిని నీటికి బదులు వెనిగర్ తో కూడా శుభ్రపరుస్తారు.
వీటిని ముక్కలు గా కత్తిరించి వచ్చు కానీ కూరగాయలు లాగా పీలర్తో పై భాగాలను తొలిగించరాదు.
ఉడికించేటప్పుడు ముష్రూమ్స్ ముడుచుకు పోకుండా ఉండేటందుకు వంట చివరలో ఉప్పును కలుపుతారు.
పుట్టగొడుగులతో చాలా రకాలు తినదగినవి ఉన్నపటికీ కొన్ని తినగూడనివి ఉంటాయి, జాగ్రత్తగా వీటిని పరిశీలించి తెలుసుకొని ఆహారంగా స్వీకరించటం శ్రేయస్కరం.
తెలియకుండా వీటిని ఆహారంగా తిన్నప్పడు కడుపులో నోప్పి, వాంతులు,విరోచనాలు అవటం మే కాకుండా ఒక్కొక్క సారి ప్రాణాపాయం కూడా!
అందుకే, ఏదైనా పుట్టగొడుగు తినే ముందు దాని యొక్క ఖచ్చితమైన రకం మరియు తినదగినదేనా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఐతే, ఈ నాడు మనకి పుట్టగొడుల పెంపకం పెరగటం ద్వారా మార్కెట్ లో దొరికే అన్ని రకాలు తినదగినవే లభించటం ఓ విశేషం!
గామీణ ప్రాంతాల నుంచి సేకరించి సీజన్లో అమ్మే దేశవాళీ రకాలు కూడా మంచివే.

TASTEY MUSHROOM FILLING
ముష్రూమ్స్ రెసిపీస్ – – కడాయి మష్రూమ్ గ్రేవీ, మష్రూమ్ మసాలా గ్రేవీ, మష్రూమ్ ఆలూ టమోటో కర్రీ, మష్రూమ్ కాజు గ్రేవీ, ముష్రూమ్స్ కట్లెట్ మరియు ముష్రూమ్స్ మంచూరియా ఇలా అనేకరకాలైన రుచికరమైన డిషెస్ వున్నాయి.
(ఈ వంటలు ఎలా చెయ్యాలో త్వరలో “జెస్టుగురు” ఉచితంగా అందించే ఈ- బుక్లెట్ లో)

POWER OF MUSHROOM
అవకాశం దొరికినప్పుడల్లా పుట్టగొడులని ఆహారంగా తీసుకొంటూ ప్రకృతి ప్రసాదించిన ఈ పోషకాల గని లో మేళ్లని, రుచిని ఆస్వాదిస్తారని కోరుకొంటూ.
ఇంకా, ఇలానే తినదగిన “శిలీంధ్రాల” ను గురుంచి తెలుసుకొందాం.