MILK AND MILK PRODUCTS – SALIENT NUTRITION POINTS

INDIAN COW

పుట్టిన ప్రతి జీవి మొట్ట మొదటి ఆహారం … పాలు
పాలు సంపూర్ణ ఆహారం అని మనం చిన్నప్పటినుంచి చదివాము! మరియు విన్నాం!!
ఇప్పడు పాలు గురుంచి పూర్తిగా తెలుసుకొందాం!!!

MOTHER MONKEY FEEDING MILK

పాలు ఇచ్చే జీవులను “క్షీరదాలు” అని పిలుస్తారు.

సాధారణంగా జీవజాతులలో ప్రధానమైన వర్గీకరణం —  ప్రకృతి నియమం —  “ఆడ” “మగ” .

ఆడ మగ సంగమం ద్వారా “పునరుత్పత్తి” జరుగుతుంది.  ఇది జీవకోటి కి ప్రకృత్తి ప్రసాదించిన వరం.

ఈ సంగం యొక్క లాలస జీవకోటి లో వున్న జీవుల అన్నిటికి సమానము కాదు, సాపేక్షికము కాదు అలానే ఆపేక్షణీయం కాదు.

ఐతే, జీవ జాతులలో లక్షల ఏళ్ళ నుంచి ప్రతేక్యత కలిగి “బుద్ది ” జీవిగా విడివడి నాగరీకునిగా మారిన సంగతి పాఠకులకు విదితమే!

మిగిలిన, జీవకోటిని తన అదుపాజ్ఞలలో పెట్టుకొని మనుగడ సాగిస్తూ “స్రర్వ శ్రేష్ఠునిగా” పంచభూతాలని నియంత్రిస్తూ తన పాంచ భౌతిక శరీర “సుఖం” ని పొందుతున్నాడు.

జీవకోటి పునురుత్పతి లో క్షేత్ర బీజ ప్రాధాన్యత, వాని అంతర్గత,బాహ్య లక్షణాల సమ్మేళనా భరితమే  — “సంతానము”.

దాదాపు అన్ని జీవులలో “ఆడ” జాతి ప్రాముఖ్యత కడుపులో ఓ జీవిని మోసి, జన్మనిచ్చి తన స్తన్యం ద్వారా ప్రధమ బాహ్య ఆహారాన్ని ఒసగటం. ( కొన్ని జీవ జాతులలో వేరే విధంగా ఉంటుంది ).

ఆడ క్షీరదాల క్షీర గ్రంధుల ద్వారా ఉత్పత్తి అయ్యే పోషక ద్రవం ఇది.

BREAST FEEDING MOTHER AND CHILD

ఈ “స్తన్యం” శిశువు లకి ప్రధానమైన ఆహారం!  స్తన్యం మే “అమ్మ” పాలు!!

ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి ప్రకారం రోజుకి కావాల్సిన కాల్షియమ్ పిల్లలకు 800 నుండి 1200 మిల్లీగ్రాములు, పెద్దలకు 1000 మిల్లీగ్రాములు మరియు వృద్ధులకు 1200 మిల్లీగ్రాములు అవసరం అని తెలిపింది.

ఈ లెక్కలు ప్రకారం మన అవసరానికి కావాల్సిన కాల్షియమ్ “పాలు మరియు పాల పదార్ధములు” ద్వారా పొందవచ్చు.

పాలు మరియు ప్రధాన పాల ఉత్పత్తులు ఏవో తెలుసుకొందాం.

MILK PRODUCT

1. పెరుగు (యోగర్ట్) 2. మజ్జిగ (బట్టర్ మిల్క్) 3. పనీర్ 4. చేద్దార్ చీజ్ 5. క్రీం చీజ్ 6. రికోత్త చీజ్ 7. పాలు ( ఆవు/బఱ్ఱె(గేదె)/మేక/ గొర్రె/ఒంటె/గాడిద) 8. జున్ను 9. కోవా (పచ్చి) మరియు 10. దూద్ పేడ

పాలు (మిల్క్) : ఆడ క్షీరదాల క్షీర గ్రంధుల ద్వారా ఉత్పత్తి అయ్యే పోషకమైన ద్రవం ఇది. ఆవు పాలు ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి కాని గొర్రెలు, మేక, గేదె మరియు ఒంటె పాలు కూడా లభ్యతను ప్రాంతాలను పట్టి వినియోగం లో వున్నాయి.

YOGURT-RASBERRIES

యోగర్ట్ (పెరుగు): బల్గేరియన్ దేశం లోని గ్రామాల్లో మొట్టమొదిసారి పాల నుంచి పెరుగును తయారు చేసినట్లు చరిత్రలో నిలిచి వుంది.

పాలను కిణ్వనం (ఫెర్మెంటేషన్) ప్రక్రియ ద్వారా తయారుచేసిన ప్రసిద్ధ పాల ఉత్పత్తి- పెరుగు (యోగర్ట్).

తెలుగు వారి “భోజనము” లో పెరుగు లేనిదే పూర్తి కాదు.

అయితే, పెరుగును రాత్రి పూట ఆహారంలో తీసుకోవటం “జీర్ణశక్తి” కి ఆటంకం కలిగించే అవకాశం ఉందని ఆయుర్వేద శాస్త్రం తెలుపుతుంది.

మజ్జిగ (బటర్ మిల్క్) : పెరుగు నుండి తయారు చేస్తారు. పెరుగును బాగా చిలికి తే దాని నుంచి వెన్న ( బట్టర్) తెట్టు లా పైన తేలుతుంది. దానిని వేరు చేయగా మిగిలిన తెల్లని ద్రావణమే “మజ్జిగ”.

తక్కువ కెలోరిస్ కలిగి మంచి పోషకవిలువలు తో చక్కగా జీర్ణ శక్తిని కాపాడే శక్తివంతమైన ద్రవ పదార్ధం. అన్ని కాలాలలో, అన్ని ఆరోగ్య స్థితులలో తీసుకోదగినది.

PREPARTION OF CHEESE

వెన్న (బట్టర్) : ఇది పాలలోని 80 శాతం పైగా కొవ్వులతో నిండి ఉంటుంది. వెన్న అనేది కేంద్రీకృత రూపం. వెన్న ఎక్కువగా ఆవు పాలు, బఱ్ఱె పాలు తో చేస్తారు. ఉప్పు ని కలిపి నిలువచేస్తారు.

చీజ్ (cheese) : ఇది ఆవు/బఱ్ఱె( గేదె)/మేక/ గొర్రె/ఒంటె పాల నుంచి తయారు చేస్తారు. పాలు, క్రీమ్ ల మిశ్రమం ను గడ్డకట్టించటం, ఎండపెట్టటం ద్వారా చీజ్ ను తయారు చేస్తారు. తయారీ లో చేసే పద్దతి ని పట్టి అనేక రకాల పేర్లుతో పిలుస్తారు.

CHEDDAR CHEESE

చేద్దార్ చీజ్(బ్రిటిష్ చీజ్) : ఇది ఎక్కువగా వంటల్లో వినియోగిస్తారు.

కాటేజ్ చీజ్ ( అమెరికా చీజ్) : ఇది లో ఫాట్ డైట్. ఇది వేల ఏళ్ల క్రితం యూరోప్ ప్రాంతం నుంచి ప్రపంచమంతా పరిచయం చేయబడింది. అమెరికా లో దీని వినియోగం ఎక్కువ.

రికోత్త చీజ్ (ఇటాలియన్ చీజ్): సున్నితమైన, మృదువైన రుచిని కలిగి వుండి మిఠాయిలలో, చాకోలెట్స్ తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు.

CREAM CHEESE

క్రీం చీజ్ : ఇది అమెరికా క్రీం చీజ్ గా పిలవబడుతుంది. ఎక్కువగా డెజర్ట్, కేక్స్, బ్రెడ్స్ అలంకరణలతో వినియోగిస్తారు.

వివిధ రంగులు కలిపి ఘనీభవించే ప్రక్రియ (ఐసింగ్) తో ఆకర్షణీయంగా అనేక ఆకృతులల్లో మలుస్తారు.

PANNER-INDIAN COTTAGE CHEESE

పన్నీర్ ( ఇండియన్ కాటేజ్ చీజ్) : ఇది సింధు లోయ నాగరికత కాలం నుండి పాలనుండి ఉత్పత్తి చేసే అతి ప్రాచీన ఆహారం. దీని చెనా అనికూడా పిలుస్తారు.

కూరలు(కర్రీస్) తయారీలో మరియు కొన్ని రకాల మధుర పదార్థాల తయారీలో వినియోగిస్తారు.

పాలు మరియు దాని ఉత్పత్తుల ఆరోగ్య ప్రయోజనాలు :  ఆరోగ్యం మరియు శ్రేయస్సుల లో పాలు,దాని ఉత్పత్తుల పాత్ర అమోహం.

పాలు సమృద్ధిగా,చవకగా లభించే చాలా పోషక విలువలు కలిగిన ఆహరం. ప్రోటీన్, విటమిన్లు మరియు ఖనిజాల యొక్క అద్భుతమైన వనరు.

మిల్క్ ప్రోటీన్ ముఖ్యంగా అమైనో ఆమ్లం లైసిన్లో అధికంగా ఉంటాయి. ఇవి గింజలు,ధాన్యాలు, కాయలు మరియు విత్తనాలకు మంచి సప్లిమెంట్ (అనుబంధం).

MILK SELLER CART-BRITESH ERA

పాలలో “లాక్టోస్” 97% కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. అయితే పెరుగు, చీజ్ మరియు మజ్జిగ వంటి ఫెర్మెంటేషన్ (పులియబెట్టిన) తర్వాత చాలావరకు జీర్ణమయ్యే “లాక్టిక్ ఆమ్లంగా” మారుతుంది.

పాల ఉత్పత్తుల వినియోగం తో శరీరానికి మంచి పోషణ లభిస్తుంది.

ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, ముఖ్యమైన కొవ్వు లతో జతకట్టబడి పిల్లలకు,వృద్జులకి మరియు అనారోగ్యం నుండి స్వస్థత పొందుతున్న వారికి మంచి ఆహారం.

పాలు మరియు పాల ఉత్పత్తులు సహజంగా కాల్షియం యొక్క గొప్ప వనరు.
కాల్షియం శిశువులలో సరైన దంతాల అభివృద్ధిని నిర్ధారిస్తుంది.

గుండె కణాలు, నరాలు మరియు కండరాల పనితీరుపై మరియు ఎముకల నిర్మాణం,పెరుగుదలలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది.

CHEESE ROLE

“ఆస్టియోపొరోసిస్” అలానే కొలొరెక్టల్ క్యాన్సర్ మరియు హైపర్ కొలెస్టెరోలేమియా వ్యాధులను అడ్డుకోవటం లో సహాయకారిగా నిలుస్తుందని శాస్త్ర నిరూపణ.

పాలు మరియు పాల ఉత్పత్తులలో బి కాంప్లెక్స్ కుటుంబం లోని రిబోఫ్లేవిన్, పిరిడాక్సిన్, థియామిన్, పాంతోతేనిక్ ఆమ్లం, విటమిన్-బి 12

స్వచ్చమైన గడ్డిని ఆహారంగా తినే భారత్ లోని ఆవు జాతుల్లో పాలు “పసుపు” రంగుని కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ మరియు β-కెరోటిన్ కలిగి ఉంటుంది.

ఇన్ని మంచి పోషకాలుతో సహజమైన రుచి తో వుండే పాలు మరియు పాల పదార్ధములు రోజూ “ఆహారం” గా స్వీకరిస్తూ మంచి “ఆరోగ్యం”తో జీవించాలని అభిలాష!

MILK – NUTRITION

ఒక్క మాటలో చెప్పుకోవాలంటే — “పాలు” సంపూర్ణ ఆహరం.

3 Comments

  1. N.sekhar July 5, 2020
    • Zestguru July 7, 2020
  2. Masapathri Srinivas August 19, 2020

Leave a Reply

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!