స్వాగతం! సుస్వాగతం! శుభ స్వాగతం!!!
“లాక్ డౌన్” లో ఎవరు స్వాగతం పలుకుతున్నారు!? బయటుకు రావద్దు! ఇంటిపట్టునే వుండండి! మీరు మీకుటుంబం జాగ్రత్త.
ఒంటినిండా పొడుచుకొచ్చిన బొబ్బలతో ఓ బూచోడు తిరుతున్నాడో! అని ప్రపంచంతా మారుమోగుతున్న వేళ!
కేంద్ర, రాష్ట్రాలు అహర్నిశలూ వారివారి సిబ్బందితో తగు జాగ్రత్తలు,హెచ్చిరికలు,చూచనలు,సలహాలు, సేవలు చేస్తున్న వేళ మనం మనకోసం,దేశం కోసం, మానవాళి మనుగడ కోసం కనీస ధర్మంగా “లాక్ డౌన్” పాటిద్దాం.
ఓకే! మరో 14 రోజులు ఇంటిపట్టునే ఉంటున్నాం కదా! ఈ సమయాన్ని వినియోగించుకొందాం అని అనుకొన్నాం కదా! ముందు గా మనము అనుకొన్న ప్రకారం
యోగ విద్యలో ఓ భాగమైన “ధ్యానం” నేర్చుకొందాం!
ఏప్రిల్ 01 నుంచి ఏప్రిల్ 14 రోజుల పాటు రోజు కో “గంట” సేపు ఈ ధ్యానం పై శ్రద్ద పెడదాం!
మిత్రులారా! సుసంపన్నమైన “తెలుగు” జాతి “వెలుగులు” నలు చెరుగులా పారిస్తున్న దశ కోటి తెలుగు ప్రజలారా!
పతంజలి మహర్షి కి ప్రణామములతో! ముందుగా మరో సారి “అష్టాంగ యోగం ” లో ని ప్రధాన అంశాలు 1 . యమ 2 . నియమ 3 . ఆసన 4 . ప్రాణాయామ 5 . ప్రత్యాహార 6 . ధారణ 7 . ధ్యాన 8 . సమాధి
పై క్రియలన్ని నేర్చుకొని ఆచరిస్తే మనిషి, ఋషిగా,మహర్షిగా అవటం అటుంచి మనిషిగా తోటి మనిషిని “మనిషిగా” చూసే “మనసు” పొంది , ఓ మంచి దేశ పౌరునిగా సంఘజీవిగా మెలగటం తథ్యం! ఎంతమాతం అతిశయోక్తి కాదు!
వీలు వెంబటి మనం అన్ని ప్రక్రియను నిష్ణాతులైన యోగ గురువుల నుంచి తెలుసుకొని వారిని నుంచి విద్యను గ్రహించి మీకు తెలియ తెలియపరుచుతాము.
వచన రూపంలోనూ,ఛాయా చిత్ర పూపం లోను , చలన చిత్ర రూపం (ఆడియో/వీడియో) మీ ముందు వుంచుతుగాం అని “జెస్టుగురు”, ఈ సందర్భం గా మీకు ప్రామిస్ చేస్తున్నది.
మనం ముందుగా ప్లాన్ చేసుకున్న ఈ 14 రోజుల ” కాలకార్యాచరణ” ఐన “ధ్యానం” గురుంచి.
ముందుగా గీత లో ని శ్లోకం —
యక్తాహార విహారస్య , యుక్త చేష్టన్య కర్మణ, యుక్త స్వప్నావ భోధస్య, యోగో భవతి దుఃఖః
మితమైన ఆహారం, తగిన ప్రవర్తన, నిద్ర జాగృతావస్థలు సరియైన స్థితిలో అలవర్చినచో యోగాభ్యాసం కి తగిన అనుకూలత లభించి గలదు. అని పై శ్లోకం తెలియజేస్తుంది.
మనము ఇప్పటివరకు అనేక రోజువారీ కార్యక్రమాలని ఓ అలవాటుగా చేసుకొని వున్నాం కదా!
ఏ పని ఐనా సరే క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉంటే అది అలవాటుగా మారిపోతుంది ! అవును కదా!! మొదలు పెట్టినపుడు కొంత అసౌకర్యముగా తోచినా దృఢ నిచ్చయం, పట్టుదల, సాదించాలి కోరిక, క్రమతప్పని ఆచరణ … జస్ట్ అంతే!
ధ్యానం అనగానే “మనసు” దాని “స్థితి”
మనసు యొక్క “స్థితి” ని “స్థిరం” గా అంటే చంచల స్థితినుండి “స్థిర”త్వా (అచల)నికి తీసుకు రావటమే!
అబ్బా! ఇంత ఈజీనా! అనిపిస్తుంది కదా! అవును అభ్యసిస్తూ పోతూవుంటే! సులువే!
ఇంకొద్దిగా లోపలి కి వెళ్లి తెలుసుకుందాం! అభ్యసించేముందు!!
“యోగః చిత్తవృత్తి నీరోధః” అని పతంజలి మహర్షి తెలియ జేశారు అంటే — “మనసు యొక్క చంచల స్థితిని పోగొట్టి అదుపులో వుంచేదే “ధ్యానం”.
మనసు ఈ స్థితిని పొందటానికి చాలా మంది యోగులు,గురువులు,మనోవిశ్లేషకులు, ఆధ్యాత్మిక వాదులు పలురకాలుగా, తమ తమ అనుభవాలను లోకానికి తెలియజేసారు.
అందులో నుంచి సులభంగా మనకి అనుకూలంగా ఈ 14 రోజుల కాలంలో నేర్చుకోవటానికి తగిన మూడు నాలుగు విధానాలు తెలియచేస్తాము.
అందులొ ఎవరికీ అనుకూలమైన ది వారు ఆచరిస్తూ ఫలితం పొందాలని మా అభిలాష! అభిమతం!!
మన మనసు వుండే నాలుగు స్థితులు — 1 . సహజమైన మేల్కొనే స్థితి (జాగృతావస్థ) 2 . నిద్రావస్థ, 3 . గాఢ నిద్రావస్థ, 4 . పరమానంద స్థితి .
ధ్యాన పద్ధతులు చాలా వున్నవి. ప్రపంచంలో ఆచరణ లో 31 వున్నాయి. అందులొ 18 అందుబాటులో వున్నవి. మరలా వానిలో 8 నుంచి 6 వరకు అందరికి అనుకూలమైనవి.
ఇక “ధ్యాన” పద్దతులలో ఓ మూడు లేక నాలుగు పద్ధతులు గురించి వివరిస్తా.
జెన్ ధ్యానం (జాజెన్ ధ్యానం) : జెన్ ధ్యానం (జాజెన్ ధ్యానం అని కూడా పిలుస్తారు). మొదట మన “గౌతమ బుద్ధుడు” ఈ విధానాన్ని తెలిపారు.
“ధ్యాన్” అనే సంస్కృత పదం ఇది. దీనిని చైనాకు తీసుకువెళ్ళి “చాన్” అని పిలిచారు. తరువాత “ఆగ్నేయాసియా” దేశాలకి వచ్చి అక్కడ “జెన్గా” మారింది.
“ధ్యాన్” అనే పదం ప్రాథమికంగా ధ్యాన స్థితిని వివరిస్తుంది. ప్రాధమికంగా ఈ పద్ధతి లో మంత్రాలూ,పూసల దండలు వినియోగించటం లేవు.
సరైన భంగిమలో ఉండి, శ్వాసను స్థిరపరచడానికి అనుమతించినట్లయితే, మనస్సు సహజంగా ప్రశాంతంగా మరియు “ధ్యాన స్థితికి” మారుతుంది.
సరైన భంగిమ ఏమిటి? మీరు లోటస్ పొజిషన్లో లేదా సూటిగా వెన్నెముకతో కుర్చీలో కూర్చోవచ్చు. (కావాలంటే కుషన్ సీట్ క్రింది / కాళ్ళ క్రింది కూడా ఉపయోగించండి).
చేతులను విశ్వ ముద్ర లో ఉంచుకొని (అంటే ఎడం అర చేతి లో కుడి అర చేయి రెండు బ్రొటనవేళ్లు తాకించే విధంగా) నాభి ముందు పెట్టుకొని శ్వాసను నియంత్రించుచు మనసును శ్వాసపై లగ్నం చేయటం.
అంతే, ప్రత్యేకంగా దేనిపైనా దృష్టి పెట్టకుండా, ఆలోచనలు మొదలైనప్పడు వాటిని తప్పించుకోకవాటానికి తిరిగి శ్వాసపై ద్రుష్టి పెట్టండి.
మీ ఆలోచనలను ఒంటరిగా వదిలేయండి, వాటిని రావడానికి మరియు వెళ్ళడానికి స్వేచ్ఛగా మనసుకి అనుమతినివ్వండి.
ఈ విధం గా ఓ మొదట ఓ 10 లేక 15 నిముషాలు “ధ్యానం” చేసినా మనసు పరి పరివిధాలా పోయి “పరధ్యానం” గా నే ఉంటుంది.
అబ్యాసం తో మనసుని శ్వాస క్రియ పై లగ్నం చేయటం వస్తుంది. అప్పడు ఓ దివ్య అనుభూతి పొందుతారు. ఏంతో ప్రశాంత పొందుతారు.
విపస్సానా ధ్యానం : బౌద్ధ ధ్యానం అనేక రూపాలు గా వుంది. బుద్ధుడు సత్యాన్ని వెతకడానికి శతాబ్దాలుగా వేలాది మందికి స్ఫూర్తినిచ్చాడు.
విపాసనా, బౌద్ధమతంలో మూలాలను కలిగి ఉన్న నిశ్శబ్ద ధ్యానం యొక్క చాలా ప్రత్యేకమైన శైలి.
విపస్సానా గురు పరంపముగా బుద్దిని కాలం నుంచి నేటి వరకు గురువు నుంచి విద్యార్థికి అందిచబడుతూ కొనసాగుతున్నది.
ఈ స్పష్టమైన వారసత్వం కారణంగా, ఇతర రకాల ధ్యానాలతో పోల్చితే “విపస్సానా ధ్యానం” ప్రపంచమంతా ఏంతో ప్రముఖంగా వుంది.
గురువుంచి ప్రత్యక్షముగా ఈ పద్దతిని నేర్చుకోవాలి, ఈ విధానం కేవలం సమాచారం కోసం తెలిపాము.
ఈ విధానం నేర్చుకోవాలని అభిలాషవున్నవారు బుద్దిస్ట్ సెంటర్ లో నమోదు ఐ 10 రోజుల అభ్యసించవల్సి ఉంటుంది. ఐతే ఇవి వాణిజ్య పరంగా బోధించబడవు.
వివరాలకు జెస్టుగురు వెబ్ సైట్ లోని కాంటాక్ట్ లో కల ఈ-మెయిల్ కి మెయిల్ చెయ్యండి.
సులభమైన/అందరికీ అనుకూలమైన ధ్యాన విధానం:
ఈ ప్రక్రియలో మన “ఉశ్వాస- నిశ్వాస” లను గమనిస్తూ దానిపై మనసు కేంద్రీకరించటం. ఆసనం “చాప” పై శుకాసనం లో కానీ పద్మాసనమ్ లో కానీ కూర్చొని (పై చిత్రం లో చూపిన విధంగా ) లేక
కుర్చీలో కూర్చొని కాళ్లు క్రాస్ చేసుకొని, చేతి వెళ్ళలోవేళ్ళు పెట్టుకొని బొటనివేళ్ళను ఆనించుకుని సావధానం గా కళ్ళు మూచుకొని, ఆలోచనలను నిర్బందించకుండా, కట్టడి చేయకుండా మరల మరలా శ్వాసపై మనసు లగ్నం చేస్తూ ,వుండటమే.
మొదట ఓ 5 నుంచి 10 నిముషాలు ప్రయతించి, మరలా మరో 5 నుంచి 10 నిముషాలు
అలా 5 నుంచి 10 రోజులు అభ్యసించిన తరువాత, పట్టుదొరికి, ‘మనసు’ “శ్వాసపై” కేంద్రీకరించబడి “మనశ్వాస” మనకే వినిపించేటంతటి శబ్ద రహిత స్థితి కి లోనవుతాము.
ఇంకా కొన్ని రోజుల తరువాత రెండు కను బొమ్మల మధ్య ఓ మధురమైన నిశ్శబ్ద అనుభూతి అనుభవంలోకి వస్తుంది.
మొదట ఆలోచనలు నియంచలేకపోయినా రోజు క్రమం తప్పకుండా సాధన చేయటం ద్వారా చక్కగా “ధ్యానం” కుదిరి మంచి ఫలితాలు అనుభవం లోకి వాస్తావి.
ధీ + యానం = ధ్యానం
ధీ = సూక్ష్మ శరీరాది సముదాయం (ఆస్ట్రల్ బాడీ కాంప్లెక్స్)
యానం= ప్రయాణం
ధ్యానం అంటే — “సూక్ష్మ శరీరాది సముదాయంలోకి చేసే ప్రయాణం” (ఆస్ట్రల్ ట్రావెల్)
ధ్యానం ప్రతి దినం చెయ్తటం ద్వారా పొందే ఫలితాలు —
1 . శారీరిక ఆరోగ్యం
2 . మానసిక శాంతి /మానసిక ప్రశాంత
3 . బుద్ధి కుశలత
4 . సామాజిక స్ఫూర్తి
5 . ఆర్ధిక సంక్షేమం ( క్రమ శిక్షణ పొందటం వలన )
6 . ఇంద్రియ నిగ్రహణ
7 . వాస్తవ స్థితి గ్రహణ లో వచ్చి నిలకడ గా ఉండటం
8 . ఆధ్యాత్మికత వైపు ప్రయాణం.
ఎన్నో వేల సంవత్సరాల నుంచి కొన్ని వందలమంది గురువులు అనుభవాలు రంగరించి మానవాళి కి అందించిన ఈ యోగ విజ్ఞానం లో ఓ అణువు లో శతకోటి పరమాణు మాత్రమే తెలుసుకున్నాం!
ఈ పదునాలురోజులు ఏప్రిల్ 01 నుంచి ఏప్రిల్ 14 వరకు వున్నా ఈ లాక్ డౌన్ కాలాన్ని వినియోగించుకొని ఈ “ధ్యాన” విధానాన్ని తెలుసుకొని అభ్యసించి ఆనందం గా ఓ కొత్త విద్యను నేర్చికొన్నవారు లేక ఇంతక మునుపు అభ్యసించి వదలి వేసినా వారు తిరిగి
ఈ ప్రక్రియలోకి వస్తారని ఆశిస్థూ…
ఈ “ధ్యాన” జ్ఞానం ఎంతోమంది గురువుల గ్రంధాలనుంచి స్వీకరించాం. వారికి పేరుపేరునా నమస్సుమాంజలి.
మీ ఆలోచనలు,సూచనలు పంచుకోవటం కోసం మరియు సహాయం కొరకు మా వెబ్ సైట్ మెయిల్ …
zestguru108@gmail.com మరియు ఫోన్ : 9490188472 (వాట్సాప్) కి మెసేజ్ ఇవ్వండి.