MAY DAY (అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం)
ప్రపంచమంతా జాతి,మత,వర్గ,కుల,పేద,బీద,ధనిక అనే తేడా లేకుండా జరుపుకొనే ఒకే ఒక్క పండుగ ఈ “మేడే”. దీనిని “అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం” గా జరుపుకొంటారు.
ఈ రోజున ప్రపంచ మంతా ఓ ఎర్రని పూతోట లా వికసిస్తుంది.
ప్రపంచం లోని అగ్రరాజ్యమైన అమెరికా లో 1886 లో జరిగిన “హేమార్కెట్” వద్ద జరిగిన ఓ సంఘటన వ్యవహారాన్ని స్మరించుకుంటూ జరిపే ఉత్సవమే ఈ “అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం”.
అప్పటి, విషయాలు అందరికి తెలిసినవే, కనుక మళ్ళీ వివరించనక్కర లేదు, అయినా ఒక్కసారి క్లుప్తంగా – –
” అమెరికా లో కఠినమైన కార్మిక చట్టాలు, కార్మికుల హక్కుల ఉల్లంఘన, పని పరిస్థితులు మరియు భయంకరమైన పని గంటలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన పోరాటాలు.
ఆ రోజుల్లో 16 గంటల పనిని వ్యతిరేకిస్తూ, పని దినాన్ని 8 గంటలు చెయ్యాలని, అలానే విశ్రాంతి రోజు వుండాలని సమ్మెకి దిగిన కార్మీకులపై పోలీస్ లు జరిపిన కాల్పుల లో ఇద్దరు కార్మికులు చనిపోయారు.
ఈ సంఘటన తరువాత కార్మీకుల పోరాటం తీవ్ర రూపం దాల్చిన పోరాటం అనేక సంవత్సరాలు జరిగి చివరికి 1916 (అంటే సుదీర్ఘమైన 30 సంవత్సరాల తరువాత)లో, దినం లో “పని 8” గంటలు గా మారింది.
భారతదేశంలో, లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్తాన్ ప్రారంభించిన తరువాత 1923 మే 1 నుండి ప్రజలు మే డే ని ఆచరించడం ప్రారంభించారు.
కామ్రేడ్ సింగారావెలర్ సారధ్యంలో ఈ వేడుకలు భారత్ లో ప్రారంభమైనాయి.
కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ “జాతీయ సెలవుదినాన్ని” ప్రభుత్వం అనుమతించాలని పేర్కొని తీర్మానం చేశారు.
అప్పటి నుండి ప్రతి సంవత్సరం “మే డే” వేడుకల్ని జరుపుకొంటున్నారు.
అన్నీ ఆఫీసులలో, ఫ్యాక్టరీలలో మరియు అసంఘటిత రంగాలకు చెందిన కార్మిక,కర్షకకూలీలు, ఇతర శారీర శ్రమతో జీవనం సాగించే అందరూ ఈ మే డే ఉత్సవాలు లో పాల్గొని వీధులన్నీ ఎర్ర జండాలతో నింపి “ఎర్ర జండా” ఎగర వేసి, పాట,ఆటలతో, నాయకుల సందేశాలు, అల్పాహార విందులతో ఆనందిస్తారు.
ఈ భూమి పై జరిగే అతి పెద్ద వేడుక ఈ “మే డే” (అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం).
“ప్రపంచ కార్మీకులారా ఏకంకండి. పోరాడితే పోయేదేమీ లేదు “బానిస” సంకెళ్లు తప్ప”
శ్రమ, మేధో శక్తి తో జీవనం సాగిస్తూ సమాజ సేవ చేస్తున్న “మనుష్యులందరికి” —
“లాల్ సలామ్”.