Lock Down Phase-2 Bonanza

మిత్రులందరికీ నమస్కారం

లాక్ డౌన్ పేస్ -2 లోకి ప్రవేశించాం! మరో పదిహేను రోజులు …ఇంటిపట్టునే!

మనలో చాలామందికి ఇదో గమ్మతు అయిన అనుభవం! అయితే మనలో చాలామంది అత్యవసర ఇంటి పనుల పై బయటకు వెళుతున్నాం! తప్పదు కదా!

అందరం, నోటికి, ముక్కుకి మాస్క్ చేసుకొంటున్నాం! కొందరు కర్చీప్స్, ఇంకొందరు రకాల మాస్కులు. మాస్కులు ఎలాచేయాలి అనే రకాల పద్దతులతో యు ట్యూబ్ నిండా వీడియోస్.

సోషల్ మీడియా పోస్టింగ్స్ లో  గిరిజనులు కొందరు, ఆకులతో చేసుకున్న మాస్కులు కూడా మనం చూసాం!

ఇదంతా ఎందుకు అనుకొంటున్నారా! అసలు, బయటకు రాకపోతే,  ఏ మాస్క్ అక్కరలేదు, హ్యాపీ!!

మరి, తప్పక బయటకు రావలసిన వారు ఎలాంటి మాస్క్ వాడితే ఎలాంటి స్థితి, పరిస్థితి వుంటుందో తెలుసుకొందాం!

సాధరణ స్థితిలో మనము వాడే క్లోత్ మాస్క్ తుమ్మినపుడు,దగ్గినపుడు ఎదుటివారి పై మనం విడుదల చేసిన స్రావాలు పడకుండా ప్రాధమికం గా రక్షితుంది.

అలానే ఎదుటివారినుండి కూడా మనకి అవి చేరకుండా చేయగలవు.

టిష్యూ పేపర్ లేక సాధారణమైన పేపర్స్ తో చేసిన మాస్క్ ఇలాంటి రక్షణ ఇవ్వలేవు.

ఐతే,  మెడికల్ మాగజైన్స్ లో చెప్పిన విధంగా మనం వింటున్న “N 95 మాస్క్” ఉపయోగిస్తే చాలావరకు మంచిది.

డాక్టర్లు, నర్సులు మొదలైన వైద్య సిబ్బంది, పోలీస్వారు, ఇంకా సామాజిక సేవా వృత్తులలో వుండి ప్రజలని అప్రమత్తం చేసున్న వారు “రిస్క్ జోన్” లో వుంటున్నారు కనుక “N95 మాస్క్” ను తప్పనిసరిగా వాడటం శ్రేయస్కరం.

భారత ప్రభుత్వవము ఏ వృతిలో వున్నవారు, ఎలా ఉండాలి. వారు ధరించాల్సిన రక్షణ దుసులు, మాస్కులు, హ్యాండ్ గ్లోవ్స్ మరియు పరికరములు యొక్క గైడ్లైన్స్ ను రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియచేసింది.

ఇప్పడు “N95 మాస్క్” ను గురించి తెలుసుకొందాం. సరిగ్గా అమర్చిన N95 ముసుగు వైరస్ నుండి రక్షిస్తుందా!? అవును, అనే సమాధానం వచ్చింది, ఆరోగ్య నిపుణులైన వారి నుంచి.

ఈ మాస్క్ పేరు ఎలావచ్చింది! అంటే? ఇది 0.3 మైక్రాన్ల కంటే ఎక్కువ” పరిమాణంలో వున్న” 95 శాతం కణాలను” ఫిల్టర్ చేస్తుంది.

ఇది మాములుగా పొగ మరియు పొగ నుండి రక్షించడానికి కూడా ఉపయోగిస్తారు.

ఇవి ప్రొఫెషనల్-గ్రేడ్ మాస్క్‌లు, ఎవరి వారే వాడుకొనాలి, ఒకరు వాడిన వాటిని ఇతరులు వాడ కూడదు మరియు అవికూడా తరచూ మార్చుకోవాలి.

ఇదంతా జస్ట్ సమాచారం కోసమే. చాలామందికి తెలుసు, అయినా మన మిత్రులు అందరికీ తెలియాలని!

లాక్ డౌన్ ఫేజ్- 1 లో ( ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 15 వరకు) మెడిటేషన్ (ధ్యానం ) గురుంచి  తెలుసుకున్నాం కదా!

ఇప్పడు, ఫేజ్-2 లో,  ప్రకృతి ని “తల్లి” గా భావించి 20 సంవత్సరాల పైగా “ఆనారోగ్యాలు” పై అనేక సహజ ప్రక్రియలతో ప్రకృతి ప్రసాదించిన ఆహారాలతోనే అద్భుత ఫలితాలు సాధిస్తూ “సమాజ సేవలో తరిస్తున్న —

డా. రామచంద్ర రావు మరియు డా.(శ్రీమతి)పద్మ గార్ల ” ప్రకృతి ఆశ్రమం, వారి 15 రోజుల “ఆహార నియమం” … ఆ డైట్ ప్లాన్ వివరాలు, ఆ ప్లాన్ వలన కలిగే అమూల్యమైన ఆరోగ్య సంరక్షణ తెలుసుకొందాం!

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి లో వున్న వారి ప్రకృతి ఆశ్రమం “సిద్దార్ధ యోగ విద్యాలయం” 5 ఎకరాల స్థలం లో వుంది (మహా బౌద్ధ స్తూపం ఎదురుగా) పని దినాలు బుధ, గురు మరియు శుక్ర వారం లు  మాత్రమే.

ఫోన్ నెంబర్ : 9966666627 ఫోన్ చేసి ఏ రోజు ఆశ్రమానికి వస్తారో ముందుగా వారికి తెలియచేయటం అవసరం.

ఇప్పటి వరకు ఈ బ్లాగ్ లో ఫోటోలు, చార్టుల ద్వారానే అనేక విషయాలు తెలుసుకున్నాం.

అయితే, డాక్టర్ గారి వీడియో లు చాలా వున్నాయి. వాని లో ముఖ్యంగా మనకి కావాల్సిన ఓ రెండు వీడియోస్ ను అందరి కోసం ఇక్కడ లింక్స్ ఇస్తున్నాను.

దయతో, అందరూ ఆ రెండు వీడియోస్ ను చూసి, విని, తెలుసుకొని, ఆచరించి, అవసరం అనుకొంటే డాక్టర్ గారిని స్వయంగా కల్సి (వారు వీడియోస్ లో చెప్పిన విదముగా) ప్రకృతి ప్రసాదించిన సులభతరమైన ఆహార జీవన విధానాన్ని పాటిద్దాం.

ప్రతి క్షణానికి విలువ కట్టే షరాబులు వున్న నేటి నాగరీక “కమర్షియల్” లోకంలో “రోగం” ఓ పెట్టుబడిగా లక్షల కోట్ల రూపాయలు జేబులు మారుతూ, వున్న”రోగాన్ని మరో రోగం” గా మారుస్తున్న  ఈ “విధానాలని” ప్రశించాల్సిన సమయం వచ్చింది.

ఆలోచించండి … “ఆరోగ్యమే మహా భాగ్యం” అన్న ఆర్యోక్తిని రోజూ గుర్తుకు తెచ్చు కుంటూ  “ఆరోగ్యమే ఆనందం – ఆనందమే ఆరోగ్యం” గా  జీవిద్దాం.

వీడియో లింక్స్:

Leave a Reply

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!