కరోనా-కొరోనా-కోరోనా !? “లాక్ డౌన్”
ఎవరు ఎలాపిలిచినా! ఎలా పలికినా!! …. ప్రపంచ ప్రజలంతా ముక్త కంఠం తో పలుకు తున్న ఓకే ఒక్క పదం – “కరోనా” !!!
అగ్ర రాజ్యాలు నుంచి ఎన్నో అగచాట్లు పడుతున్న బీద బిక్కి దేశాలు కూడా “లాక్ డౌన్” లు ప్రకటించి. తమ ప్రజలను ఈ మహమ్మారినుంచి రక్షించే దిశగా అడుగులువేశాయి.
అవును, అన్ని మూతపడ్డావి. పిల్లలకి నో స్కూల్స్, ఉద్యోగలకు నో వర్క్స్(కొంతమందికి వర్క్ ఫ్రొం హోమ్ అనుకోండి) మొత్తం మీద అన్ని రంగాలకి (మెడికల్/పోలీస్ /మున్సిపల్/పబ్లిక్ శానిటేషన్ /అత్యవసర సర్వీసెస్ మినహా) పని లేదు.
ఇంటిలోని ఆడవారికి వంట పని తప్పదు కదా! పైగా ఇంటిల్లి పాది ఇంటిపట్టునే!!
ఈ 2020 లలో ఇదో వింతే!!!
ఐతే! గ్లోబ్ అంతా నిరంతరం గా పని చేస్తున్నది ఓ ” అంతర్జాలం” మాత్రమే!
చాలు! చాలు !! ఆ ఓక్కటి ఉంటే చాలు!!! … యు ట్యూబ్ , ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్, టెలిగ్రామ్ మరియు పిన్ రెస్ట్.
ఇక మనకు ఎక్కడ “రెస్ట్”!
ఇదంతా అందరి కి తెలిసిన దే! మళ్ళీ నీ సుత్తి ఏందీ “గురు”! అనే కదా
మీ అందరి డౌట్ !
క్షమించండి! ఈ మాత్రం ఉపోద్గాతం ఒలకపోస్తే కానీ “మంచి” విషయాలు బయటకు రావు కదా! .
అందరం ఇంటిపట్టునే ఏప్రిల్ 1 నుంచి 14 వరకు ఉంటాం కదా!
ఇప్పడు మాంచి టైం వచ్చింది … కాదు కాదు దొరికింది … ఈ కరోనా పాపమా/పుణ్యమా అని!
ఈ టైం లో మనము ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే, తట్టింది ఓ మెరుపులా, ఈ పక్షము రోజుల కాలాన్ని “జీవిత కాలనికి” పనికే వచ్చే ” మెడిటేషన్” (ధ్యానం) నేర్చుకొని, ఆచరిద్దాం అని!
ఓకే …ఇక అసలు విషయానికి వద్దాం, ఈ మెడిటేషన్ అనే పదం చాలాకాలం గా వింటున్నాం .
చాలామంది నేర్చుకొని ఆచరిస్తున్నవారు, కొందరు నేర్చుకొని వదిలేసినవారు. ఆసక్తి వున్నా టైం లేక, టైంకి పోలేక ఆగి పోయిన వారు కూడా వుండే వుంటారు. కదా!
ఈ దొరికిన లేక చిక్క కాలాన్ని స్వద్వినియోగం చేసుకొందాం!
అసలు ధ్యానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు, ఎలా అభ్యశించాలి, క్రమం తప్పకుండ ఆచరిస్తే కలిగే లాభాలు, ఫలితాలు, జీవనశైలి ఎలామారి పోతుందో తెలుసుకొందాం!
“యోగ” భూమండలమంతా విన్పించే పేరు.
భారత్ లో పుట్టి ప్రపంచమంతా తిరిగి తిరిగి అనేక కొత్త కొత్త విషయాలని చేర్చుకొన్న పురాతన మైన విద్య.
అనేక మంది గురువులు వారి వారి భాష్యాలతో, కధానాలతో, క్రియలతో, ప్రక్రియలతో అలరారు తున్న విద్య.
ప్రత్యక్షముగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విద్య ” యోగ “
సింధు లోయ నాగరికతలో BCE . ౩౦౦౦ సంవత్సరాల క్రితమే యోగా యొక్క మొదటి రికార్డులు కనుగొనబడ్డాయి. (BCE … బిఫోర్ కామన్ ఎరా/ బిఫోర్ క్రిస్టియన్ ఎరా).
ప్రపంచంలోని అతి పురాతన గ్రంథాలు వేదాలు.
అప్పటి వారు వేద సంస్కృతి మరియు వేద యోగాను ఒక ఆచార జీవన విధానంగా ఆచరించే వారు. BCE . 1200 సంవత్సరాల లో లిఖిత ఆధారాల ప్రకారం తెలుస్తుంది.
క్రీ.పూ. 600 సంవత్సరాల సమయంలో యోగా యొక్క నిర్వచనం ఉద్భవించింది.
ఇది “ఇంద్రియాల నిగ్రహం” అని నిర్వచించబడింది మరియు దాని యొక్క కొన్ని పద్ధతులు ఈ సమయంలో వివరించబడ్డాయి.
క్రీ.పూ. 500 లో భగవద్- గీత స్వరపరిచారు. భగవద్గీత పురాతన యోగా యొక్క ముఖ్య సూత్రాలను వివరిస్తుంది.
చాలా ముఖ్యమైన యోగా గ్రంథాలలో ఒకటి, ఎనిమిది సూత్రాలు ఉన్నాయి. అందులోని ప్రధానమైన బోధనా అంశం-
“మీ కర్తవ్యాన్ని మీరు చేయండి అంతే ప్రతిఫలంగా ఏమీ ఆశించవద్దు”.
క్రీ.శ. 200 సంవత్సరములో ప్రధానమైన ఎనిమిది యోగ సూత్రాలని పతంజలి తెలియజేసారు. ఈ నాటికి ఇవే ముక్యమైనవి గా ఆచరణలో ఉన్నావి.
ఈ ఎనిమిది సూత్రాలు:
1 . యమ: యూనివర్సల్ నైతికత (యూనివర్సల్ మొరాలిటీ )
2 . నియామ: వ్యక్తిగత ఆచారాలు (పర్సనల్ ఆబ్సెర్వన్సెస్)
3 . ఆసనాలు: శరీర భంగిమలు (బాడీ పోస్టురెస్)
4 . ప్రాణాయామ: శ్వాస వ్యాయామాలు మరియు ప్రాణ నియంత్రణ (బ్రీతింగ్ ఎక్సర్సిస్స్ అండ్ కంట్రోల్ అఫ్ ప్రాణ)
5 . ప్రత్యాహార : ఇంద్రియాల నియంత్రణ (కంట్రోల్ అఫ్ ది సెన్సెస్ )
6 . ధారణ : ఏకాగ్రత మరియు అంతర్గత జ్ఞాన అవగాహన పెంపొందించడం
(కాన్సంట్రేషన్ అండ్ కల్టివేటింగ్ ఇన్నర్ పేర్చేప్తుల్ అవేర్నెస్)
7 . ధ్యాన : భక్తి, దైవంపై ధ్యానం (డివోషన్, మెడిటేషన్ ఆన్ ది డివైన్)
8 . సమాధి : దైవంతో ఐక్యత (యూనియన్ విత్ ది డివైన్)
క్రీ.శ. 1100 లో పుట్టిన “హఠ యోగ” ముఖ్య అంశం ఈ రోజున ముందరి పరిచయం వున్న
“మూలచక్రాలు” పుట్టక.
క్రీ.శ. 1400 లో “లైట్ ఆన్ హఠ యోగా” అనే గ్రంధంలో హఠా యోగా “ప్రిన్సిపల్స్” తెలియచేయబడినాయి.
నేటికీ “లైట్ ఆన్ హఠ యోగా” నే “యోగా” పై ముఖ్య గ్రంధం గా వుంది.
ప్రసిద్ధ ఆంగ్ల టైపోగ్రాఫర్ మరియు ఓరియంటలిస్ట్ అయిన చార్లెస్ విల్కిన్స్ భగవద్గీతను 1785 లో ఆంగ్లంలోకి అనువదించాడు.
యోగ ఆదర్శాలు మరియు భారతీయ సంస్కృతి ని ప్రాచ్యాత్తులకి పరిచయమ్ చేసింది – “ఈ అనువాదం”.
1840 లో 121 యోగా భంగిమల చిత్రాలతో కూడిన ఓ పుస్తక రూపొందింది. ఇది చిత్రాలతో విశదపరిచిన తోలి పుస్తకం.
మరో భాగం లో
ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 14 వరకు వున్న ఈ “లాక్ డౌన్” సమయాన్ని వినియోగించు కొంటూ..
యోగా 8 సూత్రాలలో ఒకటైన ” ధ్యానం” అంటే ఏమిటి? ఎన్ని రకాల ధ్యాన క్రియల వున్నవి, తెలుసుకొందాం.