
Tea pot and cups
హలొ మిత్రులారా
అన్ లాక్ పీరియడ్ లో ఇచ్చిన వెసులుపాటు తో జన దైనందినిక జీవనము సాధారణ స్థాయికి చేరుకొన్నట్లే! కరోనా మాట కొంత మరిచి ముందుకు సాగుతున్నారు.
గత ఐదు నెలల నుంచి పాటించిన జాగ్రత్తలు మరువకుండా, కొనసాగిస్తూ జాగరీకులై మెలగటం మరికొంత కాలం ఎంతో అవసరం! వ్యాక్సిన్ వచ్చే దాకా !! మనకి వ్యాక్సిన్ దొరికేదాకా!!!
స్వయం నియంత్రణ, రక్షణ కు ప్రాముఖ్యం ఇవ్వటం ఎంత అవసరమో! తోటివారి కి కూడా అవసరమైన చోట తెలియ జెప్పటం కూడా పౌరునిగా, సంఘజీవిగా ఎంతో అవసరం!!
కరోనా ని కట్టడి చెయ్యటానికి ముక్కు,నోటికి మాస్కులు, చేతికి గ్లోవ్సులూ, , జేబులో శానిటైజేర్, తుమ్ము,దగ్గు వినపడినా “మనసులో” అనుమానం. భౌతిక దూరం పాటిస్తూ “పలాయనమ్”.
ఇప్పడు, కొద్దిగా తగ్గింది ఆ భయం! ఐనా వైరస్ వ్యాప్తి రేట్ ఇంకా తగ్గలేదు కాబట్టి, మనము గతం లో లాగానే నిబంధనలు పాటించటం, జాగ్రత్తగా ఉండటం అవసరం!
ఆహార నిబంధనలు పాటిస్తూ, రోగనిరోధక శక్తిని కూడగట్టుకొని ఎవరికీ వారు శక్తిమంతులు గా “కరోనా” గేమ్ ను ఆడుతూ గెలిచి విజయం సాధించి, నిలవాలి కదా!

Family of Tea cups and pots
ఇప్పడు కొన్ని హెర్బల్ టీ ( కాషాయం అనుకోండి)లు గురుంచి తెలుసుకొని, రోగనిరోధక శక్తి తో పాటు, ఆరోగ్యాన్ని, మానసిక బలాన్ని ఎలా పొందాలో తెలుసుకొందాం!
ఇప్పడు చాలా మంది వెచ్చని నీరు, కాగ పెట్టి చల్లార్చిన నీరు తాగుతున్నారు. ఇది చాలా మంచి అలవాటు!
చల్లని నీరు తాగటం, ఆహ్లాదాన్ని ఇచ్చినా ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది అని ఎందరికి తెలుసు!? మరి ముఖ్యంగా ఫ్రీడ్జ్ లో నీరు!? కూల్ డ్రింకులు!!
కాచి చల్లార్చిన నీరు, గోరు వెచ్చని నీరు అరగంట లో జీవ శక్తిగా మారితే, చల్లని నీరు ఆరు గంటలు పట్టి పీడించి “జీర్ణ” వ్యవస్థని మందగించేలా చేస్తుంది అని ఆయుర్వేద శాస్త్రం నొక్కి వక్కాణించింది. అయినా ఎవరికీ పట్టింది కనుక!?
బిర్యానీ తింటూ కూల్ డ్రింక్, పిజ్జా తింటూ కూల్ డ్రింక్, మంచూరిగా తింటూ కూల్ డ్రింక్, ప్రైడ్ రైస్ తింటూ కూల్ డ్రింక్!
నేడు యువతలో చాలామందికి జీర్ణ కోశ వ్యాధులకు ప్రధాన కారణం! ఈ ఆహారపు అలవాట్లు మరియు నేడు వత్తిడితో కూడిన, వేళా పాళా లేని వారి వృత్తి!

Nature of Job!!!
సరే! వృత్తి అంటే తప్పదు కదా! ప్రపంచమంతా అలా ఉంటే, మనం ఎలా వేరేలా ఉండగలం!
ఐతే, “ఆహారం” మన ఇష్టమే కదా! మార్పులు చేసుకొని “ఆరోగ్యాన్ని” కాపాడుకోవచ్చు కదా!?
డియర్ అల్ యంగ్ అండ్ డైనమిక్ యూత్! దయతో అలోచించండి! ఈ నాడు మన దేశం లో 62 కోట్ల మంది పైగా యువజనులు (15 ఏళ్ళు – 35 ఏళ్ళు) వున్నారు.
వారే, ఈ దేశ సంపద! వారు ఎంత బాగుంటే అంత దేశ సౌభాగ్యం! రక్షణ!! కీర్తి ప్రతిష్ట!!!

Tea Pot
ఇప్పడు ప్రపంచం లో నే స్పెషల్ టీ ల గురుంచి తెలుసుకొందాం!
సాధారణ ఆరోగ్యం తో పాటు సీజనల్ జబ్బులు,వైరస్లు నుండి రక్షణ, అలానే తరుణ, దీర్ఘ కాలిక వ్యాధులనుండి ఉపశమనం కోసం ఉపయోగపడే వాటిని తెలుసుకొందాం.
చెట్టు ఆకులు,మొగ్గలు,పూలు,కాయలు,బెరడు,కాండము మరియు వేళ్ళు ను సేకరించి,శుభ్రపర్చి, భద్రపరిచి ఉంచుకొనవలెను.
అవసరాన్ని పట్టి వీటి కలయకలతో కూడిన వాటిని వినియోగించుకొని లేహ్య రూపం లో కానీ, పొడి రూపంలో కానీ, మాత్రల రూపంలో కానీ, సిరప్ రూపంలోకాని లేక కాషాయం (టీ )గా కాని రోగనిర్దారణ ను పట్టి తీసుకొనవచ్చు.
అనుపానుము గా తేనె, వేడినీరు, నీరు, మజ్జిగ, పెరుగు మరియు నేయి ని వినియోగించెదరు.
ఇప్పడు మనం కొన్ని రకాల హెర్బల్ టీ లను చేయు విధానం తెలుసుకొని, వినియోగించి, ఈ కరోనా టైం లో రోగ నిరోధక శక్తి తో పాటు, జలుబు,దగ్గు,జ్వరం మొదలైన వాటినుంచి ఉపశమనం పొందుదాం.
మొదటగా , ప్రఖ్యాతి కాంచిన “హంజా” టీ! భారత దేశంలో ఉత్తరాది వారికి కొంత పరిచయం వున్నా, దక్షిణ దేశం లో అంతగా పరిచయం లేని “టీ” ఇది!

Hunza Valley
హిందూ కుష్ లోయలో (భారత్ – పాకిస్తాన్ బోర్డర్ లోని హిమాలయాలలో) హన్జా నాగరికత లోని “హంజా ట్రైబల్” ప్రజలు (హన్జాకుటస్) వాడే టీ ఇది!
సర్వరోగ నివారిణి లా పేరు పొందిన “అమృతం ” ఈ టీ! ఎలా చేస్తారో తెలుసుకొందాం!!

Healthy Tea on the Earth
నాలుగు కప్పుల టీ కొరకు: 500 ఎం.ఎల్ నీరు, 5 గ్రాముల దాల్చిన చెక్క, 20 గ్రాముల అల్లం ముక్కలు, 25 గ్రాముల బెల్లం (రంగువేయనది) 12 నుంచి 15 పొదినా (మింట్)ఆకులు, 8 నుంచి 10 తులసి ఆకులు, 4 లేక 5 ఏలకులు (ఇలాచీ).
అన్నిటి నీటిలో వేసి 10 నుంచి 15 నిముషాలు పాటు లో ఫ్లేమ్ లో మరిగించాలి. వడకట్టి దాని లో ఒక రెండు లేక మూడు చెంచాల నిమ్మరసం కలిపి, నెమ్మదిగా సిప్ బై సిప్ త్రాగాలి.
ఈ టీ ని రోజు కి నాలుగు సార్లు త్రాగ వచ్చు. కనీసం ఉదయం సాయంత్రం తప్పకుండా త్రాగి తే, మూడు నాలుగు వారాల్లో మన ఆరోగ్యంలో మార్పు గమనించవచ్చు.
ఈ టీ వలన జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ తో పాటు అధిక కొవ్వు,అధిక బరువు తగ్గుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ వృద్ధి చెందుతుంది.
డయాబెటిక్ ని అదుపులో ఉంచుతుంది. ఆర్థరైటిస్ ని నియంత్రిస్తుంది. రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది.

Golden weather at Himalya valley- Hunza
హిందూ కుష్ లోయలో, అక్కడ వున్న స్వచ్చమైన వాతావరణం తో పాటు ఇంతలా మేలు చేసే ఈ టీ క్రమం తప్పకుండా స్వీకరించటం వలన వారి జీవన ప్రమాణం 120 ఏళ్ళు!!
కొంతమంది 160 ఏళ్ళు వరకూ జీవించినవారు వున్నారు, అని చరిత్ర లో లిఖించి వున్న యదార్థం!!!
ఇంత గొప్ప “టీ” ని పరిచయం చేసాక, మరో టీ గురుంచి ఇప్పడే రాయాలి అనిపించలేదు. ఇంకా చాలా రకాల హెర్బల్ టీలు వున్నాయి. అందులో మనకు తెలిసినవి కూడా చాలా వున్నాయి.

Tea pot and Teddy Bear
ఇప్పటికైతే ఈ “టీ” ని అందరూ క్రమం తప్పకుండా సేవించి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ ….
మీ నుంచి వచ్చిన స్పందన, సలహాలు ను పరిగణలోకి తీసుకొని మరో భాగంలో, ప్రఖ్యాతి గాంచిన “ఆరోగ్య” కరమైన “రుచి”కరమైన “టీ ” లను పరిచయం చేస్తాను.
Excellent