film and Indian film history


హలో ఎలా వున్నారు!?

ఆలస్యమైనది, కొద్దిగా కాదు,  బాగానే ఆలస్యమైనది.. అవును! మనం తలకు మించిన పనులు పెట్టుకుంటాం!!

ఒక్కోసారి, వాటినుంచి బయటపడటం మరలా మనకి ఇష్టమైన పనిలో నిమగ్నమవటం నిజమైన ఆనందాన్నిస్తుంది.

అవునా! ఓకే ఇక మనకిష్టమైన చిత్ర సీమలో కి అడుగు పెడదాం.

మనం గత భాగం లో చెప్పుకున్నట్లుగా మొదట మనం తీసిన చిత్రాలు అన్నీ తక్కువ నిడివి కలిగినవే. అయితే లఘు చిత్రం అనే పేరు ఆనాటికి లేదు!

అప్పటివరకు మానవులకి మనోవిల్లాసం కలిగించే అనేక ప్రక్రియలున్నా! ఏ క్షణం లో ఈ గొప్ప ప్రక్రియ పుట్టిందో కానీ నాటి నుంచి నేటికీ .. అగ్రభాగాన నిలిచిన “వినోదం” … “సినిమా”!    సినిమా అంటే వినోదం!!   వినోదం అంటే సినిమా!!!

కళల పట్టపురాణి “సినిమా” !!!

ఇలా కొనసాగుతూ సామాన్యుడు నుంచి మహోన్నతుల వరకు జాతి,మతం, కులం, ప్రాంతం, బాష, సంస్కృతి, పెద్ద, చిన్నా, ఆడ,మొగ తేడాలు,బేధాలు మరచి, మురిసి  మైమరిపించే ప్రక్రియే  “సినిమా”

ఇప్పడు  “సినిమా”  తీయటానికి కావలసినవి ఏమిటో తెలుసుకొందా!

మొదట నాటి సంగతి!  ఎందుకంటే చరిత్ర తెలిసుంటే

వర్తమానం సులభమవుతుంది… భౌష్యత్ తేజోమంతమైతుంది.

1891 లో కైనెటోస్కోప్ నుండి నేడు చూస్తున మూడవ డైమన్షన్, గ్రాఫిక్స్ వరకు మూకినుంచి టాకీవరకు, మోనో నుంచి స్టీరియో, స్టీరియో నుంచి దొబ్లీ వరకు తెలుసుకొందాం!

అనేక నిచ్చల చిత్రాలను రికార్డు చేసి వరసక్రమములో గుదిగుచ్చి తరువాత వేగవంతమైన ప్రొజెక్షన్ ద్వారా “తెర” పై కదిలికల భ్రమ కలిగించటమే    “సినిమా”

“సినిమాటోగ్రఫీ” 19 వ శతాబ్దపు గొప్ప శాస్త్రీయ ప్రయత్నం.  గొప్ప ప్రక్రియ, ఇది ఏ ఒక్కరో సాధించినది కాదు.

కాలానుగుణంగా అవసరాలును బట్టి తన విస్తృతిని పెంచుకుంటూ ప్రధానమైన “కమ్యూనికేషన్” మాధ్యమంగా మారింది.

1895 డిసెంబర్‌లో పారిస్‌లో లూమియెర్ సోదరులు, డబ్బులు తీసుకొని ప్రదర్శించిన “మొట్టమొదటి” కదిలే చిత్రాల ప్రదర్సన (సినిమా).

ఈ ప్రక్రియ మానవ ప్రపంచం లో  జీవన గమనంలో మహత్తరమైన ఓ భాగం ఔతుందని ఆ రోజున ఊహించి వుండరు. కానీ ప్రమంచమంతా ఈ “సినిమా” వైపే ఆకర్షింబడింది.

మన దేశం లోని పరిశ్రమ లన్నిటిలో “చిత్ర పరిశ్రమ”  నేడు అగ్రగామిగా వున్నది, అగ్రగామిగా వున్న ఈ  పరిశ్రమకు మనదేశంలో ఆద్యులు నిజానికి విదేశీయులు.

 

బొంబాయిలో 1896 లో “లుమిరె బ్రదర్స్”  సినిమా కళ ప్రదర్శించారు.  వారు ఆరు చిన్న చిత్రాలను ఉత్సాహభరిత ప్రేక్షకులకు మొట్టమొదటగా ప్రదర్శించారు.

విజయవంతమైన ఈ ప్రదర్శన, 1897 లో  జేమ్స్ B. స్టీవర్ట్ మరియు టెడ్ హుఘ్స్ ల మరిన్ని చిత్రాల ప్రదర్శన కు దారితీసింది.

అప్పడే ఓ భారతీయడు మొదటి సారిగా ఈ విద్య పట్ల ఆకర్షితుడై, రెండు చిన్న చిత్రాలు తీశారు, ఆయనే  “సేవ్ దాదా”.

కానీ భారతీయ సినిమా తండ్రులు 1913 లో మొట్టమొదటి (మూకీ)  నిశ్శబ్ద చలన చిత్రం “రాజా హారిశ్చంద్ర” తీసిన దాదా సాహెబ్ ఫాల్కే, మరియు 1931 లో భారతదేశం యొక్క మొట్టమొదటి మాట్లాడే చిత్రం “ఆలం అరా” తీసిన అర్దేషిర్ ఇరానీ.

భారతీయ చిత్రాలకు ప్రేరణ ప్రధాన మూలం పౌరాణిక గ్రంథాల నుండి వచ్చింది. హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ భాషల్లో సినిమాలు నిర్మించారు.

భారతదేశం లో వున్న అన్ని ప్రాంతాలలో చిత్రములు నిర్మించారు. ముఖ్యంగా దక్షిణాన మద్రాసు, తూర్పున కలకత్తా మరియు పడమరన బొంబాయి.

1930 లో విజయవంతమైన చిత్రప్రదర్సన లతో భారతదేశం లో ఓ శక్తివంతమైన చలన చిత్ర పరిశ్రమ కు పునాదులు ఏర్పడ్డాయి.

విదేశీయులకు ఓ మహోజ్వల మైన బౌష్య దర్శనం మై బొంబాయి తీరాలకు దిగారు.  వీరిలో ఒకరు మేరీ ఎవాన్స్ అనే యువ ఆస్ట్రేలియా అమ్మాయి. ఆమె “నాడియా” గా ప్రసిద్ధము.

ఆకర్షణీయమైన రూపం , వైవిధ్యమైన నటన, తో పాటు ఫైటింగ్స్ భారతీయ ప్రేక్షకులని మైమరిపించి “ఫియర్లెస్ నాడియా” అని ఆప్యాయంగా పిలుచుకునే వారు. నేటికీ ఆమె పేరు సినీ అభిమానుల హృదయంలో నిలిచి వుంది.

1930 నుంచి 1940 ఓ దశాబ్దం పాటు భారతీయ చిత్రసీమ లో దేవకీ బోస్, చేతన్ ఆనంద్, ఎస్.ఎస్. వాసన్, నితిన్ బోస్ మరియు ఇతరులు వంటి సినీ ప్రముఖలు వెలుగొందారు.

1940 ల చివరి నాటికి భారతదేశంలో ప్రధాన భాషలలో సినిమాలు నిర్మించబడ్డాయి, కాని వీటిపై మతపరమైన ప్రభావం ప్రధానంగా ఉంది.

స్వాత్రంత్య పోరాటాల ఊపులో వున్న కాలంలో చిత్రసీమలో మొత్తం దృష్టాంతంలో మార్పు వచ్చింది. సమకాలీన సామాజిక సమస్యల ఆధారంగా సినిమాలు తీయటం ప్రారంబమైనది.

సినిమా అంటే కేవలం వినోదమే కాదు, చైత్యనవంతులుగా, సమాజ సమరశీలులగా ప్రజలని మార్గదర్సనమ్ చేయగలిగిన సాధనం అని నిరూపించబడింది.

భారతీయ సినిమా చరిత్రలో స్వర్ణ కాలం 1950 – 1960 దశాబ్దం. ఈ కాలంలో గురు దత్, మెహబూబ్ ఖాన్, రాజ్ కపూర్, బలరాజ్ సహాని, నర్గీస్, బిమల్ రాయ్, మీనా కుమారి, మధుబాల, దిలీప్ కుమార్ తెరపైకి వచ్చారు.

దక్షిణ భారతదేశంలో, ఎం.జి. రామచంద్రన్ , రాజ్‌కుమార్, జెమిని గణేషన్, అక్కినేని నాగేశ్వర రావు , ఎన్‌టి రామారావు, ప్రేమ్ నజీర్ (అబ్దుల్ ఖదీర్) వంటి గౌరవప్రదమైన నటులు మరియు అనేక ఇతర నటులు మరియు నటీమణులు ప్రేక్షకులను అలరించారు.

వారితో పాటు, అనేకమంది గాయకులు, స్వరకర్తలు, స్క్రిప్ట్‌రైటర్లు, కెమెరామెన్ మరియు ఇతర సాంకేతిక నిపుణులు కొన్ని అత్యుత్తమ చిత్రాలను రూపొందించడంలో సహాయం చేస్తారు.

బొంబాయి చిత్రసీమలో గురు దత్ మరియు బిమల్ రాయ్ యొక్క సినీ మాయాజాలం ప్రధానంగా నిలవగా, 1960 లో కె. ఆసిఫ్ యొక్క ‘మొఘల్-ఎ-అజామ్’ విడుదలతో భారతీయ సినిమా ఒక అడుగు ముందుకు వేసింది.

శృంగార చిత్రాల బాట భారతదేశం అంతటా అనుసరించింది.

సినీ ప్రేక్షకుల మధ్య భారతీయ “వాణిజ్య” సినిమా ప్రజాదరణ పొందినంతగా, భారతీయ “ఆర్ట్” సినిమా గుర్తించబడలేదు.

అడూర్ గోపాలకృష్ణన్, రిత్విక్ ఘటక్, అరవిందన్, సత్యజిత్ రే, షాజీ కరుణ్మ, గౌతమ్ గోష్, శామ్ బెనెగల్,మృణాల్ సేన్  వంటి పలువురు ఆర్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు భారతీయ చిత్రాన్ని అంతర్జాతీయానికి తీసుకెళ్లే సినిమాలు నిర్మించారు .

1970 ల నాటికి భారతీయ సినిమా సూపర్ స్టార్స్ రాజేష్ ఖన్నా, సంజీవ్ కుమార్, వహీదా రెహ్మాన్, ఆశా పరేఖ్, తనూజా మరియు ఇతరుల చరిత్రను ఆస్వాదించింది.

రమేష్ సిప్పీ యొక్క ‘షోలే’ ఒక “ఐకానోక్లాస్ట్” అని నిరూపించబడి, భారతీయ సినిమాకు ఓ కొత్త సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని అందించింది.

‘షోలే’ …. భారతీయ చిత్ర చరితలో ఓ “బెంచ్మార్క్”! .. ఓ స్వర్ణ అక్షర లిఖితం!! ఎప్పటీకి
అందుకోలేని ఓ ఉన్నత సౌధం!!!

ఒక వైపు హిందీ సినిమా చాలా వేగంగా పెరిగింది , మరోవైపు ప్రాంతీయ సినిమాలు తమ ఉనికిని కూడా చాటాయి.

1980 లలో అపర్ణ సేన్, ప్రేమా కర్నాథ్, మీరా నాయర్ మరియు విజయనిర్మల వంటి పలువురు మహిళా దర్శకుల పెరుగుదల కనిపించింది. ‘ఉమ్రావు జాన్’ చిత్రంలో రేఖ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకర్షించిన సంవత్సరం కాదా ఇదే.

మలయాళం, కన్నడ, తెలుగు, బెంగాలీ వంటి ప్రాంతీయ చిత్రాలు అనేక శృంగార కధా చిత్రాలను నిర్మించాయి. బాలచందర్, ఐ.వి. శశి, బాలు మహేంద్ర, మణిరత్నం, కాశీనాధుని విశ్వనాధ్, రామ్ గోపాల్ వర్మ తదితరులు తమ తమ “మార్కు” ల తో అలరించారు.

 

camera

1990 నుండి ఇండియన్ సినిమా మోడరన్ టెక్నాలజీతో నూతన ప్రక్రియలకు శ్రీకారం
చుట్టింది.

ఇది మరో భాగం లో ….

Leave a Reply

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!