హలొ మిత్రులారా
నేడు ప్రపంచం లో వున్న “ఆరోగ్య” పరిస్థితులు చూస్తుంటే బుర్రంతా వేడెక్కి పోతుంది కదా!
ఊహించని రీతిలో “కోవిద్-19 ” తీరు తెన్నులతో గత 19 వారాలుగా, ఎన్నో విన్నాం! కన్నాం!! కలవర పడ్డాం !!!
వేల కిలో మీటర్లు దూరం లో వున్న”కరోనా” సుడులు తిరుగుతూ ఖండాలు దాటుకుంటూ దేశాలను చుట్టుముట్టి ఈ 6 నెలల కనిపించే దూరంలో మన వీధిలో కి చొరబడింది.
కరోనా కి బయపడకుండా తగిన జాగ్రత్తలతో కర్తవ్యం నిర్వహిస్తున్న పోలీస్, మెడికల్, మున్సిపల్ శాఖ పారిశుద్ధ్య సిబ్బందికి శతకోటి ప్రణామములు.
ప్రభుత్వాలు ఎంతో జాగ్రత్తలు తీసుకొన్నా వ్యాధి నెమ్మదిగా చుట్టుముట్టి బాధితుల్ని వందల సంఖ్య నుంచి వేల సంఖ్య కు తీసుకు వెళ్ళింది.
మరణాలు రేటు తక్కువగా వున్నా వ్యాధినుంచి కోలుకున్నవారు, ఇంటి దగ్గర కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
కోలుకున్నవారు బలమైన ఆహారం తీసుకోవటం ఎంతో అవసరం. అలానే ఇలాంటి సమయం లో ఇంటిల్లి పాది కూడా బలమైన పౌష్ఠిక ఆహారం తీసుకోవటం ఎంతో అవసరం.
పిల్లను దగ్గర నుంచి వయసు మళ్ళిన వారిఅందరికి పనికే వచ్చే ఒక మధురమైన “హై ప్రోటీన్ పౌడర్ని” ఇంటిలోనే తయారు చేసుకొని కనీసం నెల రోజులు క్రమం తప్పకుండా వినియోగించాలి.

CASHEW

PEANUT

ALMOND
ఇలా చేసి “ఆర్యోగ్యం” పొంది , శక్తి పుంజు కొని “నీరసం” అనే మాటను “జల్దీ” లో కలిపి, హాయిగా హుషారుగా “ఆనందంగా” జీవించాలి అని కోరుకుంటూ, ఆ పొడిని చేయటానికి కావాల్సినవి, తెలుసుకొందాం.
1 . జీడీ పప్పు -50 గ్రాములు 2 . బాదం – 50 గ్రాములు 3 . పిస్తా పప్పు – 25 గ్రాములు 4 . యాలకలు -10 గ్రాములు 5 . వేరుశనగ గుండ్లు – 50 గ్రాములు, 6 .చియా సీడ్స్ – 50 గ్రాములు 7 . గుమ్మడి గింజలు – 50 గ్రాములు
8 . సన్ ఫ్లవర్ సీడ్స్ – 50 గ్రాములు 9 . మిల్క్ పౌడర్ – 50 గ్రాములు 10 . కలకండ
(మిస్రీ/పటికబెల్లం – 50 గ్రాములు .

SUNFLOWER

PUMPKIN SEEDS

CHIASEED
ముందుగా జీడీ పప్పు, బాదం, పిస్తా, వేరుశనగ గుండ్లు,చియా సీడ్స్, గుమ్మడి గింజలు,సన్ ఫ్లవర్ సీడ్స్ ని విడివిడిగా అతి తక్కువ మంటపై, అడుగు ముందుగా వున్న మూకుడు/తావా/బాండీ లో జాగ్రత్తగా మాడకుండా వేపుకోవాలి.
అన్నీ చల్లారిన దాకా ప్రక్కన పెట్టుకోవాలి.
కలకండ ను చిన్న చిన్న పలుకులు గా చేసుకొని, యాలకలు కలిపి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
తరువాత వేయించి చల్లార్చిన జీడీ,బాదం, పిస్తా, వేరుశనగ గుండ్లు,చియా సీడ్స్, గుమ్మడి గింజలు,సన్ ఫ్లవర్ సీడ్స్ ని అన్నిటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసి, జల్లెడ పట్టి మరలా గ్రైండ్ చేసి మొత్తం పొడి మెత్తగా అయ్యేలా చూసుకోవాలి.
ఈ పొడి లో కలకండ ,యాలుకల పొడిని వేసి కలిపి దానిలో మిల్క్ పౌడర్ ని కూడా వేసి మొత్తం బాగా కలిపి గాలి చొరవని డబ్బా/సీసా లో ఉంచుకోవాలి,
ఈ పొడిని రోజూ అల్పాహారం తీసుకొన్న తరువాత బాగా మరిగించిన ఒక కప్పు వేడి నీటిలో సుమారు 20 గ్రాములు వేసి బాగా కలిపి సేవించాలి.
మరలా సాయంత్రం 4 , 5 గంటల ప్రాంతం లో పై విధంగానే చేసుకొని సేవించాలి.
క్రమం తప్పకుండ అర్ధ మండలం (20 రోజులు) సేవించి ఒక వారం ఆపి మరలా అర్ధ మండలం (20 రోజులు ) సేవించాలి.
అపరాలు తో పొడిని తయారు చేసి “అన్నంలో కలుపుకొనే ” రుచికరమైన పొడిని, అలానే
ఆకులతో చేసే మరో రకమైన కారపు పొడిని గురుంచి తెలుసుకొందా.

LOVE U ALL
మిత్రులారా!
మీరు ఈ ఆర్టికల్ ని చదివిన తరువాత మీ అభిప్రాయాలను,సలహాలను,సందేహాలును తెలియ జేస్తారని ఆశిస్తూ….
ఆహారం తో ఆరోగ్యం పొంది ఆనందంగా జీవిస్తూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత,కుటుంబ,సమాజ,దేశ సేవలో తరించాలని అభిలాష తో….