
DIGITAL MARKETING
డిజిటల్!- డిజిటల్ మార్కెటింగ్!!- సోషల్ మీడియా!!!
రాబోయే కాలమంతా డిజిటల్ మార్కెటింగ్ రంగానిదేనా !?
గతం లో, తయారు చేసిన ఉత్పత్తుల విషయం,వినియోగం, ప్రయాజనం గురుంచి వినియోగ దారులకి తెలిసేలా గోడల మీద వ్రాత రూపం లోనో,కరపత్రాల రూపం లోనో, సినిమాల్లో స్లైడ్స్ రూపంలోనో ప్రకటించే వారు.
రేడియో లో వాణిజ్య ప్రకటనలకు కొన్ని షార్ట్ వేవ్, మీడియం వేవ్ బ్యాండ్స్ కూడా వచ్చాయి.
న్యూస్ పేపర్స్ కి పాఠకులు పెరగటం తో న్యూస్ పేపర్స్ లో ప్రకటనలు గుప్పించారు. ఇప్పటికీ ఇది కొనసాగుతున్నది.
తరువాత, ఎలెక్ట్రానిక్ మీడియా, టెలివిషన్ రంగం విస్తృతం గా పెరగటంతో, వాణిజ్య ప్రకటనలు ఊపందుకొని, ప్రపంచ వ్యాప్తం గా “అగ్రస్థానాన్ని” పొందింది.
తరువాత వచ్చిన ఈ-మెయిల్, యాహు , పేస్ బుక్, గూగుల్, యు ట్యూబ్. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లు ప్రజాదరన పొంది, వాటిలో కోట్లాదిమంది ఖాతాలు తెరిచి వినియోగించటం తో, ప్రకటనలు మొదలైనాయి.
ఓ సారి ప్రపంచ వ్యాప్తం గా వున్న ఈ ప్లాట్ ఫార్మ్స్ లో వున్న subscribers (చందాదారులు) యొక్క లెక్కలు చూద్దాం..
* పేస్ బుక్ 2 .6 బిలియన్ ఆక్టివ్ యూసర్స్ వున్నారు. (ఏప్రిల్ 30 ,2020 నాటికి)
** యు ట్యూబ్ 2 బిలియన్ యూజర్స్, ఇంటర్నెట్ వాడే వాళ్లలో 79 శాతం మంది యు ట్యూబ్ లో అకౌంట్ కలిగివున్నారు.
*** వాట్సాప్ వినియోగదారులు 2 బిలియన్
**** ట్విట్టర్ వినియోగదారులు 330 మిలియన్
***** ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు 26 .9 మిలియన్
ప్రస్తుతానికి యు ట్యూబ్ ప్రకటనలు అత్యంత ప్రభావవంతమైనది గా మార్కెట్ర్స్ అభిపాయ పడుతున్నారు. ఇది నిజం కూడా!
ఇక వెబ్సైట్,బ్లాగ్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లు,ఈ-మెయిల్స్,లింక్డిన్లు,పినెరెస్టులు, టెలిగ్రామ్ ఇలా అనేకమైన రకరకాల అంతర్జాల మాధ్యమాలు వెల్లువ నేడు అడుగడుగునా కన్పిస్తుంది.
ప్రపంచమంతా ఇంటర్నెట్ (అంతర్జాలం) చౌక గా అందరికి అందుబాటులోకి వచ్చింది.
స్మార్ట్ ఫోన్స్ కొనే వెసులుబాటు. సులువుగా నేర్చుకొని, వాడుకొనే విధానం అందులోనే మ్యూజిక్,రేడియో,కెమెరా,వాచ్,టార్చ్ ఇలా అనేకమైన వాటిని పొందుపరచుకొని…. “శరీరంలో ఓ ముఖ్య భాగమై – ఆరో ఇంద్రియం గా మారింది”.
ప్రపంచం లో ఇప్పడు 24 గంటలు,365 రోజులు నడిచే మీడియా “సోషల్ మీడియా”
ఈ సోషల్ మీడియా ప్రభావం ఎంతగానో ప్రత్యక్షము గా, పరోక్షంగా వారివారి అభిప్రాయాలు పంచుకుంటూ వుండటం వలన ఎంతో విలువైన సమాచారం ఉచితంగా అందరికి అందుబాటు లోకి వచ్చింది.
మనకి అందుబాటులో వున్న ఈ సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ వినియోగం లోని సౌకర్యాలు, ఆన్ లైన్స్ లో దొరుకుతున్న సేవలలు, మార్కెటింగ్ విషయాలు తెలుసుకొందాం. నేర్చుకొందాం.
చిన్న, చిన్న వ్యాపార నిర్వహణ కూడా ఈ రంగాలని వినియోగించుకుంటూ వియోగదారులకి ఎలా చేరువకావాలో తెలుసుకొందాం.