
CURRY LEAVES
హలో మిత్రులారా
నెమ్మదిగా కోవిడ్ మాటను మరిచి జనజీవన కార్యక్రమాల్లో పడ్డాం! ఇంకా కొన్ని నిబంధనలు వున్నా! నెమ్మదిగా అలవాటు పడుతున్నాం!
ముక్కు నోటికి మాస్కు, చేతులకి తొడుగులు జేబులో శానిటైజర్!
తల్లిదండ్రులు,గురువులు నేర్పిన క్రమశిక్షణ కన్నా “కరోనా” నేర్పింది ఎక్కువ కాదా !అనిపిస్తుంది!! ప్రాణ భయం కన్నా పెద్దది ఏముంటుంది కనుక!!! మనిషికి???
ఆహారం తో రోగ నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలి!? ఇది సాధారణమైనదే ఐనా! ప్రస్తత పరిస్థితులు లో “ఎక్కువ”గా వినిపిస్తున్న మాట!!
అంటు రోగాలని! పంగల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా! వైరస్లు బారిన పడకుండా రోగ రహితులుగా! ఆరోగ్యం గా ఎలా ఉండాలో ప్రకృతి పాఠాలు నేర్పినా వాటిని పెడచెవిని పెట్టి “కరివేపాకు” లా తీసి వేస్తున్నాం కదా!
అలాంటి వాటి లో ఒకటైన “కరివేపాకు” గురుంచి తెలుసుకొందాం!!
ఒక్క! తీపి (స్వీట్లు) లో తప్ప అన్నిటిలో ఇట్టే కలసిపోయి ఓ పరిమళాన్ని, రుచిని కలుగజేసి! పదార్థం ఆరగించే టప్పడు తీసి పక్కన పెట్టె “కరివేపాకు” పై చాలా రకాల జోకులు, సామెతలు వున్నాయి. అందరికి తెలిసినవే కదా!
వేపాకు ను పోలి వుండే ఈ కరివేపాకు, దాదాపు ప్రపంచమంతా వుంది. దీని పుట్టిల్లు మన “భారత దేశమే”!
మన ఉపఖండం లో వున్న శ్రీలంక, బంగ్లాదేశ్,పాకిస్తాన్ మరియు చైనాలో లో సాగు చేస్తారు.
మన దేశం నుంచే ప్రపంచానికి తెలియ వచ్చిన ఈ “కర్రీ లీవ్స్” ఆఫ్రికాకు,మలేసియాకు అస్రేలియాకు, సౌత్ అమెరికా కు వలస వెళ్ళింది.

KADI PATTA (curry leaves)
ఈ కరివేపాకు ప్రస్తావన పురాతన తమిళ సాహిత్య గ్రంధాలలో ప్రస్తావించబడింది.
కూర కు రుచిని, సువాసను కలుగ జేసే ఆకు అని, వేపాకును పోలి వుండి కూరలలో వినియోగిస్తున్నారు కనుక “కూర వేపాకు” గా పిలువబడి కాల క్రమేణా “కరివేపాకు” గా మారింది అని ఓ బాషా సాహిత్య నానుడి!
గ్రామాల్లో దాదాపు ప్రతి ఇంటి పెరడు లో వుండే “పెరటి” చెట్టు కరివేపాకు!
ప్రకృతి వైద్యలు చెప్పిన ప్రకారం. మునగ ఆకు,కరివేపాకు తరుచుగా ఆహారంలో తీసుకొంటూ ఉంటే ” ఆరోగ్యంతో పాటు, శక్తి కల్గి యౌవన వంతులుగా వుంటారు!
ఇప్పడు ఈ కరివేపాకులో ఏమి దాగున్నాయో తెలుసుకొందాం!
కరివేపాకు లో హెచ్చు మొత్తంలో “యాంటీఆక్సిడెంట్లు” కలివి వున్నాయి.
ఈ ఆకుల్లో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫాట్ తో పాటు, మెగ్నీషియం, జింక్,ఐరన్, కాపర్,క్రోమియం, థియామిన్, రిబోఫ్లోవిన్, ఫోలిక్ ఆసిడ్ లతో పాటూ విటమిన్ సి మరియు ఫ్లవనాయిడ్స్ కలవు.
శరీరము లో వున్న దాదాపు ప్రతి భాగానికి “కరివేపాకు” ఉపయోగం వుంది. ముఖ్యంగా చర్మం, కళ్ళు,గుండె, లీవర్, స్టమక్, పెద్ద ప్రేవులు, రక్తహీనత మరియు తల వెంట్రుకల సంరక్షణ లలో.
కరివేపాకును అన్ని కూరల్లో వినియోగించవచ్చు!
అలానే అన్ని చెట్నీలు,రోటి పచ్చళ్ళు,కారపు పొడులు, ఉప్మాలు , కిచిడిలు పిండి వంటలు లలో కూడా కలుపుకొని రుచిని,సువాసనను పొందవచ్చు.

curry leaf juice
ఇలా ప్రధాన ఆహారాల్లో కాకుండా విడిగా కూడా కూడా తీసుకొని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అవి ఎలానో తెలుసుకొందాం.
ఒక 10 నుంచి 12 కరివేపాకులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసు కొని ఒక గ్లాజు గ్లాసులో కానీ పింగాణీ కప్పులో కానీ వేసి, దానిలో 200 ఎం ఎల్ మంచి నీరు పోసి, రాత్రి అంతా అలా ఉంచి ఉదయాన్నే, ఒక చెంచా తేనెను కలిపి ఆకులను నమిలి నీరు తాగాలి.
ఇలా ఓ మండలం (40 రోజులు) పాటు క్రమము తప్పకుండా పాటిస్తే రక్త హీనత తగ్గి, చర్మం తేజో వంతముగా మారుతుంది. జుట్టు రాలటం తగ్గుతుంది. కళ్లమంటలు తగ్గుతాయి.
ఈ గుణాలు అవగతమైతే, ఒక వారం విరమించి మరల ఈ ప్రక్రియను ప్రారంభించి మంచి ఫలితాలను పొందవచ్చు అని ప్రకృతి వైద్య విధానములో తెలుపబడినది.
ఇలాకాకుండా ఉదయం టీ రూపం లో కూడా తీసుకొన వచ్చు. ఓ 6 నుంచి 8 ఆకులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా త్రుంచి 250 ఎం ఎల్ నీటిలో వేసి, లో ఫ్లేమ్ మరిగించి వడకట్టి, కొద్దిగా నిమ్మరసం, ఒక చెంచా తేనె ను కలిపి తీసుకొనాలి.
అద్భుతమైన ఆకుల రసాలు! రోగాల్ని పారద్రోలే ప్రకృతి అస్త్రాలు!! ఆరోగ్యనిధికి ఆలయాలు !!!

curry leaves + spinach
ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు పాలకూర తీసుకొని బాగా శుభ్ర పరిచి నీరు పోసి గ్రైండ్ చేసి, రసం వడకట్టు కొని కొద్దిగా నిమ్మరసం కొద్దిగా తేనె కలుపుకొని నెమ్మదిగా సిప్ బై సిప్ త్రాగాలి.
పై విధముగానే పాలకూర బదులు మునగ ఆకును తీసుకొని రసం చేసుకొనవచ్చు.
రోజూ ఉదయం అల్పాహారం (టిఫిన్) తీసుకొనటానికి అరగంట ముందు ఈ జ్యూస్ ను తీసుకొనటం ఉత్తమం.
అలానే ఈ రసం తీసుకొనే అరగంట ముందు రెండు గ్లాసెస్ మంచి నీరు తీసుకొంటే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు.
కరివేపాకు తో చర్మరక్షణ ఎలా పొందవచ్చో చూద్దాం! కరివేపాకులో ఆరోగ్యకరమైన తేమ శాతం ఎక్కువే!

Beauty tip with curry leaves
ఒక రెండు గుప్పెళ్ళ కరివేపాకును తీసుకొని శుభ్రపరిచి, మెత్తగా గ్రైండ్ చేసి, దానిలో రెండు చెంచాల పసుపు, రెండు చెంచాల తేన ను బాగా కలిపి ముఖము పై (కళ్ళలో పడకుండా) లేపనం చేసి ఓ అరగంట ఆరనిచ్చి, చన్నీటితో కడిగి మెత్తని టవల్ తో సున్నితంగా తుడుచుకోవాలి.
ఇలా రోజు మార్చి రోజు చేస్తూ ఉంటే ఓకే నెలల రోజులకో ముఖం పై వున్న రాషెష్, చిన్న చిన్న గుల్లలు, బ్లాక్ హెడ్స్ , వైట్ హెడ్స్ పోయి కాంతి వంతముగా చక్కని ఆరోగ్యవంతంగా కనపడుతుంది.
ఇలా క్రమం తప్పకుండా వినియోగిస్తూ ఉంటే ముఖం పై ముడతలు కూడా తగ్గుతాయి.

Baby after head bath
కరివేపాకును వుపయోగించి కేశాలకి ఓ మంచి టానిక్, ఒక వందగ్రాముల కరివేపాకును, ఓ 25 గ్రాముల మెంతులు, కొబ్బరి నూనె (తలకి వ్రాసుకోవటానికి).
మెంతులను శుభ్రపరిచి నానపెట్టుకోవాలి నానిన తరువాత గ్రైండ్ చెయ్యాలి. కరివేపాకును శుభ్రపరిచి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. ఈ గ్రైండ్ చేసిన వాటిని బాగా కలిపి ఓ అరగంట పక్కన ఉంచుకోవాలి.
కొబ్బరి నూనెను కొద్దిగా వేడిచేసి బాగా వెంట్రుకల కుదుళ్ళకి పట్టించాలి. ఓ అరగంట తరువాత కరివేపాకు,మెంతులు మిశ్రమాన్ని బాగా తలపై వెంట్రుకల కుదుళ్ళకి పట్టేలా రాసుకోవాలి.
ఒక గంటనుంచి రెండు గంటలు ఆరనిచ్చి (ఫ్యాన్ క్రింద కూర్చోవద్దు) తరువాత శుభ్రంగా తలా స్నానం చెయ్యాలి. (గాడమైన షాంపూలు వాడ వద్దు).
ఈ విధంగా పది పదిహేను రోజులకు ఒక సారి చేసే కుదుళ్ళు గట్టి పడి వెంట్రుకలకి మంచి పోషణ దొరుకుతుంది. ఆరోగ్యవంతమైన కేశాలు మీ స్వంతం అవుతాయి.

“H” for health
Pretty researched article. This piece is very helpful for people who like to be healthy spending almost nil cash. Very nice, keep it up with such good articles on health.