CORONAVIRUS DISEASE 2019 (COVID-19)

covid

COVID-19 WORLD

CORONAVIRUS DISEASE 2019 (COVID-19)

కరోనావైరస్ వ్యాధి 2019 (COVID-19) అనేది SARS-CoV-2, వలన కలిగే ఒక అంటు వ్యాధి.

ఇది SARS (Severe acute respiratory syndrome) వైరస్‌కు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది.

ఇది గాలి ద్వారా ఒక వ్యక్తి నుండి ఇతరులకు, ముఖ్యంగా తుమ్ము,దగ్గు లనుండి శ్వాస బిందువుల ద్వారా వెళుతుంది.

అలానే స్పర్శ ద్వారా, చేతులు తాకటం, శుభ్రంగా లేని దుస్తులు, వస్తువులు, పబ్లిక్ టాయిలెట్స్, వుమ్మడి ప్రజా సౌకర్యాలు కలిగిన ప్రదేశాలు.

వ్యాధి లక్షణాలు ప్రారంభమయ్యే సమయం సాధారణంగా 2 నుండి 14 రోజుల మధ్య ఉంటుంది. ఐతే సగటున 5 రోజులు లో చాలా కేసుల్లో వ్యాధి లక్షణాలు కనిపించావి.

జ్వరం,జలుబు,దగ్గు మరియు శ్వాససంబంధమైన ఇబ్బందులు తో ఏదైనా ఒక్క లక్షణం తో కానీ రెండుమూడు లక్షణాలతో కొద్దిన ఇబ్బందులు కన్పిస్తాయి.

వ్యాధి లక్షణాలు రెండు రోజులు తరువాత తీవ్రత పెరిగి న్యూమోనియా లక్షణాలు తో కూడిన బాధలు కొన్ని కేసుల్లో బహుళ అవయవ వైఫల్యానికి దారితీసున్నది.

CORONA

CORONA

వ్యాధి కనిపించిన వారి నిర్వహణలో లక్షణాల చికిత్ససహాయక సంరక్షణ మరియు ప్రయోగాత్మక చర్యలు ఉంటాయి కానీ వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదు.

కరోనా లక్షణాలు కనిపించి, వ్యాధి కనిపించిన 3 నుంచి 7 రోజుల్లో, మరియు కొన్ని కేసుల్లో 14 రోజుల్లో మరణం సంభవించే అవకాశలు వున్నా మరణ శాతం రేటు 1% మరియు 3% మధ్య వుంది.

ఇది ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది! ఈ వైరస్ ప్రభావం యొక్క ‘విన్యాసాలు’ రకరకాలుగా చూపటం వలన!!

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మరియు యు.ఎస్. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) వారు చూపిన మార్గదర్శకాలు ప్రకారం వైరస్ సోకిందని అనుమానం వచ్చిన వారిని ముఖాన్ని కప్పివుంచే వైద్య మాస్క్ ని ధరింప చేసి వైద్యాలయం కి తీసుకు రాకుండా ప్రత్యక రక్షణ పరికరాలతో రోగి దగ్గరకీ డాక్టర్స్ ని పంపాలని కోరింది.

అలాగే పబ్లిక్ ప్లేసెస్ లో తిరిగే వారు, వ్యాధి సోకె అనుమాన ప్రాంతాలలో తిరుగాడేవారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బిజినెస్ ప్లేసెస్, స్కూల్స్, కార్యాలయాలు లోని వారందరు ప్రత్యేకమైన మాస్క్ ముక్కు,నోరు ని కప్పివుంచేలా ధరించాలని, చేతులకి కూడా తొడుగులు ధరించి
వాటిని తరుచు మార్చాలని చూసించారు.

కరోనావైరస్ వ్యాప్తి ని “పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్” (PHEIC) గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

2020 ఫిబ్రవరి 29 నాటికి, చైనా, హాంకాంగ్, ఇరాన్, ఇటలీ, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా మరియు యునైటెడ్ స్టేట్స్ కరోనా వైరస్ కలిగిన దేశాలు గా గుర్తించింది.

వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలు పటిష్టంగా అమలు పరిచేలా WHO మార్గదర్శ కాలను ప్రకటించి పూర్తి కార్యాచరణలో కి దిగింది.

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకి విస్తరించింది అని బావిస్తున్నా, WHO లెక్కల ప్రకారం60 దేశాల్లో కరోనా విస్తరించివుందని ప్రకటించింది.

ఐతే, ఈ వైరస్ సోకి మృతులైన వారు 10 దేశాల్లో నే వున్నారని, ప్రపంచ వ్యాప్తం గా 3685 మృతి చెందగా, ఒక్క చైనా రాష్ట్రము “హుబెయ్” లోనే 90 శాతంఉన్నట్లు తెలిసింది.

కరోనా కూడా మొట్టమొదిటిగా ఈ “హుబెయ్” రాష్టంలోని గుర్తించటం విశేషం.

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తం గా సుమారు 96 వేల కేసులు నమోదయ్యాయి.

కరోనా వైరస్ ప్రభావం ముఖ్యంగా ఆసియా, ఐరోపా ఖండాల దేశాల్లో తీవ్రంగా ఉన్నట్లు నమోదుఐయ్యింది.

ఇటలీ లో వైరస్ సోకిన కేసులు కొద్దిగంటల్లో నే రెట్టింపినట్లు ఇటలీ ఆరోగ్యశాఖ ప్రకటించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. సుమారు 1700 మందికి వైరస్ సోకిన కేసులు నమోదులు కాగా సుమారు 34 మంది మృత్యువాతపడ్డారు.

బ్రిటన్ లో కూడా కరోనా వైరస్ సోకినట్లు కేసులు కపించాయని బ్రిటన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ కరోనా వైరస్ సులభతరంగా వ్యాపించే అంటువ్యాధి కావటం తో ప్రపంచ లోని అనేక ఉత్పత్తికి రంగాలపై దీని ప్రభావం చూపింది.

ముందు జాగ్రత్తగా అనేక దేశాలలో కంపినీలు ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం మూసివేశాయి.

ప్రపంచ అగ్ర రాజ్యాలు మరియు సంపన్న దేశాలైన అమెరికా, జెర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్,ఇటలీ,కెనడా మరియు జపాన్ లు సమష్టిగా ఈ కరోనా మహమ్మారిని రూపుమాపాలనినిర్ణయించాయి.

ఈ దేశాలకి చెందిన ఆర్ధిక మంత్రిత్వ శాఖల ఎమర్జెన్సీ దూరవాణీ సంభాషణ లో కరోనాప్రపంచ ఆర్ధిక,సామాజిక, రవాణా, వ్యాపార, హోటల్, టూరిజం రంగాలపై తీవ్ర నష్టంకలుగ జేసింది.

ఈ ప్రభావం తో ఆర్ధిక రంగం కుదేలై ప్రపంచ “స్టాక్ మర్కెట్స్” తీవ్ర నష్టాల్లికి కారణమైనది. 
stock market

World stock index

ప్రపంచ ఆరిక వృద్ధి రేటు 2009 నాటి కనిష్ట స్థాయికి దిగజారిందని, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD ) ప్రకటించింది.

ఇక మన దేశం లో కూడా కరోనా ముఖ్యంగా స్టాక్ మర్కెట్స్ పతనానికి కారణమైయింది.

భారత్లో పప్రదంగా కేరళ రాష్ట్రం లో మూడు పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యావి.

కేరళ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి కరోనా నమోదయిన ప్రాంతాలు నుండి వ్యాధి సోకిన వారి కుటుంబ సభ్యుల చుట్టూపక్కల వారిలో ఏమైనా వైరస్ ప్రభావం ఉందేమోనని పరీక్షలు జరిపారు.

హైద్రాబాద్లో కూడా ఓ కరోనా వైరస్ సోకిన వ్యక్తిని గురించారు. వెంటనే ఆ కుటుంబ సభ్యల ను కూడా రప్పించి పరీక్షలు జరిపించారు.

mask

ముంబాయి,పూణే లలో ఓ 6 కరోనా వైరస్ కేసులు ప్రాధమిక పరీక్షలో తేలి తగు జాగ్రత్తలు తీసుకొన్నారు.

ఏది ఏమైనా భారత్ లో కరోనా వైరస్ ప్రభావం, తీవ్రత నియంత్రణ లో నే వుంది, ఐనా భారత ప్రభుత్వ ఆరోగ్య శాఖ తగిన గైడ్ లైన్స్ దేశవ్యాప్తం గా ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వాల్ని సంసిద్ధం చేసింది.

COVID-19 యొక్క ప్రభావం ప్రపంచ ఆరోగ్యం,ఆర్ధిక రంగాలపై తీవప్రభావం చూపి సుమారు 72 లక్షల కోట్ల ఆర్ధిక నష్టాల్ని ప్రపంచ వాణిజ్య రంగం ఎదుర్కొంటుందని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు.

ఈ ప్రభావము ఇలా కొనసాగితే , పరిశ్రామిక ఉత్పత్తికి కుంటుపడి, ఉత్పత్తులు బాగా తగ్గిపోయి, పెట్టుబడులు, ద్వైపాక్షిక వాణిజ్యం నిలిచిపోయి, ప్రపంచ ఆర్ధిక వృద్ధి రేట్  ఇప్పటికే 2.4 శాతం గా వున్నది,  1.5 శాతానికి పడిపోవచ్చు అని అంచనా OECD సంస్థ(ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ) వేసింది.

ప్రపంచ మానవావళిని త్రీవ్రంగా భయబ్రాంతులకి గురిచేస్తున్న ఈ వైరస్ “బయో వెపన్స్” నిర్మాణం లో వున్న లోపకారణంగా బహిర్గతమైనదని ఓ వర్గం ఆరోపిస్తుంది.  “లోగుట్టు పెరుమాళ్ల కెరుక”

భారతీయ ఆయుర్వేద వైద్యవిధానం కరోనా వైరస్ సోకకుండా ఉండేటందుకు రెండు మూడు క్రియలు చూచింది.

1 . షాడాంగ్ పానీయం … ముస్తా, పర్పాట్, ఉషీర్, చందన్, ఉడీచ్యా మరియు నగర్ ల పొడిని 10 గ్రాములు ఒక లీటర్ నీటిలో వేసి బాగా మరిగించి ( సగం ఐయ్యే వరకు) సీసా లో నిలువవుంచి దాహం ఇప్పుడల్లా ఓ 50 ml త్రాగాలి.

2 . అగస్త్య హరిత్యకి 5 గ్రాములు, రోజుకు రెండుసార్లు వెచ్చని నీటితో సేవించాలి. అలానే సంషమణి వతి రోజుకు రెండుసార్లు.

3 . త్రికటు ( పిప్పలి, మిరియం, శొంఠి) పొడి 5 గ్రాములు మరియు తులసి ఆకులు (4 నుంచి 6 వరకు) ఒక లీటర్ నీటిలో వేసి బాగా మరిగించి ( అర లీటర్ ఐయ్యే వరకు చల్లార్చి గాజు సీసాలో భద్రపరిచి అవసరాన్ని పట్టి సేవించాలి.

4 . ప్రతి రోజు ఉదయం రెండు చుక్కల “అను తయలం” లేక నువ్వుల నూనె నాసికా రంధ్రములలో 2 నుంచి 3 చుక్కలు వెయ్యాలి.

హోమియోపతిక్ వైద్య విధానంలో ముందు జాగ్రత్తగా మరియు అనుమానం వున్నచో సేవించాల్చిన మందులు.

• ఓస్కిల్లోకాసీనుం-30
• ఆర్సెనిక్ ఆల్బం-30
• ఇన్ఫ్లుఎంజినుం-30

కారణాలు, ఆరోపణలు, సత్యాసత్యాలు పక్కన పెట్టి మానవ జాతి మనుగడ, ఉనికి నే ప్రశ్నిస్తున్న ఈ Coronavirus disease 2019 (COVID-19) ని ఎదుర్కొనటానికి ప్రపంచపాలకులంతా ఏకమై ముందుకు రావల్సిని అవసరం ఎంతో వుంది.

monalisa

ఆ చిరునవ్వు ఏది!?

ప్రకృతి నాశనం నీ నాగరి’కత’ ఐతే నీ ‘కథ’ ఇంతటితో కంచికేనా!!!??????

Leave a Reply

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!