
BAT
కరోనా! ఓ కరోనా!!
డయాబెటిస్ గురుంచి కంటిన్యూ చేద్దాం అని కూర్చున్నా… మిత్రులనుంచి ఫోన్లు, వాట్సాప్ కాల్స్, పోస్టింగులు … తంబీ కరోనా గురుంచి మంచి గా తెలుపవా అని!
“డయాబెటిక్” ని లూప్లో పడేసి! … కరోనాని మెయిన్ ట్రాక్ పైకి!! మిత్రుల కోరిక ముఖ్యం కదా జమానాలో!!!
నేడు ప్రపంచమంతా వినంగానే ఉలిక్కి పడే ఒకే ఒక్క పదం …. ” కరోనా”
అసలీ కరోనా ఏమిటి, ఎక్కడ పుట్టింది….ఎందుకింత కలవరపెడుతుంది?
తెలుసుకొందాం! ఊహలు, పుకార్లు పక్కనే పెట్టి లోగుట్టు ని రాబట్టి, ఎదుర్కొందాం!
“కరోనావైరస్లు” ‘క్షీరదాలు’ మరియు ‘పక్షుల’లో అనేక అంటు వ్యాధులకు కారణమయ్యే వైరస్ల సమూహం.
మానవులలో, కరోనావైరస్లు సాధారణంగా “జలుబు” వంటి తేలికపాటి శ్వాసకోశ అంటువ్యాధులకు కారణమవుతాయి.
ఇతర ప్రాణులలో రకాల వ్యాధులకు కారణమయ్యే ఈ కరోనా వైరస్ కోళ్లు మొదలైన ఈ రకం పక్షి జాతుల్లో ఎగువ శ్వాసకోశ రుగ్మతకు, ఆవులు మరియు పందులలో అతిసార వ్యాదులకి కారణమవుతాయి.
ఐతే, ఈ కరోనా తీవ్రత మారి …. “తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్” (SARS ) గా మొదటి సారి కన్పించింది.
ఇది 2002 నవంబర్ -2003 జులై మధ్యన దక్షిణ చైనా ప్రాంతం లో కనిపించిన వైరల్ శ్వాసకోశ వ్యాధి సుమారు 17 దేశాల్లో కన్పించి 774 మందిని పొట్టన పెట్టుకుంది. ఐతే
2004 నుంచి మరలా కనిపించలేదు.
ఈ వైరస్ సోకినవారి కి, జలుబు, ఫ్లూ, జ్వరం, గొంతునొప్పి, గొంతువాపు వచ్చి తీవ్రమైన శ్వాస ఇబ్బంది తో ప్రాణాలు కోల్పోయారు.
ఈ తీవ్రమైన “అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్” (SARS ) గుర్రపు పాదం ఆకారంలో వుండే గబ్బిలం మరియు సివెట్ అనే క్షీరదం కారణంగా “యున్నాన్” అనే ప్రాంతం నుండి వచ్చినది గా చైనా శాస్త్రవేత్తలు దీని జాడని 2017 లో కనుకొన్నారు.
తరువాత “మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్” (MERS). 2012 మొట్టమొదటి గుర్తించిన కేసు సౌదీ అరేబియా లో.
2012 లో లండన్లో మొట్టమొదటి సోకిన వ్యక్తిలో కనుగొనబడిన HCoV-EMC / 2012 అని పిలువబడే MERS-CoV యొక్క జాతి ఈజిప్టు సమాధి గబ్బిలాలతో 100% సరిపోలినట్లు కనుగొనబడింది.
దీనిని ఒంటె ఫ్లూ గా కూడా పిలిచారు. ఐతే 2012 లో ఎక్కువ కేసులు అరేబియన్ దీపకల్పం లోనే కన్పించాయి.
2015 మరియు 2018 ల మధ్య దక్షిణ కొరియలో విస్తృతంగా వ్యాప్తి చెందింది భయబ్రాంతులకి గురిచేసింది.
సౌదీ అరేబియా మరియు ఇతర దేశాలను (దక్షిణ కొరియాతో సహా) ప్రభావితం చేసిన 2018 లో మెర్స్(MERS) యొక్క మరింత వ్యాప్తి సంభవించింది, 2018 చివరి నాటి కి బాగా తగ్గుముఖం పట్టింది.
ప్రారంభం లో ఇది “అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్” గా భావించారు. ఐతే లాబొరేటరీ
పరీక్షల తరువాత మరో కొత్త వైరస్ గా భావించారు.
సౌదీ అరేబియా లోని అనేక లాబ్స్ లో పరిశోధించి మరియు రోగుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం కొన్ని కేసుల్లో కేవలం జ్వరం, కొన్ని కేసుల్లో తీవ్రమైన దగ్గు, శ్వాస ఇబ్బందులు మరియు కొన్ని కేసులలో విరేచనాలు, వాంతులు మొదలైనవి కన్పించాయి.
ఈ “మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్” (MERS) తీవ్ర రూపం దాల్చి న్యూమోనియాకి, మూత్రపిండాల విఫలం కి దారి తీసింది.
ఇప్పడు కరోనా వైరస్ డిసీస్ (COVID -19 ). చైనానుంచి విశ్వవ్యాప్తమై ప్రపంచ ఆరోగ్యాన్ని ప్రశ్నించి మానవాళికి ఓ ఛాలంజ్ ని విసిరిన కరోనా (COVID -19 ).
ప్రపంచ ఫైనాన్సియల్ పోసిషన్ ఓ కుదుపు కుదిపి “స్టాక్ మర్కెట్స్” ని అదో పాతాళానికి తొక్కిన కరోనా.
దీనిని గురించి క్షుణ్ణంగా, విపులంగా దాని లక్షణాలు ఇప్పటి ప్రపంచ స్థితి, విషమ పరిస్థితి, ఇంతలా అల్లకల్లోలము చేస్తున్న కొరోనా వాస్తవాలు,పుకార్లు, నివారణ అన్ని రకాల వైద్య విధానాలలో మరియు ముందస్తు జాగ్రత్తలు కూడా తెలుసుకొందాం….