ATM Card-Debit Card-Credit Card

ATM CARD/DEBIT CARD/CREDIT CARD  గురుంచి అవగాహన . . . .

డిజిటల్ యుగం లో వున్నాం. గత పది,పదిహేను సంవత్సరాలు గా పెరిగిన సాంకేతికత, ఎన్నో మార్పులు తెచ్చింది. అన్ని రంగాల్లో “డిజిటల్” అనే పదం చేరిపోయి పెనుమార్పులు కు శ్రీకారం చుట్టుంది.

వానిని తెలుసుకొని, నేర్చుకొని వినియోగించాల్సిన అవసరం సామాన్యులు కు కూడా ఏర్పడింది.

మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ అభివృద్ధి తో దాదాపు అన్ని పనులు ఆన్ లైన్ లో చేయూసుకొనే వెసులుబాటు లభ్యమైనది.

డిజిటల్ టెక్నాలజీ అన్ని రంగాల్లో చొచ్చుకుపోయినట్లే “బ్యాంకింగ్” రంగంలో కూడా ఎన్నో ఆధునిక విధానాలు వచ్చాయి.

ఇప్పడు మనందరి జేబుల్లో వున్నా ఎటిఎం/డెబిట్ కార్డు గురుంచి తెలుసుకుందాం!

ATM కార్డు ని బ్యాంక్ కార్డ్, క్లయింట్ కార్డ్, మనీ యాక్సెస్ కార్డ్, క్యాష్ కార్డ్, కీ కార్డ్ అనే పేర్లు తో కూడా పిలుస్తారు.

అసలు ATM అంటే ఏమిటి!? “ఎని టైం మనీ”  అని ఎక్కువ మంది అనుకొంటారు, కానీ అసలు అర్ధం “ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్”.

ఈ ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లను తొలి సారిగా జూన్ 27 , 1967 లండన్ లోని “బార్క్లేస్ బ్యాంక్” లో ప్రవేశపెట్టారు. ఇదే “ప్రపంచంలోని మొట్టమొదటి” ఎటిఎం .

ప్రపంచ వ్యాప్తం గా జరిగిన అనేక పరిశోధనల ఫలితమే ఇప్పడు మనం చూస్తున్న “ఎటిఎం”  రూపం.

ప్రపంచ వ్యాప్తం గా 1930 నుంచి లూథర్ జార్జ్ శింజియాన్, జాన్ షెఫర్డ్ బారన్, జేమ్స్ గుడ్ ఫెలో, డోన్ వెట్జర్, జాన్ డ్ . వైట్, జైర్స్ లార్సన్ లాంటి వారు జరిపిన పరిశోధనలు రూపొందించినదే  — ఇప్పడు మనం వాడుతున్న “ఎటిఎం”

స్కాటిష్ “జాన్ షెపర్డ్ బారన్” నే ఎటిఎం సూత్ర దారిగా చెప్పుకొంటారు. వీరి తల్లిదండ్రులు భారతదేశంలో ఉద్యోగరీత్యా ఉండేవారు. “జాన్ షెపర్డ్ బారన్” భారత దేశం లో పుట్టారు.

“స్కాట్ జేమ్స్ గుడ్‌ఫెలో ” ఇప్పడు మనం వాడుతున్న ఎటిఎం ని, ఎటిఎం కార్డు ని రూపొందించారు.

ఎటిఎం కార్డు లో దాగి వున్న టెక్నాలజీ గురుంచి తెలుసుకొందాం.

ATM కార్డు పరిమాణం 85.60 మిమీ × 53.98 మిమీ, మరియు 2.88–3.48 మిమీ వ్యాసార్థంతో గుండ్రని మూలలు కలిగి ఉంటుంది.

క్రెడిట్, డెబిట్ మరియు ఇతర కార్డులు వంటి ఇతర చెల్లింపు కార్డ్స్ కూడా ఇదే పరిమాణం కలిగి ఉంటాయి.

ఎటిఎం కార్డు ముందువైపు కార్డు హోల్డర్ పేరు, ఎటిఎం కార్డు నెంబర్( 16 అంకెలు), ఏ నెల/సంవత్సరం లో ఇచ్చారు, ఏ నెల/సంవత్సరం వరకు దాని చెల్లు బాటు ఉంటుందో వ్రాసి ఉంటుంది.

కార్డు వెనుక భాగంలో కార్డు గురించి సమాచారాన్ని కలిగి ఉన్న మాగ్నెటిక్ స్ట్రిప్, అలాగే కార్డు హోల్డర్ సంతకాన్ని చేసే స్థలం కలిగి ఉంటుంది.

ఏటీఎం కార్డుపై సంతకం లేకుండా ఉపయోగించటం మంచిది కాదు, అలానే చాలా చోట్ల అంగీకారము కాదు.

సంతకం పక్కన ఖాతా నంబర్ యొక్క చివరి నాలుగు అంకెలను సూచించే నాలుగు అంకెల సంఖ్య ఉంటుంది.

అలానే, కార్డ్ సెక్యూరిటీ కోడ్‌ను సూచించే మూడు అంకెల సంఖ్య ఉంటుంది.. ఈ సంఖ్య ఆన్‌లైన్ కొనుగోళ్లు చేయడానికి ముఖ్యం.

ఎటిఎమ్ మెషీన్ను ఉపయోగిస్తున్నప్పుడు మనము పిన్ కోడ్ ను కూడా నమోదు చేయవలసి ఉంటుంది.

ఈ బ్యాంకు నుంచి సీల్డ్ కవర్ తో వస్తుంది. ఇది “నాలుగు” అంకెలు కలిగి ఉంటుదని. ఈ పిన్ ని ఉపయోగించుకొవచ్చు లేక పిన్ మార్చుకొని వినియోగించుకోవచ్చు.

అలానే, అవసరం అని పించిన ప్రతిసారి పిన్ మార్చుకొనే వెసులుపాటు వుంది.

ఇప్పడు, మనకి బ్యాంకు వారు ఇస్తున్న ఎటిఎం/డెబిట్ కార్డు తో POS (పాయింట్ అఫ్ సేల్స్) మెషిన్ ద్వారా షాప్ లు/మాల్స్/ పెట్రోల్ బంక్స్ ఎక్కడైనా “కాష్” బదులు దీని ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

ఆన్‌లైన్ చెల్లింపులు చేయవచ్చు – ఇంటర్నెట్ ద్వారా ఈ-కామర్స్ సైట్స్ లో కి వెళ్లి కావలిసిన ఐటమ్స్ సలెక్ట్ చేసుకొని వాటి ఖరీదు ని చెల్లించవచ్చు.

కార్డు మీద వున్న 16 అంకెల కోడ్ మరియు కార్డు వెనుక వైపు వున్న సెక్యూరిటీ కోడ్ (CSC /CVV ) ని నమోదు చేసిన తరువాత మొబైల్ కి వచ్చిన ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్) ని తెలపటం ద్వారా ఖరీదు ను చెల్లించవచ్చు.

ఈ ఎటిఎం/డెబిట్ కార్డు పొరపాటున పోయినతో బ్యాంకు కు వారు ఇచ్చిన ఫోన్ నెంబర్ కి తెలపటం ద్వారా లేక SMS ఇవ్వటం ద్వారా “బ్లాక్” చెయ్యవచ్చు.

ఎటిఎం/డెబిట్ కార్డు ను ఉపయోగించటం ద్వారా నగదు ని వెంట ఉంచుకోవాల్సిన అవసరం తప్పుతుంది.

ఎటిఎం/డెబిట్ కార్డు కి మన ఫోన్ తో అనుసంధానం ఐ ఉంటుంది. కార్డు ఉపయోగించినపుడు ఫోన్ కి SMS వస్తుంది.

ఎటిఎం/డెబిట్ కార్డు గురుంచి మరికొన్ని టెక్నికల్ విషయాలు. కార్డు వెనుక కార్డు హోల్డర్ యొక్క విషయాలు నమోదు చేసిన మేగ్నటిక్ స్ట్రిప్ (నల్ల రంగు) వుంటుంది.

అలానే, CVV (కార్డు వెరిఫికేషన్ వేల్యూ) లేక CSC (కార్డు సెక్యూరిటీ కోడ్) కలిగివుంటుంది.

కొన్ని బ్యాంకు కార్డు కి అల్పబెట్స్ కి న్యూమరిక్ వేల్యూ జత చేర్చి ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు ఇంటర్నేషనల్ ట్రాన్సక్షన్స్ జరిపేటప్పుడు సెక్యూరిటీ ని మరింత కట్టుదిట్టం చేశారు.

ఇప్పడు, సైబర్ నేరాలుని అదుపు చెయ్యటానికి కార్డు లో “చిప్” ని అమర్చారు. పాత ఎటిఎం/డెబిట్ కార్డ్స్ ను ఈ కొత్త చిప్ కార్డు తో రీప్లేస్ చేసుకొని మరింత సెక్యూరిటీ ని పొందవచ్చు.

ఎటిఎం/డెబిట్ కార్డును కార్డు హోల్డర్స్ లో ఉంచుకొని కార్డు పాడవకుండా చూసుకోవాలి,అలానే పిన్ ని గుర్తు పెట్టుకోవటం మంచిది. (ఎక్కడ వ్రాయకుండా).

ఆన్ లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి కనుక మన ఎటిఎం కార్డు నంబర్స్ ను, పిన్ ని అలానే ట్రాన్సక్షన్స్ జరిపేటపుడు వచ్చే OTP ని ఎవరికీ చెప్పకూడదు.
బ్యాంకు వారు ఈ వివరాలను ఎప్పుడూ ఫోన్ చేసి అడగరు. కనుక ఎవరైనా అలా అడుగుతున్నారు అంటే అది మోసం చెయ్యటానికే అని గుర్తు పెట్టు కోవాలి.

క్రెడిట్ కార్డు : క్రెడిట్ కార్డు కూడా ఎటిఎం/డెబిట్ కార్డు లాగానే ఉంటుంది.

క్రెడిట్ కార్డు ఇచ్చేటప్పుడే క్రెడిట్ లిమిట్ ఇంత మొత్తం అని లిమిటేషన్ ఉంటుంది.

ఆ లిమిట్ కి లోబడి “కొనుగోలు” చేయాలి. తరువాత బిల్ మొత్తం మెయిల్ కి/ మొబైల్ నెంబర్ కి వస్తుంది.

దానిని ఆన్ లైన్ లో గాని, క్రెడిట్ కార్డు ఇచ్చిన ఇన్స్టిట్యూట్/బ్యాంకు కు వెళ్లి చెల్లించవలసి ఉంటుంది.

వారు, చెప్పిన తేదీలోపల చెల్లించ పొతే, ఆ అమౌంట్ పై వడ్డీ తో పాటు ఫైన్ కూడా వేసే అవకాశం వుంది.

ఇది, బ్యాంకు ను పట్టి, కార్డు జారీ చేసే అప్పడు తెలిపిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్టి మారుతుంటాయి.

క్రెడిట్ కార్డు ని వినియోగించే ముందు జాగ్రత్తలు పాటించాలి. లేనిచో తరువాత చాలా ఇబ్బందులకు గురి కావల్సివుంటుంది.

ఇంటర్నేషనల్ గేట్ వే లలో “పే”  చేసే అప్పడు కొన్ని సార్లు “ఓటీపీ” రాదు. అది గమనించి “పే” చేయాలి.
క్రెడిట్ కార్డు ని వాడనప్పడు దాని “స్విచ్ ఆఫ్” చేసే పద్దతి ఉంటుంది. అది తెలుసుకొని అలా ఆపి వేయటం శ్రేయస్కరం.

ఈ కార్డ్స్ వాడు కోవటానికి ఎంతటి సౌకర్యము, వెసులు బాటు ఉందొ, జాగ్రత్తలు పాటించక పొతే అంతటి అనర్ధాలు వున్నాయి.

తగిన జాగ్రత్తలు తీసుకొని ఎటిఎం/డెబిట్/క్రెడిట్ కార్డ్స్ వినియోగించి “డిజిటల్” ఇచ్చిన ఈ శౌలభ్యమ్ ని ఆస్వాదిస్తారని అభిలషిస్తూ…
.

2 Comments

  1. Shareef June 5, 2020
    • Zestguru June 5, 2020

Leave a Reply

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!