ఆనందం – జీవితం

ఆనందం- జీవిత మకరందం

Happy - Life- colorful

యుగ,యుగాలుగా “ప్రకృతి” లో రూపొందిన మొక్కలు, కీటకములు, పక్షులు, జంతువులు .. ఏక ఇంద్రియ, ద్వి ఇంద్రియ, తృతియ ఇంద్రియ, చతుర్ ఇంద్రియ, పంచ ఇంద్రియాలతో రూపొంది, “ప్రకృతి” ప్రాదేశితములై వున్నవి. ఇది సత్య దూరం కాదు కదా!

ఈ క్రియలను పొందటం ద్వారా అవి జీవిస్తూ , వాటి జాతి అభివృద్ధి చెందుతూ ప్రకృతి సమతుల్యత నొందటం ఎన్నో వందల వేల సంవత్సరాలుగా జరుగుతూ వుంది.  కదా!

పంచ ఇంద్రియాలతో పరివ్యాప్తమైన జంతువుల బ్రతుక్కి అవసర, అసంకల్పిత క్రియలు.. “ఆహార, భయం, నిద్ర, మైధునం”.

“మనసు” అనే ఆరవ ఇంద్రియ లబ్ధితో, ఆలోచనా జ్ఞానంతో జంతు ప్రపంచం నుంచి విడివడి “మనిషి” గా మారటం మొదటి ప్రక్రియ. ప్రకృతిలో తొలి విజయం.

life-unity

‘మనిషి’ గా మరి తన ప్రత్యేకత ను చూపుకొంటూ ప్రకృతి లో మేటి గా తన అవసరాలకు, ‘సుఖ సంతోషాలకు’ తగిన విధంగా ఎప్పటికప్పడు పాటుపడటం   ఓ లక్షణం!  ఓ లక్ష్యం!!   నిరంతర మై సాగుతూ వుంది … ఆ నాటి నుండి ఈ నాటి వరకూ!!!

“సుఖం”  అనేది విస్తృతమైన అర్థం కలిగి వున్నది.

లభ్యమైన వస్తువుల ద్వారా, స్థితి ద్వారా పొందిన అనుభవమే .. ‘సుఖం’  అని, దాని తాలూకు అనుభూతి పొందిన ఆరవ ఇంద్రియము ‘మనసు’ కు లబించిన లబ్ది ‘ఆనందం” ( సంతోషం). అని గ్రంథకర్తల అనుభవ సారాంశం!

ఆనందం వ్యక్తి గతమైన అనుభూతి ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఐతే,  వ్యక్తి గతమైన ఆ విషయం ఆ వ్యక్తి కుటుంబానికి , ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి చెంది అందరి ‘ఆనందానికి’ కారణమవుతుంది.

ఈ విషయం ఆటల్లో కానీ, ఇతర వ్యాపకాలలో కానీ సమిష్టి కృషి తో లేక వ్యక్తిగత ప్రతిభతో కానీ సాధించిన విజయం ఆ దేశం ప్రజలందరికీ చెంది సంబరాలతో ఆనందం పొందటం మనకు విశిదమే !

అంటే ‘ఆనందం’ కి ఓ పద్దు కానీ, ఓ సరిహద్దు కానీ వున్నాయని భావించటం ఆకాశాన్ని అద్దంలో చూడటం లాంటిదే.

అందుకే ఆకాశం నీ హద్దురా! అవకాశం వదలొద్దురా!! అన్నారు ఓ సినీ కవి.

మనం “ఆనందం” గురించి ఎంత మాట్లాడుకున్నా సరియిన నిర్వచనం ఇవ్వగలిగి తెలియ చెయ్యాలి అంటే దాన్ని ఓ అంశంతో ముడి పెట్టాల్సి వుంది.

ఇంకా సులభంగా అర్థం కావటానికి “నీరు” ఏ పాత్ర లో నింపితే ఆ “రూపం” పొందుతుందో” అలా “క్రియలు” కూడా అనేకాంశాలతో ముడిపడి  “మనసుకి”  రసానుభూతిని కలుగ చేసి “ఆనందం” తో నింపుతుంది.

మనం ఆ అంశాలలో ముఖ్యమైన వాటిని ఇక్కడ చేర్చి విషయసూచికల, అమూల్యమైన గ్రంథముల ఆధారంగా, విజ్ఞుల, ప్రాజ్ఞుల అనుభావాలనుంచి గ్రహించి, సంగ్రహించి వీలు వెంబటి మీకు తెలియ చేయటం మాకు ‘ఆనందం’.

మొట్టమొదిటిగా ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకొందామని, మీ అభిరుచులకు అనుగుణంగా, మీ సలహాలుకి తగిన ప్రాధాన్యతనిస్తూ  మరికొన్ని చేర్చాలని ఆశతో ఆనందం తో …

Om namah shivaya- Bliss

 

 

1.     సాహిత్యం/సంగీతం/చిత్రలేఖనం / శిల్పకళ
2.     గ్రామీణ /కుటీర పరిశ్రమలు /చేతి వృత్తులు 
3 .    క్రీడలు/జిమ్నాస్టిక్స్/అథెల్ట్స్
4.     ఫోటోగ్రఫీ /షార్ట్ ఫిలిం మేకింగ్ / డాక్యూమెంటరీ ఫిలిం / సినిమా 
5.     ఫైనాన్స్/షేర్స్/కమాడిటీస్ /ఫండ్స్ /సేవింగ్స్ 
6.     ఎడ్యుకేషన్ అండ్ కెరియర్
7.     ఫిలాసఫీ / సైకాలజీ
8.     యోగ / ప్రాణాయామ / బ్లిస్స్

Leave a Reply

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!