PAPAYA LEAF MEDICATED BENEFITS AND DENGUE FEVER

papaya tree

హలో మిత్రులారా!

ఒకవైపు కరోనా భయం తో ఉండగానే రుతువులు మారాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు తో వాగులు, చెరువులు,నదులు నిండుగా నిండివున్నాయి.

రైతులు హ్యాపీ. ప్రకృతి ఇచ్చిన జల సిరితో!  ఇక సకాలంలో ,విత్తనాలు,ఎరువులు మరియు రుణసహాయం అందితే వారికి చేతినిండా పని.

Indian farmer

దేశ ప్రధాన వృత్తి “వ్యవసాయం”.  రైతే రాజు, రైతే వెన్నెముక, జై కిసాన్ నినాదాలు గత 70 ఏళ్ల నుంచి విని విని “బట్టీయం ” ఐనదే కానీ వారి “బ్రతుకు” లో “భరోసా” రాలేదు.

పాలకులు ద్రుష్టి పెడుతున్నా, “దళారీ” మార్కెట్ మేజిక్ లాజిక్ లలో ఆరుగాలం పండించిన పంట మిగిల్చే “లెక్కలు” ఏఏటికి కా ఏడు “రెక్కలు” రాల్చిన చెమట “చుక్కలు” గా “గరీబు”విస్తున్నాయి.

అన్నదాతలు కడుపునిండా అన్నం తిని ఇంటిల్లిపాది సంతోషం గా వుండే దెప్పుడు!? 
శ్రమైకజీవన సౌందర్యం సొగసు, సొమ్ము రైతు ఇంటి గడప తొక్కినప్పుడే !!

MOSQUITO

వానాకాలం తో లాభాలు ఎన్నో,  ప్రజా ఆరోగ్యం పై పంజా విసిరే వ్యాధులు అంతకు మించే వున్నాయి.

ఈ కాలం లో పెరిగే ఈగెలు, దోమలు చేసే కీడు అంత ఇంతా కాదు. అలానే కొత్తనీరు వచ్చి చేరుతుంది. అలా నీటి కాలుష్యం పెరుగుతుంది.

ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా అంటువ్యాధులు ప్రజల ఆరోగ్యం “పాస్వర్డ్”  ను “క్రాక్”  చేసినట్లే!

ప్రజా ఆరోగ్య శాఖ ఎంత అప్రమత్తముగా వున్నా, మనము కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని “వ్యక్తిగత” శ్రద్ధతో పాటు కుటుంబ,పౌర సంఘ మేలు కూడా దృష్టితో మెలగటం అందరికి శ్రేయస్కరం.

అందరికి తెలిసిన మన పెరటి చెట్టు “బొప్పాయి” గురుంచి తెలుసుకొందాం!

ఈ మధ్యకాలం లో బొప్పాయి ని చాలామంది ఆహారం లో చేర్చు కొని అనేక ప్రయోజనాలు “ప్రకృతి” పరంగా పొందుతున్నారు!!

ఈ మార్పుకు దోహద పడిన అనేక మాధ్యమాలకు నమస్కారం!!!

మనకు ఆకు కూరలు గురుంచి తెలుసు, అలానే తాంబూలం లో వినియోగించే నాగవల్లి పత్రం (తమలపాకు) తెలుసు. కూరల్లో వేసుకొనే కరివేపాకు,పొదీనా ల గురుంచి కూడా తెలుసు.

PAPAYA LEAF

కానీ, బొప్పాయి ఆకు లో ఎన్నో “ఆరోగ్య” సుగుణాలు దాగి వున్నాయి అని ఎంతమంది కి తెలుసు!? తెల్సే ఉంటుంది లెండి. ఐనా ఒక్క సారి వివరంగా తెలుసుకొందాం!

బొప్పాయి ని “కారికా పాపయ” అని కూడా పిలుస్తారు. మెక్సికో దీని పుట్టినిల్లు.

దీని పండు/కాయ యొక్క లక్షణాలు గురుంచి గతంలో మనము జెస్టుగురు ద్వారా తెలుసుకున్నాం.

ఇప్పడు దీని “ఆకుల”ను వినియోగించటం ద్వారా మనము పొందే ఆరోగ్య మేలు గురుంచి తెలుసుకొందాం.

1 . వానాకాలంలో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా దోమ కాటువలన మలేరియా,డెంగు, ఎల్లో ఫీవర్ లాంటి వ్యాధులు వ్యాపిస్తాయి.

దీనిలో ముఖ్యంగా ఏ మధ్యకాలంలో ఎక్కువాగా వింటున్న వ్యాధి “డెంగు” .

డెంగు వ్యాధి లో కనపడే లక్షణాలు జలుబు,జ్వరం, తీవ్రమైన తల నొప్పి, వాంతులు , వికారం, అలసట, ఫ్లూ లక్షణాలు, కీళ్ల నొప్పులు మరియు శరీరం పై దద్దురులు కూడా కనిపిస్తాయి.

వ్యాధి తీవ్రతను బట్టి రక్తం లో ప్లేటిలెట్ లు తగ్గి పోతాయి. కోల్పోయిన ప్లేటిలెట్లను తిరిగి భర్తీ చేయాలి. లేక పొతే ప్రాణాపాయం!

ఈ విషయంలో బొప్పాయి ఆకు రసం ను తీసుకోవటం ద్వారా ప్లేటిలెట్ లు పెరిగి చక్కటి ఫలితాలు పొందుతున్నారు అని శాస్త్ర పరిశోధనల సారాంశం.

మరియు ఈ బొప్పాయి ఆకుతో చేసిన క్యాప్సూల్ లు కూడా చాలా కంపనీ లు తయారు చేస్తున్నాయి.

(ఆ క్యాప్సూల్ పేర్లు జస్ట్ గురు కి తెలిసినా ఇక్కడ కొన్ని కారణాల వలన తెలుపలేదు. తెలుసుకొందాం అని ఆసక్తి వున్న వారు వాట్సాప్ కానీ మెయిల్ కానీ చెయ్యగలరు)

2 . రక్తం లోని చెక్కెర శాతం బొప్పాయి ఆకులను వినియోగించటం ద్వారా నియంత్రించ వచ్చు అని తెలియవచ్చింది.

ఈ విషయంలో ఇంకా శాస్తీయ నిరూపణలు తెలియాల్సివుంది.

బొప్పాయి ఆకు పొడిని, మునగ ఆకు పొడిని, మెంతులు పొడిని తగు మోతాదులో కలిపి మధుమేహ వ్యాధికి అనువంశిక ఆయుర్వేద వైద్య విధానం లో వాడుతున్నారు అని తెలిసింది.

3 . బొప్పాయి ఆకుల్లో వున్న “పపైన్ ” ఎంజైమ్ చర్మ రక్షణ కలుగ చేయటం లో తోడ్పడుతుంది.

ఈ మధ్య చర్మ సౌందర్య సోపులు, క్రీం లలో బొప్పాయి ఆకుల ఎక్సట్రాక్టును వినియోగిస్తున్నారు. తలవెంట్రుకల రక్షణ కోసం వాడే నూనెలు, సాంపూలలో వినియోగిస్తున్నారు.

PAPAYA LEAVES

బొప్పాయి ఆకులలో వున్న విటమిన్లు, అంటి ఆక్సిడెంట్ లు చర్మ సంరక్షణ విషయం లో పని చేస్తాయి అని తెలిసింది.

ఈ మధ్య ఎక్కువగా హెర్బల్ టీ లు వస్తున్నాయి. వానిలో బొప్పాయి ఆకుల పొడిని కూడా కలిపి తయారు చేస్తున్నారు.

ఐతే మనకు లేత ఆకులు దొరికితే,తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండపెట్టి మెత్తగా పొడి చేసుకొని, వస్త్రకాలితం (పలుచటి గుడ్డ తో జల్లెడపట్టి) చేసి గాజు సీసాలో భద్ర పరిచి ఉంచుకోవాలి.

HERBAL TEA POT

వానాకాలం లో రోజు మార్చి రోజు 250 ఎం.ఎల్ నీటిలో ఓ 10 గ్రాముల పొడిని వేసి మరిగించి, గోరు వెచ్చగా ఐన తరువాత త్రాగితే మంచి అంటి ఆక్సిడెంట్ లు,విటమిన్ లు శరీరానికి ప్రకృతి పరంగా లభించి, సీజనల్ వ్యాదులనుంచి రక్షణ పొందవచ్చు.

ఈ బొప్పాయి ఆకు టీ జీర్ణ కోశ రక్షణ కలుగ జేస్తూ, మలబద్దక నివారణలో కూడా సహాయకారిగా ఉంటుంటుంది.

అలానే స్త్రీ బహిష్టు నొప్పుల నివారణలో కూడా ఈ బొప్పాయి ఆకు టీ దోహదపడుతుంది.

ఆధునికత, సులభతర వినియోగ విధానాలు, నమ్మకం తగ్గటం,శాస్త్ర నిరూపణలు లేకపోవటం ఇలా ఎన్నో విషయాలే కాకుండా వందల ఏళ్ల విదేశీ పాలన, “దేశీయ వైద్య విధానాలు దూరం”  ఐయ్యాయి.

capture the nature

ప్రకృతి మన చుట్టూ ఎన్నో రక్షణ వలయాలు ఏర్పరిచింది.

ఈ వలయాలులో వున్న రహస్యాలని తెలుసుకొని, నమ్మకంతో వినియోగించి తక్కువ ఖర్చు తో ఎక్కువ మేలు పొందుతారని ఆశిస్తూ.

ఆరోగ్యం ఉంటే అన్నీవున్నట్లే! ఆరోగ్యమే మహా భాగ్యం !! ఆరోగ్యమే ఆనందం!!!

6 Comments

  1. vraju.karumuri August 25, 2020
    • Zestguru August 28, 2020
  2. Venkata Rao Taticherla August 25, 2020
    • Zestguru August 28, 2020
  3. srinivas August 25, 2020
    • Zestguru August 28, 2020

Leave a Reply

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!