గిడుగు రామమూర్తి “వ్యవహారిక భాషా” ఉద్యమం గురుంచి తెలుసుకొందాం!

AUGUST 29TH TELUGU LANGUAGE DAY

 

హలో మిత్రులారా!

కోవిడ్ వుంది. రోజూ వ్యాపిస్తూనే వుంది. వందలు నుంచి వేలకు .. వేల నుంచి లక్షకు …అంకెల్లో ప్రగతి సాధించింది.

మానవ మనుగడపై విసిరిన ఛాలంజ్ నుంచి అటు, ఇటూ తిరుగుతూ “నేడు” కి చేరుకున్నాం. ఎటూ పాలుపోని “స్థితి – పరిస్థితి”.

సెప్టెంబర్ 1 నుంచి “అన్ లాక్ 4 ” … మరింత వెసులు బాటు.

ఎదురు చూస్తున్నాం వాక్సిన్ కోసం. పేద,దిగువ,మధ్య తరగతి వారు సాధారణ జీవనం గడపాలి అంటే గడప దాటాలి కదా.

కష్టాలు వచ్చినపుడు కలిసి కట్టుగా సాగి పోరాడటం కొత్త కాకపోయినా, ఇక్కడ “కలిసి కట్టు” అనేది “కరోనా” విషయం లో కుదిరేది కాదు! కదా!?

ఎవరి జాగ్రత్తలే వారికి రక్ష, స్వీయ రక్ష! కుటుంబ రక్ష!! సమాజ రక్ష!!! దేశ రక్ష!!!! జగతికి రక్ష!!!!

తెలుగు భాష ని ఇంత సులభంగా “వాడుక భాష” లో రాయటానికి దోహదం చేసి ఎంతో కస్టపడి తన జీవితమంతా పాటు బడిన మహనీయుని గురుంచి తెలుసుకొందాం.

ఓ తెలుగు బ్లాగర్ గా కనీస బాధ్యత అలాంటి మహనీయుడిని గురుంచి తెలుసుకోవటం! అలానే గుర్తు చేసుకోవటం!!

గిడుగువారి జయంతి

వంశధార నది ప్రాంతమైన “పర్వతాలపేట” లో 29 ఆగష్టు 1864 జన్మించారు. ఇది ఒరిసా కి సరిహద్దు ప్రాంతం. శ్రీకాకుళం జిల్లా.

ఆ రోజుల్లో తెలుగు సాహిత్యం లో, పాఠ్య పుస్తకాలు లో “గ్రాంధిక భాష” (స్కాలస్టిక్ లాంగ్వేజ్) నే వ్రాయటానికి వినియోగించే వారు.

గ్రాంధిక భాష లో ఎక్కువగా సంస్కృత పదములతో పాటు శాస్త్రీయ (క్లాసికల్)తెలుగు వుండి. సామాన్యులకి ఇబ్బంది కలిగించే విధం గా ఉండేది.

దీనిని సరళీకృతం చేయటానికి అంటే ఏ విధంగా ఐతే మనం మాట్లాడుతామో/ పలుకుతామో ఆవిధంగానే రాయటానికి.

అందరికి, సులభముగా అర్ధం అవటానికి అనువుగా మార్చి “భాష” ని “వ్యవహారిక భాషా” / “వాడుక భాష” గా రూపాంతరం చేసిన “భాషా బ్రమ్మ” గిడుగు వేంకట రామమూర్తి ” .

ఈ ప్రక్రియలో అర్ధం మారకుండా తెలుగులోని సొగసును,మధురిమను, అందాన్ని మరియు స్పష్టతను ఇమిడి ఉండేలా చేసిన ఆయన ప్రయోగాలు నేడు మనం స్వేచ్ఛగా వాడుక గా వాడుతున్న “తేట తెలుగు”,

అతను ఓ భాషా వేత్త. అనేక భాషలు సరళముగా సుస్పష్టముగా మాట్లాడేవారు. ఒక విధంగా చెప్పాలంటే నేటి తెలుగు భాష కి బాటలు వేసిన “సాహసి” “విప్లవమూర్తి”.

“గ్రాంధిక భాష” (స్కాలస్టిక్ లాంగ్వేజ్) ను ఆ రోజుల్లో ఎక్కువగా పండితులు, గ్రంథకర్తలు వారి వారి రచనలో వినియోగించేవారు. రాయటానికి, పలకటానికి కొన్ని ఇబ్బందులు ఉండేవి.

“వ్యవహారికము” గా జరిగే భాషకు ఈ పాండిత్య భాషకు పొంతన ఉండేది కాదు. ఎక్కువమందికి ఈ “గ్రాంధికభాష” లో వున్న సాహిత్యము,పాఠ్య పుసకములు కొరకరాని కొయ్యలు గా ఉండేవి.

గిడుగు వారు ఈ విషయము లో విభేదించి, వాడుకలో ఎలా వ్యవహిరిస్తూ పలుకు తామో ఆవిదంగానే “రాస్తే ” సులభముగా ఉంటుంది అని నమ్మకం తో చెప్పారు.

అందరికి అన్ని విషయాలు పై ఆసక్తి కలుగుతుందని, అన్ని వర్గాలు వారు భాష పై పట్టు సాధించి,వినియోగం పెరిగి, బాషా విస్తృతి పెరుగుతుంది అని వారి నిచ్చయ నమ్మకం.

ఆ రోజుల్లో పాఠశాలలు, కాలేజీలు లో చెప్పే “గ్రాంధిక భాష” (స్కాలస్టిక్ లాంగ్వేజ్) భాష ముఖ్యముగా గ్రామీణ ప్రాంతంలోని తెలుగువారికి “అర్ధం” కాక ఆమడ దూరంలో ఉండేది.

గిడువు వారి తండ్రి, ఆయన చిన్న తనములోనే చనిపోయారు. వారి పాఠశాల కి,కాలేజీలు వెళ్లి చదువుకున్నది తక్కువ. వారి విద్యాభ్యాసం అంత “ప్రైవేట్” గానే సాగింది.

EDUCATION IS PRIMEMOER

ప్రజల అభివృద్ధి అంతా చదువు పైనే ఆధారపడి ఉంటుంది.

గ్రాంధిక భాషా ఇబ్బందుల వలన ఎక్కువమంది చదువు కోనే అవకాశం లేక కొన్ని వున్నత వర్గం వారికి మాత్రమే వీలు, సౌలభ్యం కలిగింది.

దానితో సామాజం లోని మిగిలిన వారు చదువుకు దూరం అయ్యారు. సమాజములో అసమానత పెరిగింది. సహజమే కదా.

గిడుగు వారు సాంఘిక సంస్కర్త, హేతువాది మరియు చరిత్రకారుడు.

భాషా సమస్య మూలంగా సమాజములో పెరిగి పోతున్న అంతరాన్ని తగ్గించటానికి “భాష” పై అందరికి పట్టు ఉండాలి అని తొలిసారిగా భావించారు. అలానే చివరి వరకూ అలసి పోకుండా పోరాడారు.

తెలుగు భాషకు ఆయన చేసిన సహకారానికి, కృషికి ఆయన పుట్టిన రోజు, ఆగస్టు 29 న “తెలుగు భాషా దినోత్సవం” లేదా “తెలుగు భాషా దినం” గా జరుపుకుంటున్నాము.

ఈ విషయం చాలామందికి తెలియాలనే నేడు “జెస్టుగురు” వారిని స్మరించుకుంటూ మీ ముందుకు ఈ చిన్ని ప్రయత్నం!

వారి గురుంచి మరి కొన్ని విశేషాలు వారి తల్లి శ్రీమతి వెంకమ్మ తండ్రి శ్రీ వీరరాజు, వీరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేస్తూ పరమపదించారు.

అప్పడు రామమూర్తి గారికి 12 ఏళ్ళు. సోదరి గారి ఇంటిలో ఉంటూ మెట్రికులేషన్ పాసైయ్యారు. గురజాడ అప్పారావు రామమూర్తికి తోటి విద్యార్థి. 

పిమ్మట వారు “పర్లాకిమిడిలోని గజపతి మహారాజా పాఠశాలలో” ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

వారు బహు భాషా కోవిదులు. వారు భాషలపై పట్టు సాధించిన తరువాత వారు గమనించిన రెండు ముఖ్యమైన విషయాలు మొదటిది “సరళత,ప్రాప్యత (సౌలభ్యం) మరియు రెండవది ప్రజాదరణ.

భాష విస్తృతం కావాలంటే దానికి ప్రజాదరణ కావలి. తెలుగు భాష ని ఈ మార్గంలో కి తీసుకు రావాలి అనుకొన్నారు.

వ్రాత లో కూడా సరళముగా వుండి, పలకటానికి సౌలభ్యం గా వుంటే కానీ మేలు జరగదు అని భావించారు.

ఈ విషయము పై ఓ యుద్ధం చేశారు. తెలుగు సాహిత్యములో, పాఠ్య పుస్తకాలలో “వ్యవహారిక భాష” విషయాలపై “తెలుగు” అనే పత్రికను నడిపారు.

గ్రాంధికం – వ్యవహారికం

1914 నుండి 1933 వరకూ సాగిన సుదీర్ఘ భాషా పోరాటం లో ఎన్నో మలుపులు తిరిగినా పండితులు,సంఘ సంస్కర్తలు శ్రీ వీరేశలింగం, చిలుకూరి నారాయణరావు మరియు తాపి ధర్మారావు వారి తోడ్పాటు తో ముందుకు సాగారు.

ఆవిధముగా పండితులు, బాషా కోవిదులు వీరి “వ్యవహారిక భాష” విధానం పై ఆసక్తి కనపర్చక అడుగడునా అడ్డు తగిలినా మొక్కవోని దైర్యం తో వారిని ఎదుర్కొని విజయం సాధించారు.

1937 నుండి దాదాపు అందరు వాడుక భాషను గ్రంధాలలో, పాఠ్య పుస్తకాలలో, పత్రికలో వాడటం ప్రారంభించారు.

అంతటిలో ఆగకుండా వారి చుట్టు ప్రక్కల శ్రీకాకుళం జిల్లాల ఏజన్సీ ప్రాంతం లో వున్న గిరిజనుల భాషల పై ద్రుష్టి మరల్చారు.

ఆ భాషల్లో ముఖ్యమైన “సవర” భాష కి లిపిని తయారు చేశారు! ఇంకా ఆశ్చర్యకరమైన విషయం!! ఆ భాషకు ఓ “నిగంటువు” ని తయారు చెయ్యటం!!

ఈ ప్రయత్నం లో వారు అనేక గిరిజన ప్రాంతాల్లో విస్తృతం గా తిరగటం వలన ఆయనకు మలేరియా సోకింది.

అనేక ఆరోగ్య సమస్యలు తో సతమతమయ్యారు. అయినా పట్టువీడక అవిశ్రాంత కృషి జరిపారు. వినికిడి సమస్య తో ఇబ్బంది పడ్డారు.

భాషల పట్ల ఆయనకు వున్న నిబద్ధతకు ఇంతకన్నా ఇంకేమి తార్కాణం కావలి!

ఎవరైతే మొదటిలో వారి విధానాల పట్ల సుముఖత చూపలేదో వారే మెచ్చు కొనేలా చేసిన “పిడుగు” గిడుగు వారు.
వేయిపడగల విశ్వనాధులు వారు గిడుగు వారిని మెచ్చు కుంటా పలికిన పలుకులు — “గిడుగు తెలుగు నేర్చుకునే దేవత ‘సరస్వతి’ యొక్క ఆశీర్వాద బిడ్డ. ”

SALUTE TO YOU SIR

వారు జీవించిన 77 ఏళ్ళ జీవితంలో 60 ఏళ్ళ బాషా సేవ! ఎంతటి అమూల్యమైన సేవా జీవితం!!
గిడుగు వారు చేసిన అచంచల, అవిశ్రాన్త “వ్యహారిక భాష” పోరాటం తెలుగు భాష ఈ భూమి పై వున్నంత వరకు అజరామర మై నిలుస్తుంది!!!

Leave a Reply

Subscribe To Our Newsletter

Join our mailing list to receive the latest news and updates from our team.

You have Successfully Subscribed!